CPI Kalajatha on 19th
19న జరిగే సిపిఐ ప్రచార జాతా విజయవంతం చేయాలి
సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్
భూపాలపల్లి నేటిధాత్రి
సిపిఐ 100 సంవత్సరాల ముగింపు సందర్భంగా ఈనెల 19న జిల్లాలో నిర్వహించే సిపిఐ కళాజాతాను విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఏఐటియుసి కొమురయ్య భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రాజ్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ.. సిపిఐ పార్టీ 100 సంవత్సరాల ముగింపు ఉత్సవాలు నవంబర్ 15న ఆదిలాబాద్ జిల్లా జోడేఘాట్ నుండి భద్రాచలం వరకు ప్రచార జాత ప్రారంభమైనట్లు తెలిపారు. ఈ ప్రచార జాతా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కల్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేని శంకర్ లు హాజరవుతున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఆదిలాబాద్ మంచిర్యాల, గోదావరిఖని, హుస్నాబాద్ హనుమకొండ మీదుగా ఈనెల 19న సాయంత్రం 4:30 గంటలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలానికి కళాజాత బృందం చేరుకుంటుందని, అదే రోజు 5:30 గంటలకు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో స్థానిక అంబేద్కర్ సెంటర్లో బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. అనంతరం రాత్రి భూపాలపల్లి జిల్లా కేంద్రంలోనే బస చేసి ఉదయం 10 :30 గంటలకు గణపురం నుండి ములుగు జిల్లాకు కళాజాత చేరుకుంటుందని రాజకుమార్ తెలిపారు. కావున జిల్లాలో ఉన్న సిపిఐ పార్టీ శ్రేణులు, అనుబంధ సంఘాల నాయకులు, సింగరేణి కార్మికులు, కూలీలు, రైతులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సిపిఐ కళాజాతాను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
భారీ బైక్ ర్యాలీ :
ఈనెల 19న సిపిఐ పార్టీ ముగింపు ఉత్సవాల్లో భాగంగా ప్రచార జాతా లో భాగంగా మంజూరు నగర్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ బైక్ ర్యాలీ ఉంటుందని కళాజాత అతిధులను మంజూరు నగర్ లో భారీ ఆహ్వానం పలికి పైకి ర్యాలీ ద్వారా భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో సిపిఐ నాయకులు మోటపలుకుల రమేష్, సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్, సిపిఐ జిల్లా నాయకులు క్యాతరాజు సతీష్, నేరెళ్ల జోసెఫ్ ఎండి. అస్లాం నవీన్ తదితరులు పాల్గొన్నారు.
