· పూర్తిస్థాయి రక్షణ, ఆర్థిక మంత్రిత్వశాఖలు నిర్వహించిన రెండో మహిళ
· నిర్మలమ్మ ఆర్థిక మంత్రిగా ప్రపంచంలోనే నాలుగో ఆర్థిక వ్యవస్థగా భారత్
· రూ.12లక్షలకు పన్ను పరిమితిని పెంపుతో మధ్యతరగతికి వూరట
· కార్పొరేట్ పన్ను 30% నుంచి 22%కు తగ్గింపు
· జవహర్లాల్ యూనివర్సిటీ నుంచి 2019లో “డిస్టింగ్విష్డ్ అలూమినీ అవార్డ”
· పీఎం స్వనిధి కింద వీధి వ్యా పారులకు రుణాలు
· నగరాల్లో “వీక్లీ హాట్స” (స్ట్రీట్ ఫుడ్ హబ్స్) ఏర్పాటుకు చర్యలు
· ఏడుసార్లు ఫోర్బ్స్ శక్తివంతమైన మహిళల జాబితాలో స్థానం
· తమిళనాడు పుట్టిల్లు, ఆంధ్ర మెట్టినిల్లు
హైదరాబాద్, నేటిధాత్రి:
ప్రముఖ ఆర్థికవేత్త, బీజేపీ నాయకురాలు నిర్మలా సీతారామన్ ప్రస్తుతం భారత ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. 2019 నుంచి ఆమె ఈ పదవిలో కొన సాగుతున్నారు. అంతకుముందు ఆమె రక్షణ మంత్రిత్వశాఖను నిర్వహించారు. 2016 నుంచి కర్ణాటక రాష్ట్రం నుంచి ఆమె రాజసభ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. 1959 ఆగస్టు 19న మదురై (తమిళనాడు) పట్టణంలో జన్మించారు. సీతాలక్ష్మి కళాశాలలో చదువుకున్న ఆమె 1980లో ఆమె ఆర్థశాస్త్రంలో డిగ్రీ పట్టాను పొందారు. తర్వాత ఆమె ఎకనామిక్స్, ఫిలాసఫీల్లో పోస్ట్ గ్రా డ్యుయేట్ డిగ్రీని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీనుంచి పూర్తిచేశారు. నిర్మలా సీతారామన్ 2008లో బీజేపీలో చేరి 2010 నుంచి 14 వరకు పార్టీ ప్రతినిధిగా వ్యవహరించారు. 2014లో నరేంద్రమోదీ తొలి మంత్రివర్గంలో ఆమె వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖకు సహాయమంత్రిగా ఇండిపెండెంట్ చార్జ్‌తో పనిచేశారు. ఈ పదవిలో 2017 సెప్టెంబర్ వరకు కొనసాగారు. 2014 మే నుంచి నవంబర్ వరకు ఆమె స్వల్పకాలం పాటు ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల సహా యమంత్రిగా విధులు నిర్వర్తించారు. మంత్రిపదవిని చేపట్టిన తర్వాత 2014 జూన్‌లో ఆంధ్ర ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2017 సెప్టెంబర్‌లో దేశానికి 28వ రక్షణశాఖ మం త్రిగా నియమతులయ్యారు. మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 మే 30న ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాలశాఖ మంత్రిగా నియుక్తులయ్యారు. ఐదేళ్లపాటు ఇదే పదవిలో కొనసాగిన ఆమె, 2024లో మూడోసారి మోదీ ప్రభుత్వం కొలువుదీరగా ఇదే పదవిలో ఇప్పటికీ కొనసాగుతున్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రక్షణ, ఆర్థిక శాఖలను నిర్వహించిన తొలి మహిళగా ఆమె చరిత్ర సష్టించారు. దేశంలో మధ్యలో విరామం లేకుండా సుదీర్ఘకాలం ఆర్థిక మంత్రిగా పనిచేసిన సి.డి.దేశ్‌ముఖ్ (1950`56)ను అధిగమించి, ఆ రికార్డును బద్దలు కొట్టారు. అంతేకాదు 2026 ఫిబ్రవరిలో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో, ఆమె వరుసగా 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా మరో మైలురాయిని దాటారు.
తమిళ అయ్యంగార్ కుటుంబానికి చెందిన ఆమె తల్లిదండ్రులు, సావిత్రి, నారాయణన్ సీతారామన్. ఆమె తండ్రి ఇండియన్ రైల్వేస్‌లో పనిచేశారు. విల్లూపురంలోని సేక్రెడ్ హార్ట్ కాన్వెంట్ ఆం గ్లో`ఇండియన్ స్కూల్, చెన్నైలోని విద్యోదయా పాఠశాలలో తన పాఠశాల విద్యను పూర్తిచేశారు. ఆమె dంట్. ఫి¾లోమినా స్కూల్ నుంచి ఎసఎసఎల్సీ ఉత్తీర్ణత సాధించగా, తిరుచురాపల్లిలోని ీVAలీ క్రాస్ స్కూల్లో తన హయ్యర్ సెకsడరీ విద్యను పూర్తిచేశారు. తిరుచిరాపల్లిలోని సీతాలక్ష్మీ రామస్వామి కాలేజీలో చదివి ఎకనామిక్స్‌లో డిగ్రీ (1980) సాధించారు. తర్వాత ఢిల్లీలోని జవహర్లాల్ యూనివర్సిటీ నుంచి 1984లో ఎకనామిక్స్, ఫిలాసఫీల్లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. తర్వాత ఆమె ఎకనామిక్స్‌లో పీహెచ్డీ కోసం తన పేరు నమోదు చేసుకున్నప్పటికీ, మధ్యలోనే దాన్ని నిలిపేసి, లండన్ వెళ్లిపోయారు. ఆమె భర్త పరకాల ప్రభాకర్‌కు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో స్కాలర్షిప్ రావడం ఇందుకు కారణం.
లండన్ వెళ్లిన తర్వాత రీజెంట్ స్ట్రీట్ (లండన్)లోని ీVAమ్ డెకాన్ స్టోర్‌లో ఆమె సేల్స్‌పర్సన్‌గా పనిచేశారు. తర్వాత అగ్రికల్చరల్ ఇంజినీర్స్ అసోసియేషన్‌లో ఒక ఆర్థికవేత్త వద్ద అసిస్టెంట్గాకొంతకాలం, ప్రిన్స్ వాటర్‌హౌజ్ కూపర్స్‌లో ఆర్Ê డి సీనియర్ మేనేజర్‌గా మరికొంతకాలం, బీబీసీ వరల్డ్ సర్వీస్‌లో స్వల్పకాలం పనిచేశారు. 1991లో ఇండియాకు తిరిగివచ్చిన తర్వాత సెంటర్ ఫర్ పబ్లిక్ పాలసీ సర్వీసెస్ (హైదరాబాద్)లో డిప్యూటీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 2004లో ఆమె ప్రణవ పేరుగల ప్రైవేటు కో`ఎడ్యుకేషన్ స్కూల్‌కు సహవ్యవస్థాపకులుగా వున్నారు. 2003లో నేషనల్ కమిషన్ ఫర్ వుమెన్‌లో సభ్యురాలిగా నియమితులై 2005 వరకు ఇదే పదవిలో కొనసాగారు.
2006లో ఆమె బీజేపీ సభ్యత్వం తీసుకోగా 2008లో నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో సభ్యురా లిగా నియమితులయ్యారు. 2010లో పార్టీ అధికార ప్రతినిధిగా నియమితులై 2014 వరకు ఆ పదవిలో కొనసాగారు. తర్వాత మోదీ ప్రభుత్వంలో రక్షణ మంత్రిత్వశాఖను నిర్వహించిన ఆమె, ఇందిరాగాంధీ తర్వాత ఈ పోర్ట్‌పోలియోను నిర్వహించిన రెండో మహిళగా రికార్డు సష్టించారు. ఈమె రక్షణమంత్రిగా వున్న కాలంలోనే 2019 ఫిబ్రవరి 26న భారత వాయుసేన, బాలాకోట్ దాడులు నిర్వహించింది. అదే ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో మోదీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడంతో, నిర్మలాసీతారామన్‌కు ఈసారి ఆర్థిక మంత్రిత్వ బాధ్యతలు అప్పగించారు. 2019, మే 30న ఆమె ఈ బాధ్యతలను స్వీకరించారు. ఇందిరాగాంధీ తర్వాత పూర్తిస్థాయి రెండో మహిళా ఆర్థిక మంత్రిగా మరో చరిత్ర సష్టించారు. కోవిడ్`19 మహమ్మారి సమయంలో “కోవిడ్`19 ఎకనామిక్ రెస్సాన్స్ టాస్క్ఫోర్స” కు ఇన్`చార్జ్‌గా వ్యవహరించారు. ఈమె హ యాంలోనే 2022లో మనదేశం ప్రపచంలో ఐదో బలమైన ఆర్థిక వ్యవస్థగా, 2025లో నాలుగో పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందడం విశేషం. ఆర్థికమంత్రిగా ఆమె బాధ్యతలు స్వీకరించక ముందు మనదేశం ప్రపంచంలో పదో ఆర్థిక వ్యవస్థగా వుండేది. ఆర్థికమంత్రిగా ఆమె కార్పొరేట్ ప న్నును 30% నుంచి 22%కు తగ్గించారు. అదే కొత్త కంపెనీలకు ఇది 15% మాత్రమే. పది జాతీయ బ్యాంకులను విలీనం చేసి నాలుగు పటిష్టమైన ప్రభుత్వ రంగ బ్యాంకులుగా తీర్చిదిద్దా రు. కోవిడ్ సమయంలో రూ.20లక్షల కోట్ల ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీని ప్రకటించి దేశ ఆర్థిక వ్యవస్థను ఆదుకున్నారు. యూపీఐ చెల్లింపులు, డిజిటల్ ఆర్థిక లావాదేవీలను ప్రోత్సహించడం లో కీలకపాత్ర పోషించారు. మేకిన్ ఇండియా కింద దేశీయంగా రక్షణ ఆయుధాల తయారీని ప్రోత్సహించారు. సుఖోయ్`30ఎంకేఐ యుద్ధ విమానంలో ప్రయాణించిన తొలి మహిళా రక్షణ మంత్రిగా గుర్తింపు పొందారు. దేశాన్ని గ్లోబల్ ఫార్మారంగంలో తయారీ కేంద్రంగా మార్చేందుకు రూ.10వేల కోట్లతో కొత్త పథకాన్ని ప్రారంభించారు. చిన్న మధ్యతరహా కంపెనీలను ప్రోత్స హించేందుకు రూ.10వేల కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశారు. రైతులకు వ్యవసాయ సమాచారాన్ని అందించేందుకు బహుభాషా “ఏఐ”ని ప్రవేశపెట్టారు. పర్యావరణ పరిరక్షణ కోసం కా ర్బన్ క్యాప్చర్ సాంకేతికతపై రూ.20వేల కోట్ల పెట్టుబడి పెట్టాలని నిర్ణయించారు. మధ్యతరగతి ప్రజలకు పన్ను ఉపశమనాన్ని కల్గిస్తూ రూ.12లక్షల వరకు ఆదాయం వున్నవారికి పన్ను మినహాయింపు లభించేలా ఆదాయపు పన్ను శ్లాబులను సవరించారు. పీఎం స్వనిధి కింద వీధి వ్యా పారులకు రుణాలు అందించి ఆర్థికంగా ఆదుకునే కార్యక్రమం చేపట్టారు. వీటిని మరింత విస్త రిస్తూ నగరాల్లో “వీక్లీ హాట్స” (స్ట్రీట్ ఫుడ్ హబ్స్) ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు.
జవహర్లాల్ యూనివర్సిటీ ఆమెకు 2019లో “డిస్టింగ్విష్డ్ అలూమినీ అవార్డ”ను ప్రదానం చేసింది. 2024లో ప్రముఖ ఫోర్బ్స్ మ్యాగజైన్ ఆమెను ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళల్లో 24వ వారుగా పేర్కొంది. ఈవిధంగా ఫోర్బ్స్ శక్తివంతమైన మహిళల జాబితాల్లో చోటు సంపాదించడం వరుసగా ఏడవసారి! 2019(34), 2020(41), 2021(37), 2022(36), 2023(32), 2024(28)వ ర్యాంకులను పొందడం విశేషం. ఎకనామిక్ టైమ్స్ అవార్డ్స్`2021లో ఆమె “బిజినెస్ రిఫార్మర్ అవార్డు”ను స్వీకరించారు.
ఆమె జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిలటీలో చదువుతున్న కాలంలో, ఆంధ్రప్రదేశ్‌లోని నర్సా పురానికి చెందిన పరకాల ప్రభాకర్‌తో పరిచయం 1986లో వివాహంగా మారింది. ఈ దంప తులకు ఒక కుమార్తె పేరు వా్మఙయి. ఆమె జర్నలిస్టుగా వున్నారు. 2014`18 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పరకాల ప్రభాకర్ సమాచారశాఖ సలహాదారుగా పనిచేశారు. ట్రెక్కిం గ్, ప్రయాణాలు,వంట చేయడం నిర్మల సీతారామన్‌కు ఇష్టమైన వ్యాపకాలు.
