
AMC Chairman Narukudu Venkataiah
*తొలకరి పలకరింపులతో మొదలైన సాగుబడి.
వర్ధన్నపేట ఏఎంసీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య*
ఏరువాకకు సిద్ధం అంటున్న రైతులు- రైతన్నలకు బాసటగా నిలుస్తున్న ప్రజాప్రభుత్వం*
వర్దన్నపేట( నేటిధాత్రి ):
వర్ధన్నపేట మండలం, నల్లబెల్లి గ్రామంలో వర్ధన్నపేట మండల వ్యవసాయ అధికారి విజయకుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎరువాక-సాగుబడి కార్యక్రమానికి వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య & కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా సీనియర్ నాయకులు పోషాల వెంకన్నగౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రంలో తొలకరి పలకరింపులతో సాగుబడి మొదలవుతుంది అందుకు రైతన్నలు భూములు సిద్ధం చేసుకుని రోహిణి కార్తిలో విత్తనాలు నాటడం మొదలవుతూ రైతన్నలు ఏరువాకకు సిద్ధమవుతారు అని అన్నారు.అదేవిధంగా మృగశిర కార్తిలో వ్యవసాయ సాగుబడి ఊపందుకోవడం ఆనాతిగా వస్తున్న సాంప్రదాయం అని అన్నారు.
గత పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతన్నలకు వ్యవసాయం ఒక గుదిబండగా మారిందని అన్నారు. కానీ నేడు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వ్యవసాయం దండుగ కాదు ఒక పండుగ అని నిరూపిస్తుందని అన్నారు.
గత బి ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి కేసిఆర్ వరి వేసుకుంటే ఉరే అని వ్యవసాయాన్ని హెద్దెవా చేశారు. కానీ నేటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరి వేసుకొని సన్నాలు పండిస్తే మద్దతు ధరతో పాటు సన్నాలకు క్వింటాలుకు 500/- బోనస్ ఇస్తూ రైతన్నలను ఆదుకుంటుంది మన ప్రజాప్రభుత్వం అని అన్నారు.
తెలంగాణ రైతన్నలకు ప్రజాప్రభుత్వం నాణ్యమైన ఎరువులు విత్తనాలు సబ్సిడీపై అందిస్తుందని అన్నారు. నకిలీ విత్తనాలు అమ్మి అటువంటి వారిపై పీడీ యాక్ట్ కేసులు కూడా పెట్టడం జరుగుతుందని తెలిపారు. కావున రైతులు ఎవరు అధైర్య పడకూడదు ఏరువాక మొదలై సాగుబడి ప్రారంభమవుతున్న ఈ తరుణంలో రైతులు వ్యవసాయాన్ని ఒక పండుగలా చేసుకోవాలని హితవు పలికారు.
ఈ ఖరీఫ్ మొదలు ప్రారంభంలోనే రైతు భరోసా కింద రైతులకు ఇచ్చే పెట్టుబడి సహాయాన్ని ఒకే రోజులో 70 లక్షల మంది రైతులకు 9900 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని అన్నారు.
యూరియా కొరత లేదు యూరియా మోతాదు మించకుండా వాడుకోవాలి నికర లాభాలు పొందాలి రైతుల సిఫారసు చేయబడ్డ మోతాదులో మాత్రమే యూరియా వాడాలి సాగు ఖర్చులు తగ్గించుకోవాలి .అధిక యూరియా వాడడం వల్ల పంటలలో చీడ పీడలు మరియు వాతావరణ నీటి కాల్షియం మరియు భూసార తగ్గుదల జరుగుతుంది.నాన్ యూరియా స్ప్రే చేసుకొవాలి , గుళికల యూరియా వినియోగాన్ని తగ్గించుకోవాలి.