గుత్తేదారు గుడిసెలో గుడుపుటాని.!
ఆ అధికారి ఎవరు ,ఎందుకు వచ్చినట్లు పొంతన లేని సమాధానం.
గుత్తె దార్ తో గుసగుసలు, “క్యాజువల్ విజిట్ అని వెళ్ళిపోయిన అధికారి.
ఆ అధికారి ఎవరు ,ఎందుకు వచ్చినట్లు పొంతన లేని సమాధానం.
పెరుగుతున్న ఇసుక రీచుల్లో అక్రమ వసూళ్ల వ్యవహారం, పెరుగుతున్న లారీల సంఖ్య.
మైనింగ్, టీఎస్ ఎండి శాఖల, చీకటి ఒప్పందమే అక్రమ వసూళ్లు.
మహాదేవపూర్ -నేటి ధాత్రి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలో నిర్వహించబడుతున్న ఇసుక రీచుల్లో అక్రమ వసూళ్ల పర్వం, హద్దు అదుపు లేకుండా పోయింది, ప్రధానంగా బొమ్మపూర్, ఎలికేశ్వరం, మహాదేవపూర్ పుసుపుపల్లి వన్, ఇసుక క్వారీల్లో పెద్ద మొత్తంలో అక్రమాలు, అక్రమ వసూళ్ల వ్యవహారం వారం రోజులుగా బట్టబయలు కావడం జరిగింది, కానీ మైనింగ్, మినీరల్, శాఖలు మాత్రం నిశ్శబ్దాన్ని పాటిస్తున్నాయి. తాజాగా శనివారం రోజు, నేటి ధాత్రి, పైసా వసూల్’ పేరుతో కథనాన్ని ప్రచురించడం జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు బొమ్మపూర్ ఎలికేశ్వరం క్వారీల విచారణకు ఓ అధికారి రావడం జరిగింది. వచ్చిన అధికారి విధి నిర్వహణ క్రమంలో, లారీ డ్రైవర్ల లోడింగ్ వ్యవహారం ఎలా సాగుతుంది, ఇలాంటి విషయాలను అడిగి తెలుసుకోవాలి కానీ, గుత్తి గుడిసెలో వెళ్లి, ఎక్కువసేపు గుడిసెలోనే కేటాయించి, లోడింగ్ వద్ద సుమారు పది నిమిషాలు, ఆ అధికారి వాహనంలో గుత్తేదార్ వ్యక్తులు కూర్చుని వెళ్లడం, అనంతరం మరో ఐదు నిమిషాలు వివిల్ క్యాబిన్లో ఉండి వెళ్లిపోవడం తో ఆ అధికారి ఎందుకు వచ్చినట్లు, ఆ అధికారి చేసిన విచారణ ఏమిటి, గుడిసెలు గుడుపుటాని చేసి వెళ్లిపోవడం జరిగిందని అక్కడ డ్రైవర్లు చెప్పుకోవడం జరుగుతుంది.
గుత్తేదారు గుడిసెలో గుడుపు పుటాని !
పెద్ద వాహనంలో బొమ్మ పూర్ ఇసుక రీచుల వద్ద అందరూ చూస్తుండగానే, గుత్తి దారి గుడిసెలో వెళ్లడం జరిగింది. సుమారు 30 నిమిషాలు గుడిసెలో, గుసగుసలు చేసిన ఆ అధికారి, గుత్తేదార్ ను తన వాహనంలో ఎక్కించుకొని లోడింగ్ పాయింట్ వద్దకు వెళ్లి అక్కడ పదో నిమిషాలు కేటాయించి తిరిగి వెళ్లిపోవడం జరిగింది. గుడిసెలో అంతా గుడుపుటాని జరిగిందని, ఆ అధికారి ఎలాంటి విచారణ, అక్రమ వసూళ్ల వ్యవహారం పై వివరాలు, సిబ్బంది పనితీరుపై ఆరా, లారీ డ్రైవర్ల తో అక్రమ వసూళ్లపై అడిగి తెలుసుకోవడం ఇలాంటివి ఏమీ చేయకుండా, అధికారి సుడిగాలి పర్యటన వచ్చి వెళ్లిపోవడంతో, గుడిసెలో గుడుపుటాని జరిగిందని, అందుకే అధికారి సాఫీగా వెళ్లిపోవడం జరిగిందని, అక్కడ ఉన్నటువంటి డ్రైవర్లు చెపుతున్నారు.

ఆ అధికారి ఎవరు ,ఎందుకు వచ్చినట్లు పొంతన లేని సమాధానం.
బొమ్మపూర్ ఇసుక క్వారీలో, విజిలెన్స్ మైనింగ్ అధికారులు వచ్చాయన్న సమాచారంతో, నేటి ధాత్రి బొమ్మ పూర్ ఇసుక క్వారీ కు వెళ్లగా, ఓ భారీ వాహనంలో అధికారి లోడింగ్ పాయింట్ వద్దకు నుండి వచ్చి గుత్తేదారు గుడిసె వద్ద ఆగడంతో, కాంట్రాక్టర్ సిబ్బంది ఒకరు దిగిన అనంతరం ఆ అధికారి కూడా, అక్కడినుండి టీఎస్ఎండిసి కాంటెండర్ లోకి వెళ్లి కూర్చోవడం జరిగింది, అనంతరం నేటి ధాత్రి ఆ అధికారికి తన పరిచయం చేసుకుంటూ, అక్రమ వసూళ్ల వ్యవహారం ఝాట్కా బకేట్ సాక్షాలను ప్రచురించడం జరిగింది అని వివరించడంతో, ఆ అధికారి, సీసీ కెమెరాలు ఉన్నాయి, ఇకనుండి పైసలు తీసుకోరు, ఎండి గారి దృష్టికి తీసుకు వెళ్తాం, అని చెప్పి కంతేరు నుండి బయటికి వచ్చి వాహనం వైపు వెళ్తున్న క్రమంలో నేటి ధాత్రి, మీరు ఏ శాఖ నుండి వచ్చారు, మీ డిజిగ్నేషన్ హోదా ఏమిటి అని అడిగిన, నేను కూడా జీఎం అంటూ చిరునవ్వు చిందించి వాహనం ఎక్కి వెళ్ళిపోవడం జరిగింది. ఇది అధికారుల తీరు, అధికారి ఎవరు ఏ శాఖకు చెందినవారు కనీసం అక్రమాలపై విచారణ, వివరాలు సేకరించడం లాంటి ఏమన్నా చేశారా అలాంటి ఏమీ లేకుండా, గుంతలు దీనికి సమాధానాలు చెప్పి వెళ్లిపోయిన పద్ధతి ఇసుక క్వారీల అక్రమ ఇసుక రవాణా అక్రమ వసూళ్లకు శాఖల అధికారులు ప్రోత్సహిస్తున్నారని చెప్పడానికి ఇదే సాక్ష్యం.
పెరుగుతున్న ఇసుక రీచుల్లో అక్రమ వసూళ్ల వ్యవహారం, పెరుగుతున్న లారీల సంఖ్య.
మండలంలో నిర్వహించబడుతున్న 9 ఇసుక క్వారీలో సుమారు ఏడు ఇసుక క్వారీలు, అక్రమ వసూళ్ల వ్యవహారం ఆపడం లేదు, సీరియల్ పేరుతో 700 ,900, మరికొన్ని క్వారీలు 1000 రూపాయలు అదనంగా లోడింగ్ చార్జీలు 200, ఫోక్లైన్ మెయింటెనెన్స్ పేరుతో మరో 200, ఇలా సుమారు ప్రతి క్వారీ 900 నుండి 1100 వరకు అక్రమ వసూళ్ల వ్యవహారం కొనసాగించడం జరుగుతుంది. ప్రస్తుతం మండలంలో అక్రమ వసూళ్ల వ్యవహారంలో సాక్షాలతో తెరపైకి వచ్చిన, బొమ్మపూర్, ఎలికేశ్వరం, మహాదేవపూర్ పుసుపుపల్లి, ఈ క్వారీలతోపాటు మరికొన్ని క్వారీలు కూడా, అక్రమ వసూళ్ల వ్యవహారాన్ని కొనసాగించడం జరుగుతుంది. అక్రమ వసూళ్ల వ్యవహారంతో ఈ మూడు క్వారీలే కాకుండా మిగతా క్వారీలో కూడా లారీల సంఖ్య, దినదినం పెరుగుతూ పోతుంది, మతుక ఇసుక అయినప్పటికీ వందల సంఖ్యలో లారీలు, ఇసుక లోడింగ్ కొరకు కొన్ని ఇసుక రీచ్ ల వద్ద పెద్ద మొత్తంలో రావడం, అక్రమ వసూళ్ల వ్యవహారం, అక్రమ ఇసుక రవాణా కొనసాగుతుందని స్పష్టం కావడం జరిగింది. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన సొమ్ము, కాంట్రాక్టర్లు అక్రమ వసూళ్ల తో ఖజానాకు గండి కొట్టడం జరుగుతుంది. ప్రతి క్వారీ సుమారు 150 నుండి 200 లారీలను ఇసుకను క్వారీల నుండి రవాణా చేయడం జరుగుతుంది వాటికి ఒక్కొక్క క్వారీ, లక్షా నలభై ఐదు వేల నుండి రెండు లక్షల 25 వేల రూపాయల వరకు, ప్రతిరోజు అక్రమ వసూళ్లు చేసుకొని సొమ్ము చేసుకోవడం జరుగుతుంది.

మైనింగ్, టీఎస్ ఎండి శాఖల, ప్రోత్సాహమే అక్రమ వసూళ్లు.
మండలంలో ఇసుక క్వారీల అక్రమ వసూళ్ల వ్యవహారం వైనింగ్ టిఎస్ఎండిసి చీకటి ఒప్పందమే అని చెప్పక తప్పదు, దానికి గత వారం రోజులుగా నేటి ధాత్రి సాక్షాల తో వరుస కథనాలు, శనివారం ఓ అధికారి బొమ్మ పూర్ ఇసుక క్వారీ కు వచ్చి విచారణ పేరుతో, గుత్తి దారి గుడిసెలో గుడిపుఠాణి చేయడం, పొంతనలేని సమాధానాలు చెప్పి వెళ్లిపోవడం, ఉన్నత అధికారులకు దీని కంటే పెద్ద సాక్షం మరొకటి ఉండదు. సాక్షాలతో కథనాలు ప్రచురించిన, మైనింగ్ టీఎస్ ఎంబీసీ ఉన్నత అధికారులు నిశ్శబ్దాన్ని పాటిస్తున్నారంటే, ఇసుక రీచ్ లో అక్రమ వసూళ్ల వ్యవహారం, చీకటి ఒప్పందం అని చెప్పడంలో సందేహం లేదు, ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందిస్తారా, లేక చీకటి ఒప్పందాన్ని’, ఇలాగే సాగిస్తారా అన్నది వేసి చూడాల్సిందే.