
"Uppala Charitable Trust Supports Temple Construction"
దేవాలయ నిర్మాణానికి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చేయూత.
చారగొండ / నేటి ధాత్రి :
నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలం జేపల్లి గ్రామంలో నిర్మిస్తున్న శ్రీరేణుక ఎల్లమ్మ దేవాలయ నిర్మాణం కోసం ఉప్పల చారి టబుల్ ట్రస్టు చైర్మన్ ఉప్పల వెంకటేష్ అండగా నిలిచారు. ఈ మేరకు ఆలయ కమిటీ సభ్యులు, యువత బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఉప్పల చారిటబుల్ ట్రస్టు చైర్మన్, తలకొండపల్లి జెడ్పిటిసి ఉప్పల వెంకటేష్ ని ఇటీవల మర్యాద పూర్వకంగా కలిసి దేవాలయ నిర్మాణం కోసం మీ సహాయ సహకారాలు అందిం చాలని కోరారు. వెంటనే స్పందించిన ఉప్పల వెంకటేష్ తన ట్రస్టు ద్వారా దేవాలయ నిర్మాణానికి సిమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ మా యొక్క దేవాలయ నిర్మాణానికి సహకరించిన తలకొండపల్లి మాజీ రాష్ట్ర నాయకులు మిషన్ భగీరథ వైస్ చైర్మన్ మాజీ జెడ్పిటిసి ఉప్పల వెంకటేష్ కి ధన్యవాదాలు తెలియజేశారు. రానున్న రోజుల్లో దేవాలయ నిర్మాణ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని చెప్పినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు, వెంకటయ్య, శేఖర్, రమేష్, పరుశురాం, నరేందర్ తదితరులు పాల్గొ న్నారు.