
Collector
నూతన కలెక్టరేట్ నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయాలి
వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
* నూతన కలెక్టరేట్ భవనాన్ని పరిశీలించిన కలెక్టర్*
వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:*

నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాల నిర్మాణా పనుల్లో వేగం పెంచి గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సంబంధిత అధికారులను ఆదేశించారు.మంగళవారం వరంగల్ లోని పాత ఆజంజాహి మీల్స్ గ్రౌండ్లో నిర్మిస్తున్న నూతన కలెక్టరేట్ భవన సముదాయాలను సందర్శించి పనుల పురోగతిని కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా నిర్మాణంలో ఉన్న కలెక్టరేట్ కార్యాలయాల సముదాయాలలో మూడు అంతస్తుల నిర్మాణాలను,కలెక్టర్ క్వార్టర్స్,అడిషనల్ కలెక్టర్ క్వార్టర్స్ మొదటి, రెండవ అంతస్తులలో

డిజైన్ ప్రకారం పనులు జరుగుతున్నాయా లేదా అని పరిశీలించారు. స్ట్రక్చరల్ పనులు పూర్తయినందున ఫీనిషింగ్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని, అవసరమైన సిబ్బందిని వనరులను వియోగించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.రోడ్లు,కాంపౌండ్ వాల్, పైప్ లైన్ తదితర నిర్మాణ పనులను కూడా ఈ సందర్భంగా కలెక్టర్ పరిశీలించి సమర్థ నిర్వహణకు పలు సూచనలు చేశారు.కలెక్టర్ వెంట జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మి,జిల్లా రోడ్ల భవన అధికారి రాజేందర్,డి.ఈ శ్రీధర్,నిర్మాణ సంస్థ జనరల్ మేనేజర్ సందీప్ రెడ్డి తదితరులు ఉన్నారు.