పేద ప్రజల గుండెచప్పుడు వినే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం

రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత బిఆర్ఎస్ దే

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయం

గల్ఫ్ కార్మికులకు అండగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

చందుర్తి, నేటిదాత్రి:

పేద ప్రజల గుండెచప్పుడు వినే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు..శుక్రవారం చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామంలో ప్రభుత్వ విప్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అయిన నాటి నుండి నేటి వరకు బీఆర్ఎస్ పార్టీ వారు అనేక రకాలుగా దుష్ప్రచారం చేస్తున్నారన్నారు..

గత ప్రభుత్వంలో మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత వారికే చెల్లిందన్నారు.. 6 లక్షల కోట్ల అప్పు ఉన్నా సంక్షేమ పథకాల అమలుకు ఏమాత్రం వెనకడుగు వేయబమన్నారు..

దానికి నిదర్శనమే మహిళా తల్లులకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షల వరకు పెంపు, గృహ జ్యోతి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, 500 కే సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లు అమలు అన్నారు..

రైతు భరోసా పై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తుందని ఇప్పటివరకు 5 ఎకరా లోపు రైతు భరోసా ఇచ్చామన్నారు.. గత ప్రభుత్వం ఏప్రిల్ నాటికి రైతుబంధు ఇచ్చిందని కానీ ప్రస్తుత ప్రభుత్వం ముందుగానే రైతు భరోసా ఇస్తుందన్నారు..

గతంలో రైతులకు ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఇదేనని మళ్లీ ప్రజాపాలనలో నేడు 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తున్నామన్నారు..

గత పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన బిఆర్ఎస్ ప్రభుత్వం గల్ఫ్ కార్మికులను ఏమాత్రం పట్టించుకోలేదన్నారు.. కానీ నేడు మేనిఫెస్టోలో చెప్పినట్టుగా గల్ఫ్ లో ప్రమాదవశాత్తు మరణించిన వారికి 5 లక్షలు పరిహారం మొన్నటి రోజున మర్రిపల్లి, బావుసాయి పేట గ్రామాల్లో అందజేశామన్నారు..

ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రాని కెసిఆర్ ఆరు నెలల్లో ప్రభుత్వం కూలిపోతుందని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారన్నారు.. ప్రజలు బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు తోడ్పాటు అందించారని అయిన వారికి బుద్దిరావడం లేదన్నారు.

రాబోవు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం వారు డబ్బుతో గెలవాలని చూస్తున్నారన్నారు.. దానికి నిదర్శనమే మొన్నటి రోజున ప్రతిమ మల్టీప్లెక్స్ లో దొరికిన 6 కోట్ల 67 లక్షల రూపాయలన్నారు..

ఆ డబ్బు తనది కాదని తన బంధువులది కాదని ప్రమాణం చేసే దమ్ము వినోద్ కుమార్ కి ఉందా అని ప్రశ్నించారు… ఏ సర్వే చూసినా పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలుస్తుందని దాని జీర్ణించుకోలేక కాలేశ్వరం ప్రాజెక్టులో దోచుకున్న డబ్బుతో ఓట్లు కొనాలని బిఆర్ఎస్ చూస్తుందన్నారు..

తెలంగాణ ప్రజలు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి తోడ్పాటు అందిస్తారని అన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!