
Kunduru Mahender Reddy
*దేవాదుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దునిద్ర వీడాలి
*వర్ధన్నపేట నియోజకవర్గంలోని దేవాదుల ప్రాజెక్టు కింద ఉన్న అన్ని చెరువులను సత్వరమే నింపాలి
*ఈ విషయంలో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే వెంటనే స్పందించాల
*లేదంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి పర్యటనను అడ్డుకుంటాం
*బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి
వర్ధన్నపేట (నేటిధాత్రి).:
గత పది రోజుల క్రితం ధర్మసాగర్ రిజర్వాయర్ నుండి దేవదుల కెనాల్స్ కి నీళ్లు విడుదల చేస్తున్నట్లు ఫోటోలకు ఫోజులు ఇచ్చిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు నియోజకవర్గంలోని అయినవోలు వర్ధన్నపేట మండలాల్లో చుక్క నీరు లేక నెర్రెలు వారిన చెరువులను సందర్శించి దేవాదుల నీటి ద్వారా నింపి రైతులను ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సంవత్సరం ఆశించిన వర్షాలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని ఏదో నాలుగు రోజులు నాలుగు చినుకులు పడ్డాయని వర్షాలు బాగా కురుస్తాయని ఆశించి రైతన్నలు వరి నాట్లు వేసుకున్నారని ఇప్పుడు అవి ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని భూగర్భ జలాలు కనిష్ట స్థాయికి చేరుకోవడంతో కనీసం బోర్లు బావుల్లో నీళ్లు కూడా లేని పరిస్థితి ఏర్పడిందని ఇలాంటి పరిస్థితి ఏర్పడితే వేల రూపాయలు పెట్టుబడి పెట్టి వరి నాట్లు వేసుకున్న రైతన్నలపై మునిగే నక్క మీద తాడిపండు పడ్డట్లు రైతు అన్నల పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోతుందని కాబట్టి ఇప్పటికైనా రైతుల సమస్యలను పట్టించుకోని స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు దేవాదుల ప్రాజెక్టు కింద ఉన్న అన్ని గ్రామాల చెరువులకు కెనాల్ ద్వారా నీటిని అందించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు న్యాయం చేయాలని లేదంటే రైతుల తరపున రైతులను సంఘటితం చేసుకొని మీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పర్యటనను రైతుల అందరితో కలిసి అడ్డుకొని ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకతను మీ పార్టీపై ఉన్న వ్యతిరేకతను మీ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి గారికి తెలిసే విధంగా చేస్తామని హెచ్చరించారు. వారి పర్యటనకు ముందు దేవాదుల ప్రాజెక్టు ద్వారా చెరువులు నింపకపోతే తప్పకుండా రైతుల ఆక్రోసాన్ని మీరు మరియు మీ ప్రభుత్వం చూడక తప్పదని వెంటనే నీటిని విడుదల చేసి మీ చిత్తశుద్ధి చాటుకోవాలని మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.