జర్నలిస్టులకు మొండి చేయి చూపిన కాంగ్రెస్ ప్రభుత్వం

మళ్లీ గెలిస్తేనె జర్నలిస్టు లకు ఇండ్ల స్థలాలు అని చెప్పిన సీఎం రేవంత్ సర్కార్

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.

నర్సంపేట,నేటిధాత్రి :

రాష్ట్రంలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ఎన్నో ఏండ్లుగా సేవలు చేస్తున్న జర్నలిస్టులకు కాంగ్రెస్ ప్రభుత్వం మొండి చేయి చూపిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు.జర్నలిస్టుల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇండ్ల స్థలాల కోసం ఎదురుచూసిన జర్నలిస్టులకు నిరాశే మిగిలిందని పేర్కొన్నారు.రెండో విడత ఇండ్ల స్థలాలను రెండవసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఇస్తాం అని చెప్పడం జర్నలిస్టులను మోసం చేయడమే అని రేవంత్ ప్రభుత్వం జర్నలిస్టులతో సహా అన్ని వర్గాలను మోసం చేసిందని ఆయన ఎద్దేవా చేశారు.ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం
జర్నలిస్టులకు ఇచ్చిన ఇండ్ల స్థలాలు
గత కెసిఆర్ ప్రభుత్వం కేటాయించినవే అని పెద్ది సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు.
బిఆర్ఎస్ ప్రభుత్వంలో నర్సంపేట మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గంలో అన్ని మండలాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలను కేటాయించామని వాటిని నేటికీ కూడా కేటాయించికపోవడం ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.ఇండ్ల స్థలాలతో పాటు ఇండ్ల నిర్మాణాల కోసం 7 కొట్ల 50 లక్షల నిధులతో టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేయగా అగ్రిమెంట్ దశలో ఉన్న వాటిని ఆపింది ఎవరు అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజలకు ప్రభుత్వాలకు రాజకీయ పార్టీలకు వారధిగా పనిచేసే జర్నలిస్టుల పట్ల రాజకీయ కక్ష చూపడం తగదని పెద్ది పేర్కొన్నారు.నర్సంపేటలో పనిచేస్తున్న జర్నలిస్టులకు కూడా రెండవసారి కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాతనే ఇళ్ల స్థలాలు ఇస్తారా అని స్థానిక ఎమ్మెల్యేను ప్రశ్నించారు.నియోజకవర్గ పరిధిలో జర్నలిస్టల కోసం కేటాయించిన ఇండ్ల స్థలాలు తక్షణమే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
అనంతరం గంతలో తన ఎమ్మెల్యేగా ఉన్న హాయంలో జర్నలిస్టుల కు కేటాయించిన స్థలాలు కలెక్టర్ ప్రోసిడింగ్స్ కాపీ వివరాలు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!