ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం

❇️ నా ప్రాణం ఉన్నంత వరకూ మీతోనే నేను

❇️ నన్ను కాపాడుకునే బాధ్యత ప్రజలదే

❇️ ప్రజలకే నా జీవితం అంకితం

మరిపెడ నేటి ధాత్రి.

కార్యకర్తలే దిశా నిర్దేశకులు,వారి ఆశీస్సులు ప్రజల దీవెనలతో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అద్భుత విజయంతో చరిత్ర తిరగ రాయబోతున్నామని మాజీ మంత్రి,.డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యా నాయక్ అన్నారు, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గo లోని మరిపెడ మండలం లోని వివిధ గ్రామాలలో ఉమ్మడి తానంచర్ల,బురహాన్ పురం,గుండెపూడి,గిరిపురం, వెంకంపాడు,నీలుకుర్తి,బావోజి గూడెం,రాంపురం,చిల్లంచర్ల, రాంపురం గ్రామంలో నిర్వహించిన పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నిర్వహించిన సభకు ప్రజలు బ్రహ్మ రధం పట్టి, ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రెడ్యానాయక్ మాట్లాడుతూ ప్రజలే దేవుళ్ళు..వారి సేవకే నా జీవితం అంకితం.25 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్నా.వారి మధ్యలో ఉంటూ వారి సేవే పరమావధిగా పని చేస్తూ అండగా ఉంటున్నానని పేర్కొన్నారు.తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు డోర్నకల్ నియోజకవర్గ ప్రజలతోనే మమేకమై ఉంటానని చెప్పారు. కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏకష్టమొచ్చినా కడుపులో పెట్టుకుని కాపాడుకుంటున్నానని, అలాగే తనను కూడా కాపాడుకోవాలని అన్నారు. ఈ నియోజకవర్గ రైతు బిడ్డను.. పిలిస్తే పలుకుతాను…24 గంటలు నా ఇంటి తలుపులు ప్రజల కోసం తెరిచే ఉంటాయన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు మోసపూరిత గ్యారెంటీ అన్నారు ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయకుండా పబ్బం గడుపుతున్నారు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించి లేని పంచాయతీలు పెట్టిచ్చిందన్నారు, కెసిఆర్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఒక్క చెరువు కూడా ఎండిపోలేదన్నారు,ఇప్పుడు ఒక్క చెరువులో కూడా చుక్క నీరు లేకుండా అయిందన్నారు, మళ్లీ మన ప్రభుత్వం వస్తే చెరువులు కుంటలు సస్యశ్యామలం అవుతాయన్నారు రైతులను మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు 2 లక్షల రుణమాఫీ చేస్తానని ఇప్పటివరకు చేయకుండా రైతుల ఉసురు పంచుకున్న అన్నారు,వరి ధాన్యం కొని బోనస్ 500 రూపాయలు ఇస్తానని రైతులను నమ్మించిందన్నారు,ఒక్క రైతుకు కూడా బోనస్ ఇవ్వలేదన్నారు,పంట పెట్టుబడి సాయం పంట యేసే ముందు కేసీఆర్ ఎకౌంట్లో వేస్తే,రేవంత్ రెడ్డి సర్కారు పంట కోసే సమయానికి వేస్తుంది అన్నారు, న కూతురు మాలోతు కవిత ను పార్లమెంట్ కు వెళ్లి తెలంగాణా రాష్ట్రం , జిల్లా ప్రయోజనాలు కోసం కేంద్రంతో కొట్లాడానికి అవకాశం ఇవ్వాలని చెప్పారు. ప్రజ సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని, రైతు కు అండగా ఉండి,కేంద్రం తెచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలను పోరాడి, తిప్పికోట్టాలని చెప్పారు.తాను ఎక్కడున్నా తన నియోజకవర్గంలో ఉన్న ప్రజల కోసమే తన ప్రాణం, తాపత్రయ పడుతుందని తెలిపారు. నిత్యం ప్రజలతో ఉండే మాలోతు కవిత ను మంచి మెజార్టీతో గెలిపించి, పార్లమెంట్ కు పంపితే మరింత అభివృద్ధి చేస్తారని చెప్పారు. ఓటు అడగడానికి వస్తున్న కాంగ్రెస్ వారిని ప్రజలకు ఇచ్చిన హామీల పై నిలదీయాలని, ఎందుకు మోసం చేశారో చెప్పాలని గర్జించాలని అన్నారు. మచ్చలేని నాయకురాలు మాలోతు కవిత జీవితం తెరిచిన పుస్తకమని అన్నారు. తనని గెలిపించుకోవడం ద్వారా మరింత అభివృద్ధి కి అవకాశం కల్పించాలన్నారు, మళ్లీ వచ్చేది మన బిఆర్ఎస్ ప్రభుత్వం ఏ అన్నారు, కార్యకర్తలు అధైర్యపడవద్దని ఏ సమస్య వచ్చినా మీకు నేనున్నానని సందర్భంగా గుర్తు చేశారు, ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నవీన్ రావు రావు,ఎంపీపీ అరుణ రాంబాబు,జెడ్పిటిసి శారద రవీందర్,సీనియర్ నాయకులు రాంమడుగు అచ్యుతరావు,మాజీ ఎంపీపీ గడ్డం వెంకన్న, కేసముద్రం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాంపల్లి రవి గౌడ్,గ్రామ ఎంపీటీసీ కొమ్ము నరేష్,రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ కొమ్ము చంద్రశేఖర్,బిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు బందు పరశురాములు,బీసీ సంఘం మండల నాయకులు రాంపల్లి నాగన్న,రాంపల్లి చిన్న వెంకన్న,దోమల పెళ్లి దయాకర్ రెడ్డి, అనుముల నాగిరెడ్డి, ఇరగని వెంకన్న,రాంపల్లి రంజిత్ గౌడ్, దోమల లక్ష్మణ్,గోనే మహేష్,పాల్వ ఎల్లయ్య,సుదగాని శంకర్ స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *