బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షురాలు గంటా కళావతి
పరకాల నేటిధాత్రి
బిఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించారని కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సమాజాన్ని మోసం చేస్తున్నదని బిఆర్ఎస్ మహిళా పట్టణ అధ్యక్షురాలు గంటా కళావతి అన్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ మహిళలు నెలకు 2500రూపాయలు ఇస్తామని మాట తప్పారని సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడెప్పుడు ప్రకటిస్తారని మహిళలలు వెయ్యికళ్ళతో ఎదురుచూస్తున్నారని ప్రభుత్వం అలసత్వం వల్ల మహిళలకు ఆశలు కోల్పోయారన్నారు.కళ్యాణ లక్ష్మీతో పాటు తులం బంగారం ఇస్తామని ప్రకటన చేసారని ఇప్పటివరకు అసలు దాని గురించి ప్రభుత్వం ఎటువంటి ఆలోచన చేయడం లేదని రాష్ట్రంలోని 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు స్కూటీ లు ఇవ్వలేదని అన్నారు.