
CPI State Assistant
దేశాన్ని రక్షించేది కమ్యూనిస్టులే…
సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు
నర్సంపేటలో ఘనంగా సిపిఐ మండల మహాసభలు
నర్సంపేట,నేటిధాత్రి:

ప్రస్తుత పరిస్థితుల్లో దేశాన్ని రక్షించేది కమ్యూనిస్టులేనని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు.మంగళవారం వరంగల్ జిల్లా నర్సంపేటలో సీపీఐ మండల 14 వ మహాసభ ఘనంగా జరిగింది.పట్టణంలోని మేర భవన్ లో గడ్డం నాగరాజు, పిట్టల సతీష్ అధ్యక్షతన జరిగిన మహాసభకు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మతతత్వ రాజకీయాలతో దేశ ప్రజలను బీజేపీ విభజిస్తున్నదని విమర్శించారు.కేంద్రంలోని నరేంద్ర మోడీ పాలనలో ప్రజాస్వామ్యం గొంతునొక్కుతూ ప్రజల హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కార్పొరేట్ శక్తులకు దాసోహం అయిందని పేర్కొన్నారు. కార్పొరేట్ కంపెనీలకు రెడ్ కార్పెట్ ను పరుస్తూ లక్షల కోట్ల రూపాయలను రాయితీలు ఇస్తూ ప్రజల సంక్షేమం మరిచి ప్రజాస్వామ్య గొంతును, ప్రజల గొంతుకను అణిచివేస్తూ కేంద్రం రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలను తుంగలో తొక్కుతున్నదన్నారు. రచయితలను, కవులను, కళాకారులను, విద్యావేత్తలను అణిచివేస్తూ ప్రజాస్వామ్య మంటగలుపుతున్నారని, కేంద్రంలో జాతీయవాదం పేరుతో హిందుత్వ ఏజెండాతో ముస్లిం, క్రిస్టియన్లు, కమ్యూనిస్టులపై విషం కక్కుతూ ప్రశ్నించే గొంతుకను నొక్కుతున్నారని అన్నారు. నిరుద్యోగం, ఆకలి, దారిద్రం నిరంతరం పెరుగుతూ పేదలకు విద్య, వైద్యం అందక ప్రజలు ఆందోళన కు గురవుతున్నా కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని అన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రజలను ఆదుకోవాలని, పేదలు వేసుకున్న గుడిసెలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చి పక్కా ఇల్లు నిర్మించాలని ఆయన అన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం ఆదివాసీలను హత్య చేస్తున్నదని అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ ఫాసిస్ట్ చర్యలను మేధావులు, విద్యార్థులు ఐక్యంగా వ్యతిరేకించాలన్నారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. తొలుత సిపిఐ సీనియర్ నాయకులు సుంకరనేని బాలనరసయ్య అరుణ పథకాన్ని ఆవిష్కరించారు.ఈ మహాసభలలో సిపిఐ జిల్లా కార్యదర్శి మేకల రవి, రాష్ట్ర సమితి సభ్యులు పంజాల రమేష్, జిల్లా సహాయ కార్యదర్శి షేక్ బాసు మియా,పనాస ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు అక్కపల్లి రమేష్, గుంపెల్లి మునిశ్వరుడు, గుండె బద్రి, తోట చంద్రకళ,సిపిఐ జిల్లా సమితి సభ్యులు కందిక చెన్నకేశవులు దిండి పార్థసారథి మియాపురం గోవర్ధన్ పాలక కవిత గడ్డం యాకయ్య పిట్టల సతీష్ ఇల్లందులో సాంబయ్య మమత శైలజ బాధరా పోయిన గడ్డం నాగరాజు వెంకన్న నాయకులు పాల్గొన్నారు.