కేరళలో ‘నొక్కు కూలీ’ ప్రహసనం

శ్రామిక కామ్రేడ్ల ధాటికి సామాన్యుల విలవిల

‘చూసినందుకు’ కూలీ చెల్లించకపోతే దాడులు తప్పవు

ఇష్టారాజ్యంగా సామాన్యులను దోచుకుంటున్న శ్రామిక కామ్రేడ్లు

కార్ల్‌ మార్క్స్‌ ఊహించని ‘శ్రామిక స్వర్గం’ కేరళ!

 

రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందకపోవడానికి ఈ ‘శ్రామిక దందా’ కూడా కారణం

ఇక్కడినుంచి వలసలుంటాయి కానీ, ఇక్కడికి వలసలుండవు

ఇల్లుమారాలన్నా, పనులు మొదలుపెట్టాలన్నా బెదిరిపోతున్న సామాన్య జనం

కేరళ సాధించిన విప్లవ విజయానికి అంతా జేజేలు పలకాల్సిందే

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ప్రాచీన కాలంలో వివిధ దేశాల్లో స్థానిక సంస్కృతులు ప్రాధాన్యం వహిస్తే మధ్యయుగాల్లో మత ఛాందస వాదం పెరిగి క్రూసేడ్లు (మతయుద్ధాలకు) ప్రపంచ నాగరికతలను కుదిపేసాయి. ఇం గ్లండ్‌లో పారిశ్రామిక విప్లవం తర్వాత పెట్టుబడిదారీ విధానం పెరగడం, అందులో శ్రామికుల ను పెట్టుబడిదారుల దోపిడీనుంచి కాపాడే లక్ష్యంతో ఉద్భవించిన కమ్యూనిజం (శ్రామికవాదం),ఇదే సమయంలో పెట్టుబడిదార్లు తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి ప్రపంచంలో మార్కెట్ల అ న్వేషణ కారణంగా పుట్టికొచ్చిన వలసవాదం, ఇందుకోసం దేశాల ఆక్రమణ, ఆధిపత్య యుద్ధాలతో సామ్రాజ్యవాదం పెచ్చరిల్లి 19, 20 శతాబ్దాల్లో ప్రపంచం అట్టుడికిపోయింది. నిజం చెప్పా లంటే ప్రపంచ సమాజం నిరంతర గతిశీలతతో ఎప్పటికప్పుడు పరిణామాలకు లోనవుతూ రావడం చరిత్రగతిలో గమనిస్తాం. ప్రస్తుతం మనం సృజనాత్మక పెట్టుబడిదారీ విధానంలో వున్నాం. ఈ సృజనాత్మకతకు బీజాలు 17 నుంచి 19వ శతాబ్దాల మధ్యకాలంలోనే పడ్డాయనేది సుస్ప ష్టం. ఈ మధ్యకాలంలో జరిగినన్ని శాస్త్రీయ నూతన ఆవిష్కరణలు గతంలో ఎప్పుడూ జరగ లే దు. అయితే ఈ పరిణామక్రమంలో అనుకూల పరిస్థితులు లేకనో లేక తాము లేవనెత్తిన సమస్యలు పరిష్కారమవడంవల్లనో కొన్ని వాదాలు కనుమరుగైపోయాయి.
నేడు మనం చూస్తున్న పెట్టుబడిదారీ విధానం, 19వ శతాబ్దంనాటి రూపంలో లేదు. తన రూపాన్ని పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవడం వల్లనే పెట్టుబడిదారీ విధానం కొత్తరూపంలో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి దేశం అనుసరించడానికి అనుకూలంగా మారింది. మరి పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా పుట్టుకొచ్చిన కమ్యూనిజం, కాలానుగుణమైన మార్పులను అంగీకరించకపోవడం, 19వ శతాబ్దపు నాటి శ్రామిక స్థితిగతులు నేడు లేకపోవడంతో అర్థం లేకుం డా పోయింది. పెట్టుబడిదారీ వ్యవస్థ సృజనకు ప్రోత్సాహం కల్పిస్తుంటే, కమ్యూనిజం రొడ్డకొట్టుడు సైద్ధాంతిక బూజునే పట్టుకొని వేలాడుతోంది. ఏతావాతా చెప్పాలంటే నేడు కొనసాగుతున్న పెట్టుబడిదారీ విధానానికి, 19వ శతాబ్దపు కమ్యూనిజం సిద్ధాంతాలు పనిచేయవు. మార్పును అంగీకరించలేని వాడు కనుమరుగైపోతాడన్నది ఒక నానుడి. ప్రస్తుతం మనదేశంలో సైద్ధాంతిక నిబద్ధత కలిగిన కమ్యూనిస్టులు కనుమరుగైపోవడానికి ప్రధాన కారణం తమ పద్ధతులు మార్చు కోకపోవడమే. కాలానికి అనుగుణంగా మారకపోవడమే! అన్నింటికంటే విచిత్రమేమంటే ఈ క మ్యూనిజం మిగిల్చిన ఒక భయంకరమైన అవశేషం ‘బాధ్యత లేని హక్కుల పోరాటం’. కేవలం ఈ కారణంగానే 34ఏళ్ల కమ్యూనిస్టుల పాలనలో బెంగాల్‌ వెనకబడిపోయింది. స్వాతంత్య్రానికి ముందు పశ్చిమ బెంగాల్‌లో కనిపించిన సాంస్కృతిక చైతన్యం దేశంలో మరెక్కడా కానరాదు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో మేధావులు ఇవ్వాళ ఆలోచించిన దాన్ని, బెంగాల్‌ మేధావులు చాలారోజుల ముందే ఆలోచిస్తారన్న నానుడి వుండేది. నాటి బెంగాల్‌ చరిత్ర తెలిసినవారికి, నేడు ఆ రాష్ట్ర దుస్థితిని చూస్తే జాలి, ఒకరకమైన నైరాశ్యం కలుగుతాయి.
ఏతావాతా చెప్పొచ్చేదేమంటే, మన శరీరంలో కొన్ని అవశేష అవయవాల (అపెండిక్స్‌) మాదిరి గానే వ్యవస్థలో కూడా కొన్ని వాదాలు మిగిల్చిన అవశేషాలు ప్రజలను పీడిస్తూనే వుంటాయి. కాకపోతే ఇవి పెద్దగా ప్రచారంలోకి రావు. కమ్యూనిజం తీసుకొచ్చిన ట్రేడ్‌ యూనియన్‌ వ్యవస్థలో భాగంగా ఇప్పుడు కేరళలో ‘నొక్కు కూలీ’ (చూస్తే కూలీ చెల్లించడం) విధానం అనేది ఒక అవవేష అవయవంగా కొనసాగుతూ మధ్య, తిగువ మధ్యతరగతి, సామాన్యులను విపరీతమైన దోపిడీకి గురిచేస్తోంది. ఎవరైనా తమకు అవసరమైన పనులకోసం ట్రేడ్‌ యూనియన్లకుసంబంధం లేని కూలీలను నియమించుకుంటే, ట్రేడ్‌ యూనియన్లకు లంచాల రూపంలో వారు డిమాండ్‌ చేసి నంత సమర్పించుకోవడమే ఈ నొక్కు కూలీ లేదా ‘గాకింగ్‌ వేజెస్‌’ లేదా ‘చూస్తే కూలీ చెల్లించే’ విధానం. విషాదమేంటంటే కేరళలో రాజకీయ పార్టీల మద్దతు వీరికి పుష్కలంగా వుండటం. అంతే కాదు ఈ వ్యవస్థ ఒక క్వాసీ`లీగల్‌ వ్యవస్థగా కొనసాగుతుండటం విచిత్రం! మిగిలిన రా ష్ట్రాల్లో ఇది కనిపించదు. దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతున్నామన్ని చెప్పుకునే కమ్యూనిస్టుల అనుబంధ ట్రేడ్‌ యూనియన్లు ఈవిధంగా మధ్య, దిగువ మధ్యతరగతి ప్రజలను ‘పీడిరచడాన్ని’ ఏవిధంగా నిర్వచించాలి? కోచి పారిశ్రామిక ప్రాంతంలో ‘హెడ్‌ లోడ్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ ఫండ్‌ బోర్డ్‌’ ఒక వేతన జాబితాను రూపొందించింది. దీని ప్రకారం ఈ ప్రాంతంలో పనులకు యంత్రాలను ఉపయోగిస్తే, సదరు యంత్రం వినియోగం వల్ల ఎంతమంది శ్రామికులు ఉపాధి కోల్పోతున్నారో లెక్కగట్టి ఆమొత్తం వసూలు చేస్తారు. అంటే ఇక్కడ యంత్రాలలో పనిచేయించుకున్నందుకూ, ఈ నొక్కు కూలీకి కలిపి రెట్టింపు చెల్లించాలి! దీనికి చట్టబద్ధత కల్పించడం…ఇక్కడ అనుసరిస్తున్న న్యాయం!!
రాష్ట్రంలోని ప్రతి పారిశ్రామిక, నివాస ప్రాంతాలను జోన్లుగా విడగొట్టి అక్కడ శ్రామిక యూనియన్లు ‘లుకౌట్ల’ను ఏర్పాటు చేస్తాయి. వీరికి ప్రత్యేక డ్రెస్‌ కోడ్‌ వుంటుంది. వీరు అన్నికూడళ్లలో తిష్టవేసుకొని, సామాన్లను మోసుకెళ్లే వాహనాలను గమనిస్తుంటారు. ఎప్పుడైతే అటువంటి వాహ నాన్ని గుర్తిస్తారో తక్షణమే అందుబాటులో వున్న యూనియన్‌ నాయకులకు ఈ సమాచారాన్ని చేరవేస్తారు. వెంటనే యూనియన్‌ సభ్యులు సదరు సరుకు ఎక్కడ దిగుమతి అవుతున్నదో అక్కడ ప్రత్యక్షమై ‘పని`హక్కు’ పేరుతో ఆ యజమానిని ఇష్టారాజ్యంగా డబ్బులు డిమాండ్‌ చేస్తారు. జరిగే పనికి వారు డిమాండ్‌ చేసే మొత్తానికి చాలా సందర్భాల్లో అసలు పొంతనే వుండదు. చివరకు సరుకు లేదా ఇల్లు మారడానికి సామాన్లు తెచ్చుకున్న యజమానులు వీరిని బతిమాలి, బామాలి ఎంతోకొంత బేరం కుదర్చుకొని వారు అంగీకరించిన మొత్తాన్ని ‘నొక్కు కూలీ’ కింద సమర్పించుకొని, తాము అంతకుముందు మాట్లాడుకున్న పనివారితో సామాన్లు లేదా సరుకులు దిగుమతి చేసుకుంటారు. ఇల్లు కట్టుకోవాలన్నా, ఇల్లు మారాలన్నా, బదిలీపై వచ్చినవారికి వీరితో ఇక్కట్లు తప్పవు. అంతెందుకు సామాన్యుడు ఏపని చేపట్టాలన్నా ముందుగా వీరితో పెద్ద తలనొప్పిని ఎదుర్కొనడానికి సిద్ధపడాలి. ఎందుకంటే తాను చేయించుకునే పనికి, రెట్టింపు చెల్లించడానికి సిద్ధపడితేనే ముందుకెళ్లాలి. అంటే తాను మాట్లాడుకున్న కూలీలకు, ఈ ‘నొక్కు కూలీల’కు చూసినందుకు సమర్పించుకుంటేగాని పనికాదు! ఈ యూనియన్లు ఎంతటి శక్తివంతమైనవంటే, 2021 సెప్టెంబర్‌లో ఇస్రోకు చెందిన అతి పెద్ద యంత్రపరికరాన్ని కూడా దిగుమతి కానివ్వకుండా నిలి పేశారు. సంబంధిత అధికార్లు ఈ సమస్య నుంచి బయటపడటానికి నానా తిప్పలుపడాల్సి వచ్చింది. ప్రస్తుతం కేరళలో కొత్త వ్యాపారాలులేదా కొత్త పరిశ్రమలు పెట్టడానికి ఎవ్వరూ ముందుకు రారు. ఎందుకంటే ఈ శ్రామిక యూనియన్ల భయమే. ఇందువల్లనే కేరళనుంచి వలసలు వుంటాయి కానీ, ఆ రాష్ట్రానికి వలసలు వెళ్లే వారెవరూ వుండరు.
ఒకదశలో హైకోర్టు కూడా ఈవిధానం చట్టవిరుద్ధమని దీన్ని నిరోధించేందుకు చర్యలు తీసుకో వాలని కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కోరినా ప్రయోజనం లేదు. ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటామని చెబుతుంది కానీ, శ్రామిక యూనియన్లు తమకు అనుబంధ సంస్థలు కనుక చూసీచూడనట్టు వ్యవహరిస్తాయి. ఇక రాజకీయ నాయకులకు ఓట్లు ముఖ్యం కనుక వీరివైపు కన్నెత్తి కూడా చూడరు. ఎవరైనా ఈ సమస్యలను శ్రామిక యూనియన్ల దృష్టికి తీసుకెళితే, ‘‘మేం ఇటువంటి కార్యకలాపాలను ప్రోత్సహించం. ఒకవేళ అటువంటి సమస్య వస్తే తక్షణం లేబర్‌ కమిషనర్‌ కు ఫిర్యాదు చేయండి’’ అని చెబుతారు. ఇంటి ముందు సరుకులు పెట్టుకొని, ఆ యజమాని లేబర్‌ కమిషనర్‌ చుట్టూ తిరగాలా? ఎంతటి దారుణ పరిస్థితి!!
పౌల్‌ జఛారియా అనే ఒక మళయాళం రచయిత ఈ నొక్కు కూలీ గురించి ఈవిధంగా రాశారు.
‘‘ఒకవేళ మీరు ఇల్లు మారాలనుకున్నారనుకుందాం. అప్పుడు ఈ శ్రామిక కామ్రేడ్‌లు సామాన్లు ఎగుమతి/దిగుమతి కూలీని చెల్లించాలంటూ ఆక్కడ ప్రత్యక్షమవుతారు. ఒకవేళ మీరు ఆ మొత్తాన్ని చెల్లించలేకనో లేక ఇష్టంలేకనో మీ స్నేహితులు, బంధువులతో కలిసి ఆ సామాన్లను దించు కున్నారనుకోండి. అప్పుడు దూరంగా ఈ వ్యవహారమంతా చూసిన శ్రామిక కామ్రేడ్‌లు ఆ శ్రమను తాము చూసినందుకు కూలీ చెల్లించాలని డిమాండ్‌ చేస్తారు. ఇదెక్కడి న్యాయమని మీరు ప్రశ్నించారనుకోండి, మీపై దాడి తప్పదు. కేరళలో విప్లవం ఏస్థాయిలో వున్నదంటే ‘ఒక శ్రామికు డు పనిచేయకపోయినా అతనికి చెల్లింపులు జరపాల్సిందే’. బహుశా ఇటువంటి శ్రామిక స్వర్గా న్ని కార్ల్‌ మార్క్స్‌ కూడా ఊహించి వుండడు!!’’
2018, మే 1న కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ మాట్లాడుతూ ‘‘ట్రేడ్‌ యూనియన్లు కూడా ఈ నొక్కుకూలీని రద్దుచేసేందుకు పూర్తి మద్దతునిస్తున్నాయి’’ అని చెప్పారు. కానీ ప్రస్తుతం త్రిరువనంతపురంలో ఇది యదేచ్ఛగా కొనసాగుతోంది. కేరళ ప్రభుత్వం ఎగుమతి/దిగుమతి చార్జీలను నిర్ణయించి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ట్రావన్‌కూర్‌ ద్వారా నొక్కు కూలీలకు చెల్లింపులు జరపా లంటూ ఒక చట్టం తెచ్చింది. ఆవిధంగా వేధింపులు తగ్గుతాయన్నది ప్రభుత్వ ఉద్దేశం. కానీ ఆ మొత్తాలను నొక్కు కూలీకింద శ్రామిక కామ్రేడ్‌లకు చెల్లించి, ప్రైవేటు వర్కర్లచేత సామాన్లు దిం పించుకోవడం ప్రస్తుతం జరుగుతోంది. ఎందుకంటే ‘పని హక్కు’ కింద పనిచేసే కామ్రేడ్‌ సోద రుల నిర్లక్ష్యానికి ఎన్ని విలువైన వస్తువులు ధ్వంసమవుతాయోనన్న భయం సామాన్యులను అను క్షణం వెన్నాడుతుంది. అందుకనే ఎక్కువ మొత్తం చెల్లించి ప్రైవేటు వర్కర్లచేత తమ పనులు కానిచ్చేసుకుంటున్నారు. ఇదీ ఘనత వహించిన కేరళ సాధించిన విప్లవ విజయం!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!