`వైరి పక్షాళన్నీ తెలంగాణ రాజకీయాలలో కాకవికలమే.
`నివురు గప్పిన నిప్పులా వున్న ప్రజాగ్రహం పెల్లుబికడమే.

`పాలక పక్షం పట్ట పగలు చుక్కలు చూడడమే.
`ఇతర పక్షాలు తలోదిక్కు చూసుకోవడమే.

`వచ్చే భవిష్యత్తు ఎన్నికలన్నీ టీఆరఎస్ కు ఏకపక్షమే.
`పార్టీ పేరు మార్చాలే.. పాదయాత్ర చేయలే!
`మనసులో మాట బైట పెట్టిన కేటీఆర్.
`పేరు మార్చితే తెలంగాణ లో మళ్ళీ కేసీఆర్ సునామీ సృష్టించడం ఖాయం.
`మళ్ళీ పదిహేను ఏళ్ళు తిరుగులేని రాజకీయ జయకేతనం.
`బీఆరఎస్ పేరు మార్చి నష్టపోయామని తొలిసారి అంగీకరించిన కేటీఆర్.
`పేరు మార్చాలన్న ఆలోచన ఉందనగానే పార్టీ లో నిండిన జోష్.
`కేటీఆర్ కు తెలంగాణ లో ఫుల్ జోష్.
`కేసీఆర్ పాలన రావాలని సామాన్యులు కోరుకుంటున్నారు.
`ఇప్పటికైనా కార్యకర్తల మనోభావాలు అర్థం చేసుకున్నారు.
`ఇంత కాలం నాయకులు, కార్యకర్తలు అదే చెబుతున్నారు.
`ఆది నుంచి “నేటిధాత్రి” కొన్ని వందల సార్లు చెప్పింది.
`ముందునుంచి నేటిధాత్రి హెచ్చరిస్తూనే వుంది.
`టీఆరఎస్ తెలంగాణ కు ఆత్మలా రక్షణ కవచంలా కనిపించేది.
`బీఆరఎస్ లో తెలంగాణ ప్రజలు ఆత్మను చూసుకోలేకపోయారు.
`కేటీఆర్ పాదయాత్ర చేస్తే ఆ టీఆరఎస్ విశ్వరూపమే.
హైదరాబాద్, నేటిధాత్రి:
ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా మలితరం తెలంగాణ ఉద్యమానికి ఉగ్గుపాలను అందించిన నాయకుడు కేసిఆర్. ఆ ఉద్యమ పౌరుషాన్ని సమాజానికి అందించింది టిఆరఎస్. తెలంగాణ ఉద్యమ కాలంలో పేరు కోసం పనిచేసిన వారున్నారు. పరపతికోసం పాకులాడిన వారున్నారు. జై తెలంగాణ అని తన గొంతు పలికితే చాలనుకున్నవారున్నారు. కేవలం తెలంగాణ తేవడం, రావడం కోసమే కోరుకున్న ఏకైక నాయకుడు కేసిఆర్. కుప్ప మీద కూర్చున్న తర్వాత అందరూ మాట్లాడతారు. ఆ కుప్పకు కారణమైన కేసిఆర్ చరిత్రను ఎలా మసకబారేలా చేయాలని చూసే వారు అప్ప్పుడూ చూశారు. ఇప్ప్పుడూ చూస్తున్నారు. రేపు కూడా చూస్తారు. ఆనాటి నుంచి నేటిదాక, రేపటి దాకా చరిత్ర మీద బురద జల్లేవారుంటారు. పూలతో కొలిచే వారుంటారు. వాటన్నింటికీ అతీతమైన నాయకుడు ఒకే ఒక్కడు కేసిఆర్. అందుకే ఆ పదమంటేనే తెలంగాణకే ఒక వేదం. ఆ వేదం పెన్నుతో రాసింది కాదు. త్యాగాలతో రాసింది. ఆకాశాన్ని ప్రశ్నించి రాసింది. నింగినేలను కలిపేలా ఉద్యమం సాగించి రాసింది. భవిష్యత్తు తరాలకు బాటలు వేసేలా రాసింది. జై తెలంగాణ అని కేసిఆర్ అన్న నాడు రాజకీయ స్వార్ధమన్నారు. పదవుల కోసం ఆరాటమన్నారు. తాను సిఎం. కావాలని ఆశతో అన్నారు. ఎలాగైనా కేసిఆర్ గొంతు నులిమేయాలని చూశారు. ఎన్నొ ప్రయోగాలు చేశారు. ప్రయత్నాలు ఆఖరు దాకా చేశారు. కాని పట్టువదలని విక్రమార్కుడైన కేసిఆర్ తెలంగాణ సాదించేవరకు వెరవలేదు. విశ్రమించలేదు. తన గొంతులో తడారనివ్వలేదు. జై తెలంగాణ అనే పదాన్ని ప్రతి శ్వాసలోనూ చూపించారు. సింహంలాంటి గర్జనచేశారు. అందుకే తెలంగాణ వచ్చింది. కాలం ఎప్ప్పుడూ ఒకేలా వుండదు. ప్రతి వ్యక్తి పొరపాట్లు చేస్తుంటారు. అవి తెలిసి జరగొచ్చు. తెలయక జరగొచ్చు. ప్రత్యర్ధులు చేసే అసత్యాల ప్రచారంలో అపోహలు కావొచ్చు. ఏది ఏమైనా తెలంగాణ వచ్చింది. ఒక దశ దాటింది. ఆ దశలో కేసిఆర్ చేసిన పాలనలో తెలంగాణ సర్వోదయం కనిపించింది. రాముడు అందరికీ దేవుడు కాకపోవచ్చు. అలాగే కేసిఆర్ పాలన కొంత మందికి నచ్చకపోవచ్చు. రాజకీయంగా ఎదగాలనకున్నవారు కేసిఆర్‌పై దుష్ప్రచారం చేయొచ్చు. అయినా నిజమేమిటో, అబద్దమేమిటో తెýంగాణ ప్రజలకు తెలుసు. అందుకే కేసిఆర్ ఓడిపోయి నాటి నుంచి జనం తల్లడిల్లుతున్నారు. కష్టాలు కొనితెచ్చుకున్నామని మధనపడుతున్నారు. అందుకే మళ్లీ కేటిఆర్ రూపంలో కేసిఆర్ రాబోతున్నారు. సాధించుకున్న తెలంగాణను మరింత తీర్చిదిద్దేందుకు కేటిఆర్ రంగంలోకి దిగుతున్నారు. త్వరలో కేటిఆర్ తెలంగాణలో పాదయాత్ర చేయబోతున్నారు. తెలంగాణ ప్రగతి కోసం ఆయన పాదయాత్ర చేయాలనుకుంటున్నారు. ప్రజలను వంచించిన కాంగ్రెస్ పాలనను అంతమొందించేందుకు పాదయాత్ర చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది సాగబోయే పాదయాత్ర ఎలా వుంటుందనేది ఊహలకే అందనంత గొప్పగా వుండేలా నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ వాదుý కళ్లలో ఇప్ప్పుడే కనిపిస్తోంది. తెలంగాణ అంటేనే ఒక ఉద్యమం. కేసిఆర్ అంటేనే ఓ విప్లవం. కేటిఆర్ అంటే ఈ తరం ప్రభంజనం. ఎందుకంటే కేటిఆర్ ఎక్కడికి వెళ్లినా జనం ఎలా వస్తున్నారనేది ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన దారి వెంట వెళ్తున్నారని తెలిస్తేనే తండోపత తండాలుగా వస్తున్నారు. పెళ్లిళ్లు పేరంటాలకు వస్తున్నారని తెలిస్తే అక్కడికి వేలాదిగా చేరుకుంటున్నారు. ఆఖరుకు కొత్త పెళ్లి జంటలు కూడా కేటిఆర్‌ను చూసిన సంభ్రమాశ్చర్యాలలో సిఎం. సిఎం. అంటూ నినాదాలు చేస్తున్నారు. పెళ్లి వేదిక మీదనే కేటిఆర్‌ను చూసి డాన్సులు చేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఇలాంటి అనుభవాలు ఇంత వరకు దేశంలో ఏ నాయకుడికి దక్కలేదు. దేశంలో వున్న ఏ ఇతర నాయకులు అలా పెళ్లిళ్లు, పేరంటాలకు వెళ్లినా ఇలా సిఎం. సిఎం. అంటూ నినాదాలు ఏ నాయకుడి చేయలేదు. జనం జేజేలు కొట్టలేదు. ఆఖరుకు డిప్యూటీ సిఎం. భట్టివిక్రమార్క కుమారుడి పెళ్లికి హజరైతే కూడా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే కేటిఆర్‌ను చూసిన ఆనందంలో పరవశించిపోయారు. ఆయనను సిఎం. సిఎం. అంటే ఆకాశానికెత్తారు. కేటిఆర్‌తో సెల్ఫీలు దిగేందుకు పోటీలు పడ్డారు. ఇదీ ఇప్ప్పుడు కేటిఆర్‌కు తెలంగాణలో వున్న క్రేజ్. ఆ క్రేజ్ ఒక్కరోజులో వచ్చింది కాదు. అందుకు ఆయన పడిన దశాబ్ధన్నర శ్రమ వుంది. కేసిఆర్ వారసుడిగా ఆయన రాజకీయాల్లోకి రాలేదు. కేసిఆర్ చేస్తున్న ఉద్యమాన్ని పంచుకున్నారు. తండ్రికి తోడుగా నిలిచారు. తెలంగాణ సాధనలో తాను పాలుపంచుకున్నారు. తెలంగాణ కోసం ఆరేళ్లపాటు నిరంతరం కొట్లాడారు. తెలంగాణ సాధనలో రాజకీయ వ్యూహాలను సంధించారు. ఆయనకు వున్న అవగాహనతో, విజ్ఞానంతో తెలంగాణ ఆవష్యకతపై జాతీయ స్దాయి నాయకులకు వివరించగలిగారు. వారిని నమ్మించగలిగారు. వారికి తెలంగాణ ఆవేదన అర్ధమయ్యేలా చేశారు. కేసిఆర్ దేశంలోని 34 పార్టీలను ఒప్పించడంలో కేటిఆర్ కీలకభూమిక పోషించారు. తెలంగాణ వచ్చిన తర్వాత మంత్రిగా ఆయన చేసిన కషి అంతా ఇంత కాదు. పదేళ్ల క్రితం హైదరాబాద్, ఇప్ప్పుడున్న హైదరాబాద్ గురించి ఉద్యమ కారులను అడిగితే చెబుతారు. హైదరాబాద్‌ను అమెరికా నగరాలకన్నా గొప్పగా తీర్చిదిద్దిన ఘనత కేసిఆర్ కంటే , కేటిఆర్‌కే ఎక్కువ దక్కుతుంది. కేసిఆర్ కేవలం సూచనలు మాత్రమే చేశారు. కాని కేటిఆర్ ఆచరణలతో హైదరాబాద్‌కు రూపం కల్పించారు. నేడు హైదరాబాద్ ఇలా వెలిగిపోవడానికి కారకులయ్యారు. అందుకే యూత్ అంతా కేటిఆర్ పేరు వినిపిస్తే చాలు పూనకాలు వచ్చినట్లు కేరింతలు కొడగారు. జేజేలు పలుకుతారు. జిందాబాద్‌లతో ీVAరెత్తిసారు. అలాంటి నాయకుడి నాయకత్వంలో మళ్లీ టిఆరఎస్ అనే మాట వినిపిస్తే ఎలా వుంటుందో ఊహిస్తేనే మనసు పులకరిస్తుంది. ఉద్యమావేశం గుర్తుకొస్తుంది. ఉద్యమ కాలం కళ్లముందు కదలాడుతుంది. ఉద్వేగం ఆనంద బాష్పాలను కురిపిస్తుంది. టిఆరఎస్ , బిఆరఎస్గా మార్చాలన్న ఆలోచన వచ్చిన నాటి నుంచి నేటిధాత్రి ఒకటే చెబుతూ వచ్చింది. అదే మాట ఇప్పటికీ చెబుతోంది. ఆనాడు చెప్పింది. తెలంగాణ ఆత్మను వదులుకున్నట్లౌతుంది. వైరి పక్షాలకు అవకాశమిచ్చినట్లౌవుంది. కార్యకర్తల గుండె ధైర్యం చెదిరిపోతుంది. అని ఆనాడే నేటిధాతి హెచ్చరించింది. ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో కొన్ని వందల సార్లు గుర్తు చేసింది. ఎట్టకేýకు ఇప్ప్పుడు బిఆరఎస్‌లో ఒక అంతర్మధనం మొదలైంది. కేటిఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనమని తేలింది. నిజంగా ఆ ప్రతిపాదన ఆచరణలో పెడితే, బిఆరఎస్ నుంచి టిఆరఎస్ అనే జెండా, Å£ండువాలు కనిపిస్తే కార్యకర్తల కళ్లలో వెయ్యి ఓల్టేజీల వెలుగు, కాళ్లలో వెయ్యేనుగుల బలం నిండుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక్కసారి నాయకులు, కార్యకర్తలు టిఆరఎస్ అని జెండా వేసుకోవాలని ఇప్పటికే తహతహలాడుతున్నారు. ఇక ఆ Å£ండువానే ఇక గుండెల మీద రెపరెపలాడితే ఎలా వుంటుందో ఊహిస్తేనే రక్తం ఉరకలెత్తుంది. ప్రతి కార్యకర్త అదే కోరుకుంటున్నారు. ప్రతి నాయకుడు టిఆరఎస్ జెండా కోసమే ఎదురుచూస్తున్నారు. ఆ జెండా పట్టుకొని ఉద్యమ కాలం నాటి ఉత్సాహంతో పని చేయాలనుకుంటున్నారు. కేటిఆర్ పాదయాత్రను ఒక ప్రభంజన యాత్రగా నిర్వహించాలని అనుకుంటున్నారు. తెలంగాణ రాజకీయాల్లో టిఆరఎస్ మళ్లీ సునామీ సష్టించాలని ఎదురుచూస్తున్నారు. కేటిఆర్ నోట టిఆరఎస్ మాట విన్న కార్యకర్తలు, ఇక కేసిఆర్ నోట వినాలని ఆశపడుతున్నారు. ఆ వింటే చాలు ఆ పార్టీ కార్యకర్తల ఉత్సాహాన్ని ఎవరూ ఆపలేరు. ప్రజలు కూడా టిఆరఎస్ కావాలని కోరుకుంటున్నారు.
