గ్రామాలలో ఖజానా ఖాళీ..!
• పెరుగుతున్న అప్పులు
• భారమవుతున్న నిర్వహణ
• నెత్తి పట్టుకుంటున్న కార్యదర్శులు
• మౌళిక వసతుల నిర్వహణకు కటకట
• చుట్టపు చూపుగా ప్రత్యేకాధికారులు
• దిక్కుతోచని స్థితిలో పంచాయతీల తీరు
జహీరాబాద్. నేటి ధాత్రి:

నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీలలో నిధులు లేక” ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతు న్నాయి. ఇప్పటికే చేపట్టిన పనులకు బిల్లులు రాక కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. కనీసం పారిశుధ్య సిబ్బందికి జీతాలు ఇవ్వడా నికి కూడ పంచాయతీల్లో చిల్లిగవ్వ లేదు. సర్పంచుల పదవీ కాలం ముగిసి ప్రత్యేకాధికా రుల పాలనలోకి వెళ్లిన పంచాయతీలకు ఇప్పుడు ఈ ఆర్థిక భారం పెను సవాల్ గా మారింది. పాలకీవర్గాలు లేని పంచాయితీల్లో బాధ్యతల భారం కార్యదర్శులకు తలనొప్పిగా మారింది. ప్రస్తుతం పంచాయతీ పాలనలో తామే కీలకం కావడంతో కార్యదర్శులు అడక త్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్నారు. ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. పంచాయతీల్లో పనులకు అవసరమైన నిధులు లేక సొంతంగా ఇంకెంతకాలం ఖర్చులు భరించాలో తెలియక తల పట్టుకుంటున్నారు. ప్రత్యేక ఏర్పాట్లకు నిధులు తప్పనిసరి. ఈ పరిస్థితి మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టు మారడంతో కార్యదర్శులు ఆవేదం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీలో ప్రతి పని అర్థికప రమైన అంశమే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సకాలంలో నిధులు అందక ఆర్థిక ఇబ్బందులతో గ్రామపంచాయతీ కార్యదర్శులు నలిగిపోతున్నారు. పంచాయతీలలో నిధులు లేక కార్యదర్శులే 2 సంత్సరాల నుండి ఆర్థిక భారాన్ని మోస్తున్నారు. దీంతో తప్పనిసరి పీరి స్థితుల్లో అప్పులుచేసి పంచాయితీ బాధ్యత నిర్వహిస్తూ ఉన్నారు. పంచాయతీల స్థాయిని బట్టి నెలకు రూ.50 వేల నుండి లక్ష రూపాయల నిధులు అవసరం పడుతున్నాయి. గత కొంతకాలంగా ఈ భారం అంతా పంచాయతీ కార్యదర్శులు నెట్టుకొస్తున్నారు. పంచాయతీ కార్మికులకు కొన్ని నెలల నుంచి జీతాలు రాకపోవడంతో వారిని సముదా యించి పనిచేయించడానికి కార్యదర్శులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత సంవత్సరం జనవరి నెలాఖరులో పంచాయతీ పాలకవర్గం పదవీకాలం ముగియగా ప్రభుత్వం ప్రత్యేకఱ ధికారులను నియమించిన సంగతి తెలిసిందే. ఇతర శాఖలో కీలకంగా ఉన్న గెజిటెడ్ అధికా రులకు అదనపు బాధ్యతలు అప్పగించడంతో వారు తీరిక దొరికినప్పుడే గ్రామాలకు వెళ్లి వస్తున్నారు. కార్యదర్శులకు సలహాలు సూచనలు ఇవ్వడానికి పరిమితం అవుతు న్నారు. ట్రాక్టర్లకు అవసరమైన డీజిల్ తోపాటు పల్లె ప్రకృతి, పనులు పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త డంపింగ్ యార్డులు, స్మశాన వాటిక, నిర్వహణ వాటర్ ట్యాంకుల క్లోరినే షన్, బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులు నిర్వహిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయమై దృష్టిలో పెట్టుకొని పంచాయితీ నిధులను వెంటనే విడుదల చేయాలని కార్యద ర్శులు విజ్ఞప్తి చేస్తున్నారు.