
Financial Problems.
*కూటమి ప్రభుత్వం ప్రజల పట్ల బాధ్యతగా పనిచేస్తుంది..
*ఆర్థిక సమస్యల వెంటాడుతున్నప్పటికీ ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలు..
*సూపర్ సిక్స్ . . సూపర్ సక్సెస్..
*ఆగస్టు 2న రాష్ట్రవ్యాప్తంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమం..
*రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి..
*అన్నదాత సుఖీభవ ద్వారా రేపటి రోజు రైతుల ఖాతాలకు రూ. 7 వేలు జమ..
*యువతకు ఉపాధి కల్పనలో భాగంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఆహ్వానం..
పలమనేరు ఎమ్మెల్యే..
బైరెడ్డిపల్లి(నేటి ధాత్రి) ఆగస్ట
01:
రాష్ట్రాన్ని ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను నిబద్ధతతో అమలు చేస్తున్నారని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు.
శుక్రవారం పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం బైరెడ్డిపల్లి గ్రామంలో సుపరిపాలనలో- తొలి అడుగు కార్యక్రమంలో పలమనేరు ఎమ్మెల్యే ఎన్ అమర్నాథ్ రెడ్డి,డిసిసిబి చైర్మన్, అమాస రాజశేఖర్ రెడ్డి తో కలిసి, పలమనేరు ఎమ్మెల్యే కార్యాలయం నందు పత్రికా సమావేశం నిర్వహించారుఆయా కార్యక్రమాలలో ఆర్ అండ్ బి మంత్రివర్యులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల హామీలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకం సూపర్ సక్సెస్ అవుతున్నదని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజలకు అందుతున్న తీరు ప్రతి నియోజకవర్గం లో ప్రజల వద్దకు వెళ్లి వారి సంతృప్తి స్థాయిని తెలుసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారని, ఆ మేరకు పర్యటనలో భాగంగా పలమనేరులో పర్యటించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలను కలిసినప్పుడు కూటమి ప్రభుత్వం పరిపాలన, పనితీరు పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ రాష్ట్రాన్ని డిజిటల్ హబ్ గా తయారు చేయాలని, ఎపిలో పెట్టుబడులు ద్వారా ఎకో సిస్టం అభివృద్ధి చేయాలని చూస్తున్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్,రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ లు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, రాష్ట్రాన్ని ఆర్థిక సమస్యలువెంటాడుతున్నప్పటికీ ప్రజా సంక్షేమం, అభివృద్ధి మరువలేదని తెలిపారు. గతంలో కుటుంబంలో ఒక బిడ్డకు మాత్రమే వర్తించే పథకాన్ని తల్లికి వందనం పథకం ద్వారా 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న ప్రతి బిడ్డకు ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతున్నది అని తెలిపారు. మహిళల పక్షపాతి అయిన ముఖ్యమంత్రి గతంలో ఆడవారి కష్టాలను చూసి దీపం పథకం ద్వారా గ్యాస్ స్టవ్ లు, సిలిండర్లు పంపిణీ చేశారని, ప్రస్తుతం దీపం- 2 పథకం ద్వారా ఏడాదికి మూడు సిలిండర్ లు ఉచితంగా పంపిణీ చేస్తున్నారని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు హామీ ప్రకటించడం ద్వారా ప్రతి నెల రూ.350 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేయడం జరిగిందని,
ఈ ఖర్చు ప్రభుత్వానికి భారమైనప్పటికీ ఆగస్టు 15 నుండి రాష్ట్రంలోనీ ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. రైతుల సంక్షేమం కొరకు ఆగస్టు 2న రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా అన్నదాత సుఖీభవ కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు.పది ఎకరాల రైతులకు డ్రిప్ 90 శాతం అందిస్తున్నామన్నారు.త్రాగు, సాగునీరు అందిస్తున్నారని, పంటలకు గిట్టుబాటు ధరలు అమలు చేస్తున్నామన్నారు. గతంలో అనేక ఆంక్షలతో అర్హులకు సంక్షేమ పథకాల లబ్ధి చేకూరలేదని, ప్రస్తుతం అర్హులందరికీ సంక్షేమ పథకాల లబ్ధి చేకూరేలా చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సింగపూర్ పర్యటన ద్వారా వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులతో పరిశ్రమలు తీసుకురానున్నారని తెలిపారు.ప్రతి నియోజకవర్గానికి ఒక పారిశ్రామికవాడ ఏర్పాటులో భాగంగా రాష్ట్రంలో సుమారు రూ.76 వేల కోట్ల రూపాయలతో పరిశ్రమల ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని, దీని ద్వారా భవిష్యత్తులో దాదాపుగా 50వేల మంది యువతకు ఉపాధి దొరకనుందని తెలిపారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. ప్రతి ఒక ఇంటి నుండి ఒకరికి నైపుణ్యత పెంచి ఒక పారిశ్రామిక వేత్త తయారయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్ర రాజధాని అమరావతి మరియు పోలవరం ప్రాజెక్టు పనులు సరవేగంగా ముందుకెళ్తున్నాయని తెలిపారు. నియోజకవర్గంలో పలు రోడ్లు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు కనెక్టెడ్ ఉందని ఈరోజు కేంద్ర ప్రభుత్వ శాఖల మంత్రి తిరుపతి పర్యటన సందర్భంగా వారి దృష్టికి ఈ సమస్యని తీసుకొని పోయి పరిష్కరించడానికి కృషి చేయడం జరుగుతుందని మంత్రివర్యులు తెలిపారు, పంచాయతీరాజ్ వ్యవస్థను గాడిలో పెట్టడం జరిగింది.
కొన్ని వేల కోట్ల రూపాయలతో గుంతలు లేని రోడ్లు నిర్మించడం జరిగిందని తెలిపారు,
పల్లె పండగ వాతావరణం లో 4000 కోట్ల రూపాయలతో గ్రామాలలో సిసి రోడ్లు, అప్రోచ్ రోడ్లు నిర్మించడం జరిగిందని తెలిపారు.
అంతకు మునుపు పలమనేరు ఎమ్మెల్యే బైరెడ్డిపల్లి నందు జరిగిన సమావేశంలో
మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం గడుస్తున్న నేపథ్యంలో వాడవాడకు తిరిగి ప్రభుత్వం అందించిన సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంచలంచెలుగా పూర్తి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో నిర్వీర్యమై కుంటుపడిన అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలను ముఖ్యమంత్రి పరుగులు పెట్టిస్తున్నారని తెలిపారు. అందరికీ ఆమోదయోగ్యమైన ప్రజా రంజక పాలన అందిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం గతంలో అందిస్తున్న సామాజిక పెన్షన్లను రూ. 3,000 నుండి పెంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద రూ.4,000 అందించడం జరిగిందన్నారురైతులకు అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం సహాయంతో కలిపి రూ. 7,000 రైతులు ఖాతాకు ఆగస్టు 2న జమ చేయనున్నామని తెలిపారు. యువతకు ఉపాధి కల్పనలో భాగంగా ప్రతి నియోజకవర్గంలోనూ పారిశ్రామిక వాడలు ఏర్పాటుకు పెట్టుబడులను ఆహ్వానించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలోని రహదారుల మరమ్మతులలో భాగంగా రోడ్ల పైన గుంతలను పూడ్చే కార్యక్రమం చేపట్టామని తెలిపారు. త్వరలో పలమనేరు – క్రిష్ణగిరి నాలుగు లైన్ రోడ్లు ఏర్పాటుకు అనుమతులు మంజూరు కానున్నదన్నారు..