కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం.
చిట్యాల, నేటిధాత్రి :
చిట్యాల మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మరియు జిల్లా అధ్యక్షులు అయిత ప్రకాష్ రెడ్డి మరియు భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశం మేరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అసెంబ్లీలో బీసీ కులగనన ఎస్సీ వర్గీకరణ రాజీవ్ యువ వికాసం అనే బిల్లులను అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానించినందులకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చిత్రపటానికి పాలాభిషేకం చేసి టపాసులు పేల్చి సంబరాలు చేసుకోవడం జరిగినది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి మాట్లాడుతూ గత 70 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో బీసీ కులగలను చేయక బీసీలకు అన్యాయం చేసిన ప్రభుత్వాలను అధిగమించి ఎంతో సాహసోపేతంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ కులగన చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి అలాగే గత 30 సంవత్సరాల నుండి ఎస్సీ రిజర్వేషన్లలో జనాభా దామాషా ప్రకారంగా ఎస్సీల్లలోని మాదిగలు చేస్తున్న పోరాటాన్ని న్యాయమైనదిగా గుర్తించి అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర కె దక్కింది అన్నారు,ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఎలాంటి అభివృద్ధి చేయక ఇబ్బందులు పెట్టిన పార్టీలు టిఆర్ఎస్ బిజెపి లను రాబోయే కాలంలోప్రజలు బొంద పెడతారని పిలుపునిచ్చారు..ఈ కార్యక్రమంలో చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య , రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కార్యదర్శి పింగిలి జ్యోతి , మండల మహిళా అధ్యక్షురాలు లక్ష్మి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ములశంకర్ గౌడ్ మండల ఎస్సీ సెల్ ఎస్టీ సెల్ బీసీ సెల్ అధ్యక్షులు బొట్ల రవి నందరాజు బుర్ర శ్రీనివాస్ గౌడ్ మండల ప్రధాన కార్యదర్శి గుండెపు రెడ్డి రవీందర్ రెడ్డి చిట్యాల టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్ సి ఆర్ పల్లి మాజీ ఉపసర్పంచ్ పార్లపల్లి కుమార్ మార్కెట్ డైరెక్టర్ మటిక రవీందర్ నాయకులు నల్ల బుచ్చిరెడ్డి పోలోజూ సంతోష్ శరత్ ఆరేపల్లి మల్లయ్య శనికరం మొగిలి గుర్రపు అశోక్ ఈగ కోటి చిలుముల రాజమౌళి తదితరులు పాల్గొన్నారు..