డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్
హన్మకొండ, నేటిధాత్రి:
వరంగల్ పార్లమెంట్ ఎంపీ ఆస్పిరెంట్ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ తన కార్యాలయంలో మాట్లాడుతూ నూతన ప్రభుత్వం అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలో పెట్టిన పథకాలను ప్రారంభించి అదేవిధంగా ఉద్యోగుల డిమాండ్లలో ముఖ్యమైన వాటిని అమలు చేస్తామని ఈరోజు ప్రకటించడం ఉద్యోగుల మీద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఉన్న ప్రేమకు నిదర్శనమని, గత ప్రభుత్వాలు ఉద్యోగులను అణగదొక్కాయని, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి,
మేనిఫెస్టో లోని ముఖ్యమైన డిమాండ్లు అయినటువంటి సిపిఎస్ రద్దు మరియు పెండింగ్ లో ఉన్న మూడు డిఏలు వెంటనే ఇస్తామని ఈరోజు అసెంబ్లీ లో ప్రకటన చేయడం జరిగినదని అందుకుగాను డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ ఉద్యోగస్తులందరి తరుపున ముఖ్యమంత్రిగారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈరోజు రాష్ట్రంలోని దాదాపు 10లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ కార్మిక వర్గం సంబరాలు చేసుకుంటున్నారని ఉద్యోగుల మిగతా సమస్యలన్నింటివి కూడా త్వరలో నే ప్రభుత్వం పరిష్కరిస్తుందని రామకృష్ణ అన్నారు.
ఎన్ని పోరాటాలు చేసినా గత ప్రభుత్వాలు పెడచెవిన పెట్టాయని, ప్రజలందరికీ అన్ని విషయాలలో న్యాయం జరుగుతుందని అందరి సమస్యలు తొలగిపోతాయని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని నిరూపించారని కొనియాడారు. ఈ కార్యక్రమం లో భాస్కర్ ప్రకాష్ శ్రీధర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.