లబ్ధిదారులకు కేటాయించిన స్థలాన్ని పరిశీలించిన చైర్ పర్సన్

వారంరోజుల్లోగా అలాట్మింట్ చేసేలా చర్యలు

మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి

కొత్తగూడెం మున్సిపాలిటీ అర్హులైన పేదలకు 75 గజాలను ఇవ్వాలని అందుకు అవసరమైన స్థలాన్ని మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు పాతకొత్తగూడెంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించి, కేటాయించింది. అనంతరం జిల్లా కలెక్టర్ సమక్షంలో మున్సిపల్లోని 38వార్డులకు చెందిన అర్హులైన 807 మంది లబ్ధిదారులను పారదర్శకంగా డ్రా ద్వారా ఎంపిక చేశారు. కానీ ఇప్పటి వరకు వారికి స్థలం, ప్లాట్ నెంబర్ కేటాయించకపోవడంతో లబ్దిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు దృష్టికి చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి తీసుకువెళ్ళగా లబ్దిదారులకు కేటాయించిన స్థలం, ప్లాట్ నెంబర్ కేటాయించేందుకు సరమైన చర్యలను చేపట్టాలని రెవిన్యూ, మున్సిపల్ అధికారులను ఇటీవల ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం పాతకొత్తగూడెంలోని లబ్దిదారులకు కేటాయించిన స్థలాన్ని, అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. వారంరోజుల్లోగా హద్దులు తెలిపే రాళ్ళను ఏర్పాటు చేయాలని, ఎన్నికల డ్ రాకముందే అవసరమైన చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. త్వరలోనే కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తులమీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని, ఎమ్మెల్యే చేతుల మీదుగానే లబ్దిదారులకు స్థల కేటాయింపు పత్రాన్ని అందించనున్నట్లు చైర్ పర్సన్ తెలిపారు. చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మీ వెంట ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు కేశంశెట్టి సుజాత, వేముల ప్రసాద్, బీఆర్ఎస్ నాయకుడు గుమ్మడెల్లి మెర్ల, విజయ్, మున్సిపల్ కమిషనర్ టి.శేషాంజన్ స్వామి, టీపీఎస్ ప్రభాకర్, డీఈ రవికుమార్, ఏఈ రాము, తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *