
BC leaders' demand
సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ బీసీలకు కేటాయించాలి.
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ సంగారెడ్డి జిల్లా పరిషత్ పదవులు బీసీలకే ఇవ్వాలి: బీసీ నాయకుల డిమాండ్ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని బీసీ నాయకులు జిల్లా స్థాయిలో రాజకీయ న్యాయం జరగాలంటూ బీసీలకు సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 26 జెడ్పిటిసి స్థానాలు, 26 ఎంపీపీలు, 271 ఎంపీటీసీలు ఉన్న వేళ, వీటిలో కనీసం 42 శాతం స్థానాలు బీసీలకు కేటాయించాలని బీసీ సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. పాలకులు సామాజిక న్యాయంపై మాట్లాడే సమయంలో, జాతీయ జనాభా గణాంకాలను దృష్టిలో పెట్టుకొని బీసీలకు తగిన వాటా కచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉందని వారు చెప్పారు. ప్రత్యేకించి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి బీసీకి ఇవ్వాలని, ఇది బీసీ సామాజిక వర్గానికి గుర్తింపు కలిగించే అంశమని పేర్కొన్నారు. పనులు, పథకాల అమలులో బీసీల పాత్ర కీలకమైందని, గ్రామ స్థాయినుంచి జిల్లా స్థాయి వరకు నాయకత్వం ఇచ్చి బీసీల ఎదుగుదలకి మార్గం వేయాలని జిల్లా బీసీ నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. డెలిమిటేషన్ ప్రక్రియలో బీసీలకు న్యాయం చేయాలని, రాజకీయ వేదికలపై కూడా ఈ అంశాన్ని ఎత్తిచూపుతామని హెచ్చరించారు. జిల్లా నాయకులు కొండాపురం నర్సింలు ముదిరాజ్ మహమ్మద్ ఇమ్రాన్ బీసీ మైనార్టీ అధ్యక్షుడు డాక్టర్ పెద్ద గొల్ల నారాయణ శ్రీనివాస్ గౌడ్ రాకేష్ రాజు దత్తు రవీందర్ నారాయణఖేడ్ సాయిలు ఆందోల్ రాజన్న సంగారెడ్డి విశాల్ డిమాండ్ చేశారు.