చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని తిరుమలాపూర్ గ్రామంలో అంగన్వాడి కేంద్రం (1) కేంద్రము ను బుధవారం రోజున జడ్పీ సీఈవో విజయలక్ష్మి ఎంపీడీవో శ్రీలత ఆకస్మిక తనిఖీ చేశారు, వారు సందర్భంగాగర్భిణీలు బాలింతలు పిల్లలతో మాట్లాడి తల్లి పిల్లల ఎప్పటికప్పుడు బరువు సమతలహారము ఆరోగ్య పరీక్షలను మరియు ప్రభుత్వ హాస్పిటల్ లో డెలివరీ చేయించుకోవాలన్నారు, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున తల్లి పిల్లలు ఉదయం 10 గంటల తర్వాత బయటకు వెళ్లకూడదని బయట తినుబండారాలు కూల్ డ్రింక్స్ బాగా చల్లని పానియలు తాగ వద్దని అవగాహన కల్పించినారు, బాలామృతం ఎగ్స్ వారి చేతుల మీదుగా పంపిణీ చేయనైనది, ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ జయప్రద సూపర్వైజర్ పంచాయతీ రాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ తిరుపతి, గర్భిణీలు పిల్లలు తల్లులు పాల్గొన్నారు.