
వీణవంక, (కరీంనగర్ జిల్లా)
నేటి ధాత్రి:వీణవంక మండల కేంద్రంలో దేశవ్యాప్త సమ్మెలో భాగంగా నిరసన ర్యాలీలు చేసి మండల తాసిల్దార్ కు కార్మిక కర్షక సమస్యలపై వినతి పత్రం అందజేశారు. వీణవంక మండల కేంద్రంలో సిఐటి యు మండల్ కన్వీనర్ ,హమాలి జిల్లా అధ్యక్షులు పిల్లి రవి యాదవ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపి అనంతరం మాట్లాడుతూ.. కార్మిక హక్కులను కాపాడడం వేతనాలు సౌకర్యాలు కల్పించడంలో పెట్టుబడిదారులకు ఆదర్శ యజమానిగా బిజెపి ప్రభుత్వం పనిచేస్తున్నది కార్మిక హక్కులను కాలరాస్తుంది అన్ని అన్నారు.పార్లమెంట్ ఎన్నికల వరకు ఐక్య కార్యచరణ కార్మిక వర్గం రైతాంగం కట్టుబడి ఉంటుందని తెలియజేశారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడం వల్ల కార్మిక హక్కులు పూర్తిగా రైల్,రోడ్స్ తదితర ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా అమ్ముతున్నారు. నేషనల్ హెల్త్ మిషన్, ఐసిడిఎస్, ఉపాధి హామీ, మిడ్ డే మీల్స్ తదితర పథకాల బడ్జెట్లో కేటాయింపులు కోతలు పెట్టి ఆ పథకాలను పూర్తిగా లేకుండా చేస్తున్నది. స్థానిక సంస్థలైన మున్సిపల్, గ్రామపంచాయతీ, కార్మికులకు కనీస వేతనం అమలు చేయడం లేదు. ప్రమాద బీమా సౌకర్యం కల్పించడం లేదు. యూనివర్సిటీ ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు బడ్జెట్ కేటాయించడం లేదు.కనీస వేతన అమలు కావడం లేదు.ఉద్యోగ భద్రత కల్పించడం లేదు. అసంఘటితరంగా కార్మికులు డ్రైవర్లు, భవన నిర్మాణ కార్మికులు, ఆమాలి కార్మికులకు సామాజిక భద్రత కల్పించకుండా అనేక వస్తువుల మీద జిఎస్టి పేరుతో పీల్చి ఫిఫ్టీ చేస్తున్నది. కానీ వీరికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయడానికి చేతులు రావడం లేదు.అందుకని కార్మిక వర్గం బలం ఏమిటో పార్లమెంట్ ఎన్నికల్లో చూపించాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కో కన్వీనర్ డి వెంకటేష్ ,జిపి మండల అధ్యక్ష కార్యదర్శులు మహంకాళి కొమురయ్య,మిట్టపల్లి సదానందం జిల్లా కమిటీ సభ్యులు కంద కేషన్ రావు,కండే సదయ్య,హమాలి మండల నాయకులు మర్రి రవీందర్ ,భద్రయ్య,నాగరాజు సాగర్ ఆటో యూనియన్ నాయకులు రవి మల్లయ్య శ్రీనివాస్ తదితరులు 100 మంది కార్మికులు పాల్గొన్నారు.