
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండలం రాళ్ల పేట గ్రామంలో ఉపాధి హామీలను పరిశీలించిన సిపిఐ పార్టీ జిల్లా నాయకులు సోమ నాగరాజు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి చట్టం తొలిసారి యూపీఏ ప్రభుత్వం వామపక్షాలచోరువుతో1.18.000/. ల. బడ్జెట్ నిధులు తేవడం జరిగిందని అలాంటిది బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత 90.000/. వేల కోట్లకు తగ్గించడం ఈ మధ్యన 60.000/. వేల కోట్లకు తగ్గించడం దారుణమని ఐదు కోట్ల జాబ్ కార్డు తగ్గించి కొత్త వారికి జాబ్ కార్డు ఇవ్వడం లేదని ఉపాధి హామీ చట్టంలో ఉన్నవి అమలు కావడం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ గడ్డపార పారాతట్ట నీళ్లు సౌకర్యం ఉపాధి హామీ కూలీలకు ఎమర్జెన్సీ మెడికల్ కిట్లు ఇవ్వడం లేదని పనిలో గాయలైతే పట్టించుకోవడంలేదని మృతి చెందిన వారికి ఇన్సూరెన్స్ ఇవ్వడం లేదని వచ్చే బడ్జెట్లో 200 నుంచి 600 రూపాయల కూలి పెంచాలని ఏదైనా ఆపద వస్తే ఉపాధి హామీ కూలీలకు 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు