# బీసీ సంఘం జిల్లా నాయకులు డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్
నర్సంపేట,నేటిధాత్రి :
తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుల గణన చేపట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచాలనే ప్రధాన డిమాండ్ తో ఈనెల 25న బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఇచ్చిన పిలుపు మేరకు వరంగల్ జిల్లాతో పాటు నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా బీసీలు అధిక సంఖ్యలో పాల్గొని మహా ర్యాలీనీ విజయవంతం చేయాలని వరంగల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు నర్సంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ పిలుపునిచ్చారు. నర్సంపేట పట్టణంలోని బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఈ సందర్భంగా డ్యాగల శ్రీనివాస్ మాట్లాడుతూ హలో బీసీ… చలో హైదరాబాద్ కుల గణన మార్చ్ సుందరయ్య పార్క్ నుండి ఇందిరా పార్క్ వరకు జరిగే మహార్యాలీ ఉంటుందన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా బీసీ సంక్షేమ సంఘం గ్రామ, మండల,నియోజకవర్గ మరియు వరంగల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం నాయకులు అదే విధంగా అనుబంధ సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు, పార్టీలకతీతంగా బీసీ నాయకులు, ప్రజా ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని డ్యాగల శ్రీనివాస్ కోరారు. రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే సమగ్ర కులగణన చేపట్టి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతామని కామారెడ్డి లో బీసీ గర్జన సభ పెట్టి బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని అంతేకాకుండా తమ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పొందుపరిచిందని అనుకున్నట్టుగానే బీసీల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ అధికారం అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా నాయకులు, చెన్నారావుపేట మండల ఇంచార్జ్ చెన్నూరి రవి కుమార్ ముదిరాజ్, దుగ్గొండి మండల నాయకులు సంకటి శ్రీనివాస్, నర్సంపేట పట్టణ ఉపాధ్యక్షుడు మద్దెల శ్యామ్ కుమార్ యాదవ్, కార్యదర్శులు ఓడపెల్లి రమేష్ మేర, శీరంశెట్టి రాజేందర్, బేతి భాస్కర్, గాండ్ల శ్రీనివాస్, నెక్కొండ మండల నాయకులు మర్రి క్రాంతి కుమార్, కొలిపాక సుధాకర్ లతో పాటు సంఘం నాయకులు పాల్గొన్నారు.