నేను ఒక సాదాసీదా మనిషిని!!
ప్రజల్లో ఉండే మనిషిని. పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల
జగిత్యాల నేటి ధాత్రి
రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ధర్మపురి పట్టణ ముఖ్య నాయకులతో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేసిన పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ ,ఈ సమావేశంలో కొప్పుల మాట్లాడుతూ
కార్యకర్తలు ,ఒక్క మాటలో చెప్పాలంటే అధికారం అనేది ఎవరికి శాశ్వత కాదు, ఒక సారి గెలుస్తాం, ఓ సారి ఓడిపోతాం, కార్యకర్తలు అధైర్య పడద్దు కాంగ్రెస్ పార్టీ పాలనలో మళ్ళీ రాష్ట్రం 10 సంవత్సరాల వెనక్కి వెళ్ళింది.కాంగ్రెస్ పరిపాలన లో సంక్షేమ పథకాల గురించి గ్రామాల్లో చర్చ జరగాలి.కెసిఆర్ పాలనలో రైతులకు అందిన నీళ్లు. కాంగ్రెస్ పార్టీ పాలన నీళ్లు ఎందుకు రావడం లేదు.కాళేశ్వరం ప్రాజెక్టు ను కావాలని బద్నాం చేసే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ..కాళేశ్వరం ప్రాజెక్టు భారీ వర్షాలకు వరదా ద్వారా ఒక పిల్లర్ కుంగిపోయింది.దానికి కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూలిపోయిందని, అసత్య ప్రచారం చేస్తున్నారు,కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాళేశ్వరం ప్రాజెక్టు ను చేసి మరమ్మతులు చేసి నీళ్లు ఇవ్వరాదా,కెసిఆర్ సర్కార్ లో కోతలు సమయం వచ్చింది నీళ్ళు ఆపండి అని రైతులు అనాడు అన్నారు.
కాని ఇప్పుడు,కాంగ్రెస్ పార్టీ వచ్చి మూడు నెలలు ఇంత మార్పా.రైతులు పంటలకు నీళ్ళు అందక గోస పడుతున్న పరిస్థితి.రానున్నది కోతల సమయం కాంగ్రెస్ పార్టీ 500 బోనస్ ఇస్తుందో లేదో రైతులు వేచి చూస్తున్నారు నేను 26 సంవత్సరాలు సింగరేణి కార్మికుడిగా, సింగరేణి నాయకుడిగా పనిచేశాను
తప్పించుకుని తిరిగే నాయకుడిని కాదు ఎప్పుడు ప్రజల మధ్య ఉండే నాయకున్ని గా ఉంటా,30 సంవత్సరాల ఇలాంటి మచ్చలేని ప్రజానాయకంగా ప్రజల మధ్య ఉన్న నాయకున్ని..అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కావచ్చు.కాని గెలిచేది మాత్రం పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలే.ఈ ఎలక్షన్లో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరూ కొప్పుల ఈశ్వర్ గా పనిచేయాలి ,రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజాక్షేత్రంలో భంగపాటు తప్పదు,గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ కి ఓటు అడిగిన కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించే పరిస్థితి.కాంగ్రెస్ పార్టీ మంత్రులు ముఖ్యమంత్రే స్వయంగా రైతు బంధు అడిగితే చెప్పు తీసి కొడతా అంటున్నారు,కాంగ్రెస్ పార్టీ డ్రామా కంపెనీ.ఈ ఆరు గ్యారెంటలు అమలు చేస్తాం అనుకున్నాం కాని ఎన్నికల కోడ్ వచ్చిందని నాటకానికి తెర లేపుతారు..తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కెసిఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నాడు,
రైతు బంధు అడిగితే రైతులను చెప్పుతో కొడుత అంటున్న కాంగ్రెస్ పార్టీ మంత్రులు
ఇప్పుడూ ఎన్నికలు వచ్చాయి, ఎక్కడెక్కడ నిండో ప్యారా షూట్ నాయకులు వస్తుంటారు.వాళ్ళు గెలిస్తే హైదరాబాద్ లో ఉంటూ వారి కార్పొరేట్ కంపెనీలు, పరిశ్రమలు చూసుకుంటారు, తప్ప ప్రజలకు ఏమి చేసేది అమీ ఉండదు..
ఇలాంటి నాయకులను గతం ఈ కుటుంబం నుండి ఈ పార్లమెంటు పరిధిలో గెలిచి అక్కడ ఉన్నారో చూసి ఉన్నాము.వీరికి 12 రాష్ట్రాల్లో కంపెనీ ఉన్నాయి.దేశంలో అత్యంత సంపన్నుల లెక్క తెస్తే 9 వ స్థానం లో ఉంటారు.ఇంత ఆస్తులు ఉన్న వీరికి రిజర్వేషన్ లో కాకుండా జనరల్ లో పోటీ చేయాలి..
వాళ్లు కోట్లకు కోటీశ్వరులు.
నేను ఒక సాదాసీదా మనిషిని, ప్రజల్లో ఉండే మనిషిని.అని కొప్పుల ఈశ్వర్ అన్నారు..ఈ సమావేశం లో డిసిఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, మున్సిపాలిటి చైర్మన్ సంగి సత్తమ్మ ఎంపీపీ చిట్టీ బాబు, జెడ్పిటిసి బత్తిని అరుణ, సౌల్ల భీమయ్య, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యోరి రాజేష్, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఇoదారపు రామన్న, వైస్ ఎంపీపీ మహిపాల్, సునీల్ పాల్గొన్నారు