కాలువల నిండా నిర్లక్ష్యమే!

కాలువల గుండా నీరు అందక ఎండిపోతున్న పంటలు

పట్టించుకోని అధికారులు.

శాయంపేట నేటి ధాత్రి:

రైతులకు ఎస్సారెస్పీ కాలువల ఆధారంగా పంటలు సాగవు తున్నాయి. ఎస్సారెస్పీ కాలువ అనేక మండలాల గుండా ప్రయాణించి పంటలకు నీరు అందుతుంది. మండలంలో రైతులు వాన కాలం,యాసంగి లో కాలువలద్వారా వచ్చే నీటితో చెరువులు నింపి సాగునీరు అందిస్తున్నారు కానీ మండల పరిధిలోని ఎస్సారెస్పీ 31 దాని ఉపకాల్వల అద్వా నంగా మారాయి ప్రధాన ఉప కాలువలు మరమ్మత్తులకు గురికాకపోగా పిచ్చిమొక్కలు పెరగడంలో సాగునీరు సాఫీగా పారడం లేదు.ఎస్సార్ ఎస్పీ కాలంలో దాదాపుగా 20 కిలోమీటర్ల మీద విస్తరించి ఉంది నిర్వాహన సక్రమంగా లేకపోవడంతో పిచ్చి మొక్కలతో నిండిపోయి దర్శనం ఇస్తుంది అలాగే చాలా చోట్ల సీసీ లేని దెబ్బతిండి కొన్ని చోట్ల మొక్కలు ఎక్కువగా పెరిగిన చెట్లను కొట్టి కాలువల పడేశారు కాలువలో పెరిగిన పిచ్చి మొక్కలు నిలిచిన మట్టి తొలగించేందుకు అధికారాలను దృష్టి సాధించలేక పోతున్నారు అధికారుల పర్యవేక్షణ కూడా రైతులు ఆరోపిస్తున్నారు వెంటనే మరమ్మత్తులు చేపట్టి కాలువల పూడికతీసి పిచ్చి మొక్కలను తొలగించి సాగునీరు అందించాలని రైతులు కోరుతున్నారు. ఒకవేళ ఇలా జరగకపోతే పంట పొలాలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.

రైతులు సొంత డబ్బులతో మరమ్మత్తు పనులు

రైతులు సొంత డబ్బులతో పంట పొలాలకునీరు అందాలని కాలువ మరమ్మత్తు పనులు చేపట్టారు. కాలువ మధ్యలో రంద్రము పడి వృధాగా పోతున్న నీటిని ఎండిపోతున్న పంటల వైపు తరలించారు.

కాలువ మరమ్మతుచేసి నీరు అందేలా చూడండి

కాలువలను శుభ్రం చేయాలి

మూసికే అశోక్ రైతు శాయంపేట మండలం

రైతులు వానకాలం యాసం గిలో ఎస్సారెస్పీ నీరు ఈసారి ఎక్కువగా వినియోగించుకునే అవకాశం ఉంది కానీ కాలువలు సరిగ్గా లేవు కాలువలో మట్టి పిచ్చి మొక్కలు పెరిగి, కొన్ని చెట్లను కొట్టి కాలువలో పడేయడం జరిగింది కాలువలు పరిస్థితి బాగాలేదు. ఎస్సాఎస్పి కాలువల్లో చెత్తా చెదారంతో పాటు కాలువలో మట్టిపూడిక పైరుకుపోయింది. కాలువలను శుభ్రం చేయించాలి దెబ్బతిన్న పలుచోట్ల మరమ్మతులు చేయించాలి. దీంతో కాలువలో చెట్లు పెరిగి పంట పొలాలకు నీరు అందడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలువను శుభ్రం చేయించి నీళ్లు అందేటట్లు చెయ్యాలని ఆవేదన వ్యక్తం చేశారు.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!