పట్టించుకోని అధికారులు.
శాయంపేట నేటి ధాత్రి:
రైతులకు ఎస్సారెస్పీ కాలువల ఆధారంగా పంటలు సాగు చేస్తున్నారు ఎస్సారెస్పీ కాలువ అనేక మండలాల గుండా ప్రయాణించి పంటలకు నీరు అందుతుంది. మండలంలో రైతులు వానకాలం యాసంగిలో కాలువలద్వారా వచ్చే నీటితో చెరువులు నింపి సాగునీరు అందిస్తున్నారు కానీ మండల పరిధిలోని ఎస్సారెస్పీ 31 కాలువలు మరమ్మత్తులకు గురికాకపోగా పిచ్చిమొక్కలు పెరగడంలో సాగునీరు సాఫీగా పారడం లేదు.ఎస్సార్ ఎస్పీ కాలంలో దాదాపుగా 20 కిలోమీటర్ల మీద విస్తరించి ఉంది నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో పిచ్చి మొక్కలతో నిండిపోయి దర్శనం ఇస్తుంది అలాగే చాలా చోట్ల సీసీ దెబ్బతిని కొన్ని చోట్ల మొక్కలు ఎక్కువగా పెరిగిన చెట్లను కొట్టి కాలువలో పడేశారు కాలువలో పెరిగిన పిచ్చి మొక్కలు నిలిచిన మట్టి తొలగించేందుకు అధికారాలను దృష్టి సాధించలేక పోతున్నారు అధికారుల పర్యవేక్షణ కూడా లేదని రైతులు ఆరోపిస్తున్నారు వెంటనే మరమ్మత్తులు చేపట్టి కాలువల పూడికతీసి పిచ్చి మొక్కలను తొలగించి సాగునీరు అందించాలని రైతులు కోరుతున్నారు.