విద్యారంగానికి బడ్జెట్ ను సవరించి నిధులు పెంచాలి

ఏ ఐ ఎస్ బి రాష్ట్ర కార్యదర్శి పుల్లని వేణు డిమాండ్.

చేర్యాల నేటిధాత్రి…

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో బడ్జెట్ లో విద్యారంగానికి 15% నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చింది కాని 31389 కోట్లు మాత్రమే కేటాయించిందని ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర కార్యదర్శి పుల్లని వేణు డిమాండ్ చేశారు.. ఈ విషయంపై వారు మాట్లాడుతూ….
మొత్తం 2,75,891 కోట్ల రాష్ట్ర బడ్జెట్ లో ఇది కేవలం 11.5% నిధులు మాత్రమేనని ఎన్నో రోజుల నుంచో విద్యావేత్తలు, ఏ.ఐ.ఎస్.బి విద్యార్థి సంఘ నాయకులు ఉద్యమాలతో విద్యారంగం బాగుపడాలంటే కనీసం విద్యారంగానికి బడ్జెట్లో 30% నిధులు కేటాయించాలని కోరుతున్నాప్పటికీ, ఈ రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ను చూస్తే కాంగ్రెస్ సర్కార్ కూడా విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తుందని స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే దాదాపు 6700 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ పెండింగ్ లో ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు కనీస సదుపాయాలు లేక బోసిపోతున్నాయి. విద్యారంగం బాగుపడాలంటే ఈ నిధులు నిధుల కేటాయింపు అధ్యధికంగా ఉండాలి కాబట్టి బడ్జెట్ ను సవరించి విద్యారంగానికి మరిన్ని నిధులు కేటాయించాలని ఏఐఎస్బి గా డిమాండ్ చేస్తున్నాం అని హెచ్చరించారు. లేని యెడల ఉద్యమాలు ఉదృతం చేస్తామని వారు డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!