రమణక్కపేట లో బీఆర్ఎస్ శ్రేణుల ఇంటిఇంటి ప్రచారం
కాంగ్రెస్ పార్టీ నుంచి 30 మంది బిఆర్ఎస్ లో చేరిక
మంగపేట నేటిధాత్రి
మంగపేట మండలం రమణక్కపేట గ్రామంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు బట్ట సందీప్ ఆధ్వర్యంలో క్లస్టర్ ఇన్చార్జిలు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వాత్సవాయి శ్రీధర్ వర్మ ,పిఎసిఎస్ చైర్మన్ తోట రమేష్ ,ములుగు జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి బాడిశ నాగ రమేష్, ఎక్స్ వైస్ ఎంపీపీ కొమరం రామ్మూర్తి గార్ల సమక్షంలో 30 మంది కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలో చేరారు. చేరిన వారిలో మంచర్ల కిరణ్,మంచర్ల తిరుపతి ,మంచర్ల సూర్యం,మునిగల సాంబశివరావు ,పొనగంటి రమేష్, మునిగల విష్ణు,ఇందారపు రువిత్ కుమార్ ,మంగ పవన్ ,ఎర్రం మహేష్,నిట్ట శ్యామ్,మొరుం నరసింహారావు తదితరులను క్లస్టర్ ఇంచార్జ్లు పార్టీ కండువాలను కప్పి పార్టీలకు ఆహ్వానించారు.అనంతరం యింటిఇంటికి తిరుగుతూ బీఆర్ఎస్ మానిఫెస్టో ను ప్రజలకు వివరించారు.ఎన్నో సంక్షేమ పథకాలను పేదలకు అందిస్తున్న బీఆర్ఎస్ పార్టీ ని గెలిపించుకోవాలని ఈ సందర్భంగా వారిని కోరారు.అదేవిధంగా ములుగు నియోజక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బడే నాగజ్యోతి ని భారీ మెజార్టీ తో గెలిపించుకొని కేసీఆర్ గారికి గిఫ్ట్ గా ఇవ్వాలని కార్యకర్తలనుద్దేశించి తెలిపారు.ఈ కార్యక్రమంలో రమణక్కపేట బిఆర్ఎస్ మండల యువజన విభాగం అధ్యక్షులు గుమ్మల వీరస్వామి,మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజు యాదవ్,మండల యువజన విభాగం ఉపాధ్యక్షులు మంచర్ల నరహరి ,సీనియర్ నాయకులు మంచర్ల మురళి ,గుమ్మల కోటేశ్వరరావు,ఎస్సీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి మంచాల నాగేందర్,సీనియర్ నాయకులు బోనుగు వెంకటేశ్వర్లు,మాటూరి నాగేంద్రబాబు, లకుమల్ల వెంకటకృష్ణ, ఇల్లందుల సాంబయ్య, మేడ సాయిలు,బేగరాజు ,గుండారపు రమేష్,సముద్రపు నాగరాజు,మునిగల మహేష్ సోషల్ మీడియా ఇంచార్జ్ మంచర్ల వంశీ తదితరులు పాల్గొన్నారు