బీఆర్‌ఎస్ పార్టీనే కార్యకర్తలకు అండగా ఉంటుంది

మెదక్ మాజీ ఎమ్మెల్యే జిల్లా పార్టీ అధ్యక్షురాలు యం. పద్మ దేవేందర్ రెడ్డి

రామయంపేట (మెదక్) నేటి ధాత్రి.

పార్టీ కార్యకర్తలకు బీఆర్‌ఎస్‌ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని మెదక్ మాజీ ఎమ్మెల్యే జిల్లా పార్టీ అధ్యక్షాలు యం. పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు.మెదక్ జిల్లా హవెలిఘనపూర్ మండలం శమ్నాపూర్ గ్రామానికి చెందిన బీఅర్ఎస్ పార్టీ కార్యకర్త బుస్సా. సత్తయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించారు. అదే విధంగా మెదక్ మండలం రాజ్ పల్లి గ్రామానికి చెందిన మార్గం యాదగిరి ఇటీవల విద్యుత్ షాక్ ప్రమాదంలో మరణించాడు. ఇద్దరికీ పార్టీ సభ్యత్వం ఉండటంతో ప్రమాద బీమా ద్వారా మంజూరైన 2 లక్షల రూపాయల చొప్పున ఇద్దరికీ రూ. 4,00,000/- విలువ గల పార్టీ ఇన్సూరెన్స్ చెక్కులను సత్తయ్య సతీమణి బుస్సా ముత్యాలుకు,యాదగిరి సతీమణి మార్గం లక్ష్మి లకు సోమవారం నాడు పార్టీ కార్యాలయంలో అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వం కలిగిన కార్యకర్తలకు ప్రమాద వశాత్తు ఏమైనా జరిగితే వారి కుటుంబానికి అండగా ఉండటానికి ప్రమాద బీమా సౌకర్యం కల్పించారన్నారు.ఇంట్లో కుటుంబ పెద్దను కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు రూ.2 లక్షల చెక్కుతో ఆర్థికంగా కొంత ఊరట కలుగుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు యం. దేవేందర్ రెడ్డి, హవెలిఘనపూర్, మెదక్ మండల పార్టీ అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి, అంజ గౌడ్, మాజీ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు యమ్ లావణ్య రెడ్డి. మెదక్ మాజీ వైసీపీ మార్గం అంజనేయులు శమ్నాపూర్ మాజీ సర్పంచ్ లింగం,మాజీ వైస్ ఎంపీపీ రాధాకిషన్ యాదవ్, నాయకులు కిష్టయ్య, రాజు, శ్రీనివాస్, రామచంద్రారెడ్డి, సతీష్ రావు, రాజేశ్వర్ రావు, యువ నాయకులు వినయ్, అనిల్, హరీష్,చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *