kcr
`దేశ రాజకీయాలలో కవిత తిరుగుబాటు మొదటిది కాదు.
`కాంగ్రెస్ లో మేనక రూపంలో మొదటి కుంపటి రగిలింది.
`అనేక రాష్ట్రాలలో కూడా కుటుంబాలలో చీలికలు వచ్చాయి.
`అన్ని కుటుంబాలు వేరు కెసిఆర్ కుటుంబం వేరు.
`అన్ని రాజకీయాలు వేరు.. కెసిఆర్ రాజకీయం వేరు.
`పదవి కోసం రాజకీయ పార్టీ పెడితే కేసీఆర్ రాజకీయం ఉండేది
కాదు.
`బీఆర్ఎస్ పార్టీ కేవలం కల్వకుంట్ల కుటుంబం సొత్తు కాదు.
`పొత్తు కోసం కవిత పోరాటం లో అర్ధం లేదు.
`స్వార్ధం తప్ప ప్రజా ప్రయోజనం అసలే లేదు.
`శత్రువులు ఎక్కడో వుండరు అని మరోసారి కవిత రుజువు చేసింది.
`ఎన్టీఆర్ ది కుటుంబ పార్టీ.. తిరుగుబాటు జరిగింది.
`వైస్ కుటుంబం లోనూ పదవుల కుంపటి రగిలింది.
`కవిత కుంపటి తనకు తానే పొగ పెట్టుకునేలా చేసింది.
`ఆస్తులు కాదు, ఆత్మ గౌరవం అనే మాట అర్ధం లేనిది.
`పార్టీ కష్టాలలో వున్నప్పుడు తోడున్నవాళ్లు దెయ్యాలా?
`పార్టీ కష్టాలలో వున్నప్పుడు ముంచాలనుకునే వారు దెయ్యమా?
`కేసీఆర్ పాలన ను వేలెత్తి చూపిన వారు ఎవరూ లేరు?
`కన్న కూతురు ఎక్కడైనా తండ్రి కి ద్రోహం చేయడం చూశామా?
`కష్టాలలో పార్టీని పట్టుకొని కాపాడుతున్న వారే అసలు వారసులు?
`పార్టీ కి అసలైన సైనికులు… పదవుల కోసం ఆశపడే వాళ్ళు కాదు!
`గుంట నక్కలే పార్టీని చిన్నభిన్నం చేయాలని చూస్తారు!
`దొంగే దొంగా దొంగా అని అరుస్తారు?
`ఇంకా కవిత విషయం లో కెసిఆర్ కూతురు గానే చూస్తున్నారు!
`ఒకప్పుడు షర్మిల రాజకీయం చూసి కవిత చాలా నయం
అనుకున్నారు!
`ఇప్పుడు కవిత కన్నా షర్మిల లక్ష రేట్లు మెలనుకుంటున్నారు!
`రాజకీయాలలో హత్యలుండవు, ఆత్మ హత్యలే వుంటాయని కవిత
మరోసారి నిరూపించింది.
హైదరాబాద్,నేటిధాత్రి:
రాజకీయాలలో హత్యలుండవు. ఆత్మహత్యలు మాత్రమే వుంటాయని రాజకీయ పండితులు ఏనాడో తేల్చేశారు. అతిగా ఆశపడే నాయకులు తమ రాజకీయ జీవితాలను తామే తుంచుకుంటారు. తమకు తాము అతిగా ఊహించుకుంటారు. తమకేం తక్కువ అనుకుంటారు. అందరికన్నా తామే ఎక్కువ అనుకుంటారు. తమకు ప్రాదాన్యత దక్కడం లేదన్న భావనలోకి వెళ్లపోతారు. తమకు ఆదిపత్యం కరువౌతుందని ఆలోచనల్లో ముగినిపోతుంటారు. దాంతో వారికి రాజకీయంగా ఎదురులేకున్నా తనను పట్టించుకోవడం లేదన్న భ్రమల్లోకి వెళ్లిపోతుంటారు. పార్టీలో ఏదైనా తనకు తెలియకుండా ఏదైనా నిర్ణయం జరిగితే చాలు నన్ను తొక్కిపెడుతున్నారని ఆందోళన చెందుతుంటారు. పైగా తనకు వున్న ఆశలు ఎవరో ఎగిరేసుకుపోవచ్చన్న భయంలో బతుకుతుంటారు. తను మాత్రమే పార్టీకి గొప్ప నమ్మకస్తుడిని అనుకుంటారు. ఇతరులు పార్టీ అదినేతల వద్ద చనువుగా వుంటే ఓర్చుకోలేరు. తనకు దక్కని ప్రాదాన్యం ఇతరులకు దక్కుతుంటే సహించలేరు. ఇవి సహజంగా సాధారనంగా అందరికీ వుండే అవలక్షణాలే..ఇదే కొంప ముంచుతాయి. ప్రతి ఇంట్లోనూ వుండేవే. కాని రాజకీయ నాయకుల కుటుంబాలలో వెంటనే బైటకు వస్తాయి. కుటుంబంలో చీలికలు తెస్తాయి. కుటుంబాన్ని వీదిన పడేస్తాయి. తనకు దక్కనిది వేరే ఇతరులకు కూడా దక్కొదన్నంత పట్టుదలను ప్రదిర్శించేలా చేస్తాయి. ఇలా రాజకీయాల్లో లేని పోని అపోహలతో జీవితాలు తలకిందులు చేసుకున్న వారిలో మాజీ ఎంపి. దేవనపల్లి కవితతే కాదు, చిరిత్రలో చాలా మంది వున్నాయి. అయితే అదికారంలో వున్నప్పుడు పార్టీలో వుండి, పదవులున్నీ అనుభవించి, పొందాల్సిన గౌరవాలన్నీ అందరికన్నా ఎక్కువగా పొందినా వారికి తృప్తి వుండదు. అధికారం చూసిన కళ్లతో ఖాళీగా వుండాలంటే మనసు నొప్పదు. అలా తమ రాజకీయ జీవితాలను తుంచుకున్న వారిలో ముందుగా మనకు కనిపించేది మేనకాగాంధీ. ఇందిరాగాందీ చిన్న కుమారడు సంజయ్ గాందీని పెళ్లి చేసుకున్నారు. సంజయ్‌గాందీ మరణానంతరం ఆమె కీలకం కావాలనుకున్నారు. అత్త ఇందిరాగాందీని వ్యతిరేకిస్తూ వచ్చారు. పార్టీని గుప్పిట్లోకి తీసుకోవాలని ప్రయత్నం చేశారు. ఆఖరుకు ఇందిరాగాందీ కుటుంబానికి దూరమయ్యారు. ఏకండా రాష్ట్ర సంజయ్మంచ్ అనే పార్టీని ఏర్పాటు చేశారు. ఆమె కూడా ఆ పార్టీ నుంచి గెలవలేకపోయింది. నిజానికి ఆమె ఆనాడు కొంత ఓపికతో వుంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆమె చేతుల్లో వుండేది. ఆమె ప్రదానమంత్రి అయ్యి వుండేది. కాని చేజేతులా తన రాజకీయ జీవితాన్ని కొంత నష్టం చేసుకున్నది. తన వారసుడు వరుణ్ గాందీకి కూడా గాందీ వారసత్వం లేకుండా చేసుకున్నది. ఆ మధ్య షర్మిల కూడా ఇదే తరహాలో తన అన్న మీద ఆరోపణలు గుప్పిస్తూ ఆయనకు దూరమైంది. ఆఖరుకు తనకు రాజకీయమే లేకుండా చేసుకున్నది. ఆ సమయంలో కల్వకుంట్ల కవిత కుటుంబ పరంగా షర్మిలకన్నా చాల బెటర్ అని అందరూ అనుకున్నారు. కాని ఇప్పుడు కవిత కన్నా, షర్మిల వెయ్యి రెట్లు బెటర్ అనుకునే స్ధితిని కవిత కొని తెచ్చుకున్నారు. తన అన్న జగన్ కోసం షర్మిల సుమారు పది సంవత్సరాలు తన వ్యక్తి గత జీవితాన్ని కూడా వదిలేసుకున్నది. అన్నను రాజకీయంగా బలవంతుడిని చేసేందుకు అహర్నిషలు కృషి చేసింది. జగన్ జైలుకు వెళ్లడంతో అర్ధాంతరంగా ఆగిపోయిన ఓదార్పు యాత్రను పూర్తి చేసింది. అన్నకు కొండంత అండగా నిలిచింది. అన్న కోసం ఏకంగా పాదయాత్ర కూడా చేసింది. కాని తన అన్న అదికారంలోకి వచ్చినా పదవి ఇవ్వకపోవడం తోపాటు, తనకు ప్రాదాన్యతనివ్వడం లేదన్న కోపంతో ఎదురుతిరిగింది. షర్మిల విషయంలో అన్న కోసం త్యాగం కనిపిస్తుంది. కాని కేటిఆర్ విషయంలో కవిత త్యాగం ఎక్కడా లేదు. అన్న ఎంతో తాను అంతే.. అన్న తనకంటే ఎక్కువేం కాదన్న దోరణి కనిపిస్తుంది. తాను ముఖ్యమంత్రి కావాలన్న కలలు కనిపించాయి. అన్నను ముఖ్యమంత్రి చేస్తానని ఎక్కడా చెప్పలేదు. తానెందుకు ముఖ్యమంత్రి కావొద్దన్న ఆలోచనలు మాత్రమే చేసిందనేది అర్దమౌతోంది. అందుకే అన్నను సిఎం. కాకుండా కూడా అడ్డుకున్నట్లు కూడ కనిపిస్తోంది. అయితే కవిత ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. చాలా రాష్ట్రాలలో కుటుంబ రాజకీయ చీలికలువేరు. తెలంగాణలో కేసిఆర్ కుటుంబ రాజకీయం వేరు. అన్ని రాజకీయాలు వేరు..కేసిఆర్ రాజకీయంవేరు. అన్ని పార్టీలు వేరు. బిఆర్ఎస్ పార్టీ వేరు. బిఆర్ఎస్కు కొన్ని ప్రత్యేకతలున్నాయి. ప్రత్యేకమైన గుణాలున్నాయి. అవి ఏ ఇతర పార్టీలకు లేదు. మరో తెలుగు రాష్ట్రమైన ఆంద్రప్రదేశ్‌లో వున్న తెలుగుదేశం, వైఎస్ ఆర్సీపిలు వ్యక్తులుగా నిర్మాణం చేసుకున్న పార్టీలు. కాని బిఆర్ఎస్ వ్యక్తిగా కేసిఆర్ నిర్మాణం చేసుకున్న పార్టీ కాదు. తెలుగు వారి ఆత్మగౌరవం అంటూ చెప్పి, తాను ముఖ్యమంత్రి కావాలని ఎన్టీఆర్ ఏర్పాటు చేసుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ సమయంలో పార్టీ నిర్మాణం అప్పటికి జరగలేదు. ఎన్టీఆర్ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్లు గెలిచారు. వాళ్లే పార్టీకి తర్వాత నాయకులయ్యారు. కాని బిఆర్ఎస్ అలా కాదు. బిఆర్ఎస్ తొలి తరంలో నాయకులను తయారు చేయలేదు. నాయకులంతా కలిసి బిఆర్ఎస్కు రూపకల్పన చేశారు. కేసిఆర్‌కు పూర్తి సహాకారమందించారు. తెలంగాణ ఉద్యమంలో కేసిఆర్‌తో కలిసి నడిచారు. అందులో అప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపిలు, మంత్రులుగా పని చేసిన వాళ్లు కూడా వున్నారు. అలా బలమైన నాయకులతో బిఆర్ఎస్ బలమైన పునాదులు వేసుకున్నది. తర్వాత కాలంలో ఉద్యమకారుల చేత తిరుగులేని శక్తిగా మారిపోయింది. ఆ సమయంలో బలంగా వున్న నాయకుడు దూరమౌతూ వచ్చారు. కొత్త నీరు నాయకులయ్యారు. అయినా బిఆర్ఎస్ అదికారంలోకి వచ్చాక కూడా చాలా మంది ఇతర పార్టీల నాయకులు చేరారు. పార్టీకి బలం పెంచారు. ఈ విషయం కవిత మర్చిపోయింది. పార్టీ నాదే అనేంత దైర్యం ఆమెకు వచ్చిందంటనే ఆమెకు పార్టీలో పట్టు, ప్రాధాన్యత ఎంతో వున్నట్లు లెక్క. ఒక దశలో గులాబీ జెండా నాది అని ఉద్యమకారుడిగా ఈటెల రాజేందర్ మాట్లాడితే ఆయనను పార్టీ నుంచి బైటకు పంపించారు. ఆ సమయంలో ఉద్యమకారుల ఆత్మగౌరవం కవితకు గుర్తుకు రాలేదు. పార్టీ నాది, మనందరిదీ అని నాయకులు అనుకోకలేకపోతే ఏ పార్టీ పది కాలాలపాటు బలంగా వుండదు. అందుకే ఉద్యమ కారుడిగా ఈటెల, పార్టీకి చేసిన సేవను దృష్టిలో పెట్టుకొని ఏదో ఆయాచితంగా అన్న మాటలు మాత్రమే. కాని అది ఆయన పార్టీనుంచి బైటకు వెళ్లాల్సిన పరిస్తితి వచ్చింది. అప్పుడైనా కవిత తెలుసుకోవాల్సింది. పార్టీ మనందరదీ..అయినా అదినేత తన తండ్రి కావడం వల్ల తనకు ఎనలేని ప్రాదాన్యత దక్కుతుందని గుర్తించుకోలేకపోయింది. తాను పార్టీ కోసం ఎంతో చేశాను. తనను దూరం పెడుతున్నారని అనుకున్నది. నిజానికి ఎవరూ ఆమెను దూరం పెట్టలేదు. తనకు తానుగానే దూరమౌతూ వచ్చింది. తనకు ప్రాదాన్యత లేని పార్టీ వుంటే ఎంత? లేకుంటే ఎంత? అనుకున్నది. బిఆర్ఎస్లో తాను సిఎం. అయ్యే అవకాశం లేదన్నది ఆమె తెలుసుకున్నది. తనుకు సిఎం. పదవి దక్కని పార్టీ వుంటే ఎంత లేకుంటే ఎంత? అనుకొన్నట్లువుంది. తాను సిఎం. కాకపోయినా ఫరవాలేదు. కాని తన అన్న కాకూడదన్న నిర్ణయానికి వచ్చినట్లు వుంది. అందుకే అన్నకు పార్టీలో దక్కుతున్న ప్రాదాన్యత చూసి అసూయ చెందినట్లుంది. కేసిఆర్ చుట్టూ దెయ్యాలున్నారని మొదలు పెట్టింది. నిజానికి ఇప్పుడు పార్టీ అదికారంలో లేదు. ప్రతిపక్షంగా ఐదేళ్ల పాటు చేసేదేమీ లేదు. కేసిఆర్ చుట్టూ నాయకులు వుండడం వల్ల వారికి వచ్చే లాభమేమీ లేదు. పైగా ఇంత మంది నాయకులు కేసిఆర్ చుట్టూ వుంటే పార్టీకే బలం. పార్టీ అదికారంలో వున్నప్పుడు ఎలాగూ కేసిఆర్‌కు దగ్గ్ణర కాలేకపోయాం..ఇప్పుడైనా దగ్గరగా వుంటే భవిష్యత్తులో తమకు ప్రాదాన్యత వుంటుందన్న ఆలోచనతో కూడా నాయకులు వుండొచ్చు. అలా పార్టీకి, కేసిఆర్‌కు మనో ధైర్యంగా వున్న నాయకులను దెయ్యాలు, దొంగలు, గుంట నక్కలు అంటూ సంబోదించి తన గోతి తానే తవ్వుకున్నది. తన రాజకీయానికి తానే కుంపటి పెట్టుకున్నది. పార్టీ కష్టకాలంలో వున్నప్పుడు అండగా నిలబడాల్సిన సమయంలో పార్టీ మీద అబాంఢాలు వేస్తూ, ఏకంగా కేసిఆర్ పాలననే తూర్పారపడుతూ, పదేళ్ల ఏం పీకారని కవిత మాట్లాడడం చాల తప్పు. అందుకే వారసురాలిని అని చెప్పుకోవాల్సిన కవిత, పగదారురాలై పార్టీకి దూరమైంది.
