“BRS Flag Must Fly in Municipal Elections: Gandra”
మున్సిపాలిటీ ఎన్నికలలో బిఆర్ఎస్ జెండా ఎగురవేయాలి
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
భూపాలపల్లి నేటిధాత్రి
బస్తీబాట కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డు కార్లమార్క్స్ కాలనీ లో పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన బస్తీ బాట కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి
ఈ సందర్బంగా గండ్ర మాట్లాడుతూ.
భూపాలపల్లి ప్రాంతంలో గతంలో మంచినీటి సమస్య ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలుసు. ఆ పరిస్థితిని గమనించి, పూర్తి స్థాయిలో సమస్యకు పరిష్కారం చూపిన నాయకత్వం కేసిఆర్ దే అని చెప్పక తప్పదు. ఈరోజు భూపాలపల్లి నియోజకవర్గం లోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన గోదావరి జలాలు అందుతున్నాయంటే, అది కేసిఆర్ దూరదృష్టి గల పాలన ఫలితం.
అదే విధంగా, 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరాను ప్రతి ఇంటికీ అందించిన ఘనత కూడా కేసిఆర్ ప్రభుత్వానికే దక్కుతుంది.
ఒకప్పుడు చిన్న గ్రామ పంచాయతీ స్థాయిలో ఉన్న భూపాలపల్లి జిల్లా స్థాయికి ఎదగడం, ఒక ఎస్పీ, ఒక కలెక్టర్‌తో పరిపాలన కొనసాగించగలగడం ఇవన్నీ కేసిఆర్ పాలనలో సాధ్యమయ్యాయి.
భూపాలపల్లి జిల్లాను రద్దు చేయాలనే దిశగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని విజ్ఞులైన భూపాలపల్లి పట్టణ ప్రజలు, జిల్లా ప్రజలు గమనించాలి.
ఇలాంటి ప్రజావిరుద్ధ నిర్ణయాలకు భూపాలపల్లి ప్రజలు గట్టి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 33 జిల్లాలు ఏర్పాటు చేసి ఇప్పటికే పది సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇంత కాలం తర్వాత మళ్లీ జిల్లాలపై కొత్త ముచ్చట్లు ఎందుకు తెరపైకి తెస్తున్నారు? దీని వెనుక ఉద్దేశ్యం ఏమిటి? మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని చెప్పిర్రు కదా, ఇప్పటివరకు ఆ హామీ నెరవేరిందా?
వృద్ధులకు, వితంతువులకు నెలకు రూ.4000 పెన్షన్ ఇస్తామని ప్రకటించారు, అది ఎక్కడ అమలైంది…?
భూపాలపల్లి ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారు, అవసరమైతే సరైన సమయం లో సరైన సమాధానం ప్రజాస్వామ్య బద్ధంగా బదులు ఇస్తారని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
24వ వార్డులో గతంలో సీలింగ్ సర్ప్లస్ భూముల్లో మీరు అందరూ ఇళ్లను నిర్మించుకున్న సమయంలో, నేను ప్రభుత్వంతో పోరాడి మీ అందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ జరిగేలా చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే గండ్ర అన్నారు
కేసీఆర్ తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసి భూపాలపల్లి వంటి మారుమూల ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా అభివృద్ధి చేశారు. భూపాలపల్లి జిల్లాలో అభివృద్ధి ఎలా ఉందో ప్రతి ఒక్కరూ వచ్చి చూడవచ్చు.
కలెక్టర్ కార్యాలయం కావచ్చు, డిగ్రీ కళాశాల కావచ్చు, జూనియర్ కళాశాల కావచ్చు, అంతేకాదు ఒక మెడికల్ కాలేజ్ కూడా భూపాలపల్లి వంటి మారుమూల ప్రాంతానికి రావడం అంటే ఇది చిన్న విషయం కాదు.
గతంలో కేవలం ఒక సెంటర్‌గా ఉన్న భూపాలపల్లి, ఈ రోజు సూపర్ స్పెషాలిటీ డాక్టర్లతో కూడిన వైద్య సేవలు అందించే స్థాయికి ఎదిగింది.
భూపాలపల్లి పట్టణాభివృద్ధి కోసం నేను తెచ్చిన నిధులకు శంకుస్థాపనలు వేస్తావ్, టెండర్ పిలిచి పనులు ప్రారంభం అయిన వాటిని నీకు కాంట్రాక్టర్ మర్యాద చేయలేదని ఆ పనులు క్యాన్సిల్ చేసి నీ ఊరికి తీసుకెళ్ళి పట్టణాభివృద్ధిని అడ్డుకుంటున్నావ్. నిజంగా భూపాలపల్లిని అభివృద్ధి చేయాలనే సంకల్పం ఉంటే, రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి కొత్త నిధులు తీసుకువచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్. అని మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
