హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోనీ ఇందిరా హాస్పిటలో సంఘటన
నేటిధాత్రి. హుజూర్ నగర్.
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన లొడంగి శిరీష సాయి కృష్ణల కుమారుడు లొడంగి సిద్ధార్థ (5)కు శుక్రవారం సాయంత్రం వాంతులు విరేచనాలు అవుతుండగా హుజూర్ నగర్ పట్టణంలోని ఇందిరా పిల్లల హాస్పిటల్ కి తీసుకొని రాగా బాలునికి చికిత్స చేశారని,వైద్యం వికటించి బాలుడు ఇవాళ ఉదయం చనిపోయాడని తల్లిదండ్రులు తెలిపారు.