బీఎస్పీ జిల్లా అధ్యక్షులు శనిగరపు రాజు డిమాండ్
హన్మకొండ, నేటిధాత్రి:
బహుజన సమాజ్ పార్టీ హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బాలసముద్రం అంబేద్కర్ సర్కిల్లో గ్రూప్-1 పరీక్ష రెండవ సారి రద్దయినందుకుగాను టీ.ఎస్.పీ.ఎస్సీ కమిషన్ బోర్డును రద్దుచేసి కొత్త కమిటీ ఆధ్వర్యంలో రాబోయే గ్రూప్ పరీక్షలు నిర్వహించాలని కేసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన తెలుపడం జరిగింది
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు శనిగరపు రాజు మాట్లాడుతూ తెలంగాణ నిరుద్యోగ బిడ్డల పక్షాన నిలబడ్డందుకు న్యాయ వ్యవస్థకు మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ గ్రూప్-1 రెండవ సారి రద్దు కావడానికి ముమ్మాటికి కేసీఆర్ నిరంకుశ కుటుంబ పాలననే కారణం. ఆనాడే బీయస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు డిమాండ్ చేసినట్లుగా మొత్తం కమీషన్ ను ప్రక్షాళన చేసి పరీక్షలను నిర్వహించి ఉంటే ఈ పరిస్థితి వచ్చుండేది కాదు.
ఇంకా టైం వేస్టు చేయకుండా…
టీ ఎస్ ఎఫ్ ఎస్సి కమీషన్ మొత్తం అర్జంటుగా రాజీనామా చేయాలి డా.జనార్దనరెడ్డి గారు, మీకు ఏ మాత్రం నైతిక విలువలున్నా స్వచ్ఛందంగా వైదొలగి పోలీసులకు నిజం చెప్పాల్సిందిగా కోరుతున్నా
కమీషన్ ను పూర్తిగా ప్రక్షాళన చేసి కొత్త వారిని నియమించిన తరువాతనే మిగతా పరీక్షలను నిర్వహించాలి
కొత్తగా వచ్చిన 270 ఓ ఎమ్ ఆర్ షీట్లపై పూర్తి స్థాయి విచారణ జరపాలి
సైట్ ఇన్వెస్టిగేషన్లో కమీషన్ ఛైర్మన్,సభ్యులు మరియు ఎస్ ఓ వెంకటలక్ష్మిలను నిందితులుగా చేర్చాలి
ఈ కేసును సి బీ ఐ కీ అర్జంటుగా అప్పగించాలి
అందరు అభ్యర్థులకు కనీసం లక్ష రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలి
నవంబర్ లో జరగనున్న గ్రూప్-2 మరియు మిగతా పరీక్షలన్నీ కొత్త కమీషన్ హాయాంలోనే జరగాలి. ఈ కమీషన్ పై ఒక్క కే సి ఆర్ కుటుంబానికి తప్పప్రజలకు ఎలాంటి విశ్వాసం లేదు
గ్రూప్ -1 కుంభకోణంలో తెలంగాణ సీ.ఎం.ఓ. మరియు కేటీఆర్ పాత్రను ఇప్పటికైనా వెలికి తీయాలి
గత గ్రూప్-1 ప్రిలిమ్స్ టాపర్ ఎవరో ముఖ్యమంత్రే స్వయానా వెల్లడించాలి
లేనిచో లక్షలాది నిరుద్యోగ యువతీ యువకులను, వారి కుటుంబాలను ఏకంచేసి తెలంగాణ లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఊర్లలో తిరగనివ్వమని హెచ్చరించారు
నిరుద్యోగ మిత్రులందరూ ఏకమై, నిరాశ పడకుండా, రానున్న ఎన్నికల్లో ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ముఖ్యమంత్రి గా చేసుకుని మన బహుజనరాజ్యం లో పారదర్శకంగా నిజాయితీగా పరీక్షలను నిర్వహించుకుందాం అని శనిగరపు రాజు పిలుపునిచ్చారు.
ఈకార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఒంటేరు చక్రీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ మంజుల మనీ, కోశాధికారి పసుపునాటి నితీష్ కుమార్, పరకాల నియోజకవర్గ ఇంచార్జి అమ్మ సాంబయ్య ,సూదనబోయిన సాంబయ్య,మేకల విష్ణు వందలమంది విద్యార్థులు పాల్గొన్నారు.