
గౌడ సంఘాల జేఏసీ చైర్మన్ బుర్ర రమేష్ గౌడ్
భూపాలపల్లి నేటిధాత్రి
శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం కమలాపూర్ గ్రామంలో గౌడ కులస్తులు, గీత కార్మికుల ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయానికి గౌడ సంఘాల జేఏసీ చైర్మన్ బుర్ర రమేష్ గౌడ్ 5016 రూపాయలు విరాళం అందించారు. ఆ మొత్తం నగదును రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా బుర్ర రమేష్ గౌడ్ మాట్లాడుతూ గీత కార్మికుల, గౌడ కులస్తుల ఆరాధ్య దైవం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి అని పూర్వం నుండి గౌడ కులస్తులు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి నీ ఇలవేల్పుగా కొలుచుకుంటూ ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తామని
శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దయవల్ల ఈ సంవత్సరం వర్షాలు బాగా పడి పంటలు బాగా పండాలని, గౌడ కులస్తులు ,గీత కార్మికులతో పాటు గ్రామంలోని ప్రజలు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని బుర్ర రమేష్ గౌడ్ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గౌడ సంఘాల జేఏసీ ముఖ్య సలహాదారు బుర్ర కుమారస్వామి గౌడ్,
గౌడ సంఘాల జేఏసీ నాయకులుమాచర్ల నరసయ్య గౌడ్,
శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ కమిటీ అధ్యక్షులు పాలకుర్తి వెంకట స్వామి గౌడ్, ఉపాధ్యక్షులు బొడిగే అశోక్ గౌడ్, కమిటీ సభ్యులు బుర్ర శంకర్ గౌడ్, పాలకుర్తి ప్రవీణ్ కుమార్ గౌడ్ మాచర్ల సంతోష్ గౌడ్, తాళ్లపల్లి మహేందర్ గౌడ్,తాళ్లపల్లి దేవేందర్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.