‘‘చేనేత సొమ్ములో’’..’’చేతివాటం’’!..ఎపిసోడ్‌ – 1

https://epaper.netidhatri.com/view/386/netidhathri-e-paper-24th-september-2024%09

‘‘టెస్కోమంట’’..’’మంత్రికి తంట’’?

`అమాయకపు మంత్రి..ఆడిస్తున్న అధికారి?

`‘‘టెస్కో’’లో కోట్లు కొట్టేసిందెవరు?

`చేనేతల పొట్టకొట్టిందెవరు?

 

`నేతన్నల పేరు చెప్పి మెక్కిందెవరు?

`‘‘భారీ కుంభకోణానికి’’ బాధ్యులెవరు?

`‘‘ఆడిట్‌’’ లేకుండా అడ్డగోలుగా సంపాదనకు ఎగబడిరదెవరు?

`సొమ్ముకు బదులు ‘‘బంగారు బిస్కెట్ల’’ బాగోతం ఏమిటి?

`‘‘బోగస్‌ సంస్థల’’ వెనకున్న వాళ్లెవరు?

`మంత్రి ‘‘తుమ్మల’’ ప్రకటన తర్వాత చర్యలేవి?

`విచారణాధికారిని పక్కన పెట్టిందెవరు?

`‘‘టెస్కో’’లో ఏం జరుగుతోంది!

`‘‘జయేష్‌ రంజన్‌’’ ఆదేశాలు బుట్ట దాఖలు చేసిందెవరు?

`‘‘విజిలెన్స్‌ ఎంక్వైరీ’’ ఎందుకు ఆగింది?

`ఎంక్వైరీ అధికారులను తొలగించాల్సిన అవసరం ఏమివచ్చింది?

`‘‘సిబిఐ’’కి అప్పగిస్తేనే అన్ని విషయాలు బయటకొస్తాయి?

ఏ రోజునుంచైతే తగ్గానో…ఆ రోజు నుంచి నెగ్గడం మర్చిపోయాను అంటే ఇదేనేమో! ఈ కష్టం పగవాడికి కూడా రావొద్దేమో!!

ఆ మంత్రికి తెలంగాణ ప్రజల్లో మంచి పేరే వుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఆ కుటుంబానికి రాజకీయంగా గొప్ప కీర్తి వుంది. కొన్ని దశాబ్దాలుగా ఆ కుటుంబం ప్రజాసేవలో ముందు వరుసలో వుంది. ఇప్పటి వరకు రాజకీయంగా వెలెత్తి చూపలేనంత పరువు ప్రతిష్ఠ వుంది. రాజకీయాలలో ప్రజాసేవలో తన తండ్రిని కోల్పోయిన త్యాగం ఆ కుటుంబానికి సొంతం. ప్రజల్లో ఆ కుటుంబం మీద ఎంతో నమ్మకం, విశ్వాసం వుంది.

రాజకీయంగా ఎలాంటి నాయకుడికైనా కొన్ని సార్లు విమర్శలు తప్పవు. ఈ నాయకుడుపై ఉమ్మడి రాష్ట్రంలో గాని, ఇప్పుడు గాని పెద్దగా విమర్శలు లేవు. సమర్థవంతమైన నాయకుడు అనే గుర్తింపే వుంది. ఉన్నత విద్యావంతుడు. సమస్యల మీద అవగాహన వున్న నాయకుడు. అదృష్టం కలిసివస్తే ముఖ్యమంత్రి కూడా అయ్యేందుకు అన్ని అర్హతలున్నాయి. ఇప్పటికే రాజకీయంగా ఆయన ఎదగాల్సినంత ఎదగలేదు. రెండు సార్లు మంత్రి పదవి అనుభవిస్తున్నా తగిన స్థానం దక్కలేదు. కీర్తి ప్రతిష్ఠలకు కొదువలేదు. అయినా రాజకీయంగా వెనకబడుతున్నాడు. తగినంత గుర్తింపు రావడం లేదు అని ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు మధనపడుతుంటారు.

ఒక రకంగా చెప్పాలంటే రాజకీయంగా నెంబర్‌వన్‌ స్థానంలో వుండాల్సిన నాయకుడే…కానీ తనకు ప్రమేయం లేని అంశాలు తన మెడకు చుట్టుకునేలా వున్నాయి. ఆ సమస్యలు ఆయనను కలవరపెడుతున్నాయి. తన రాజకీయ జీవితానికి ముగింపు పలికేలా వున్నాయి. ఎందుకంటే ఎంతటి నేతలనైనా కడిగేయగల నాయకుడుగా పేరుంది. అవినీతికి ఆమడ దూరం వుంటాడనే అభిప్రాయం అందరిలోనూ వుంది. అలాంటి నాయకుడు వివాదాల మధ్య ఇరుక్కుపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఎవరికీ చెప్పుకోలేడు. నాకు సంబంధం లేదని తేల్చేయలేడు. అందుకే అటు చెప్పుకోలేక, ఇటు చక్కదిద్దుకోలేక సతమతమౌతున్నాడు. ఉజ్వలమైన తన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందేమో? అని మధనపడుతున్నారు. ప్రతిపక్షంలో వున్నప్పుడు అప్పటి పాలకులను అడుగడుగునా నిలదీసిన ఆ నాయకుడు ఇప్పుడు నోరు మెదపడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. తాను మంత్రిగా వున్నప్పటికీ సరిదిద్దుకునే అవకాశం లేని సమస్యలను ఎదుర్కొంటున్నాడు.

భయటపడలేని పరిస్థితులు ఎదురౌతాయని ఆందోళన చెందుతున్నారు. రాజకీయమా! కుటుంబమా అని తర్జనభర్జన పడుతున్నాడు. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా వుంది. రాజకీయంగా ఆయనకు పదవులు రావాలి. రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలి. అనే దృక్పథంతో వున్న ఆ నాయకుడికి

‘‘టెస్కో’’లో జరిగిన కుంభకోణం మూలంగా తలపట్టుకుంటున్నారు. తలెత్తుకోలేని పరిస్థితి వస్తుందని భయపడుతున్నాడు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఏ రోజు నుంచి తగ్గడం మొదలు పెట్టానో…అప్పటి నుంచి నెగ్గడం మర్చిపోయాను అని పెద్దలు చెప్పిన ఓ సామెత వుంది. అది ఇదేనేమో! అలాంటి కష్టం పగవారికి కూడా రాకూడదని కోరుకుంటారు. ఆ మంత్రికి తెలంగాణ రాజకీయాల్లో మంచి పేరుంది. ప్రజల్లో మంచి గుర్తింపు వుంది. ఆ నాయకుడు మా నాయకుడు అని గొప్పగా చెప్పుకునే అనుచర గణం వుంది. అంతే కాదు ఆ కుటుంబానికి కాంగ్రెస్‌ పార్టీ రాజకీయాల్లో గొప్ప పేరుంది. రాజకీయంగా గొప్ప కీర్తి కూడా వుంది. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఆ కుటుంబం త్యాగాలు కూడా చేసింది. కుటుంబ పెద్దను కూడా కోల్పోవాల్సివచ్చింది. ఈ తర్వాత మలి తరం నాయకుడు ప్రజా సేవలోకి వచ్చారు. ఇప్పటి వరకు ఆ కుటుంబాన్ని రాజకీయంగా వెలెత్తిచూపిన వారు లేరు. ప్రజల్లో ఆ కుటుంబం మీద అచెంచలమైన విశ్వాసం, నమ్మకం కూడా వున్నాయి. ఆ ఉమ్మడి జిల్లాలో ప్రజా సేవలో ఆ కుటుంబం ముందున్నది. అంత గొప్ప నాయకత్వం ఆకుటుంబానిది. మలితరం నాయకుడుగా ప్రజల మన్ననలు పొందిన ఈ నాయకుడు ఉమ్మడి రాజకీయాల్లో కూడా క్రియాశీల పాత్ర పోషించారు. కాంగ్రెస్‌లో కీలక భూమిక పోషిస్తూ వచ్చారు. తమది కాంగ్రెస్‌ కుటుంబం అనేందుకు ఆయన పదేళ్ల కాలంలో పార్టీలోనే వున్నారు. ఏనాడు ఆ నాయకుడి మీద ఎలాంటి రాజకీయ విమర్శలు కూడా లేవు. ప్రస్తుతం మంత్రిగా వున్న ఆ నాయకుడికి సమర్ధవంతమైన పాలకుడుగా, నాయకుడుగా కూడా మంచి పేరుంది. ఉన్నత విద్యావంతుడు, తెలంగాణ సమస్యల మీద, ప్రజా సమస్యల మీద ఇప్పుడున్న మంత్రి వర్గంలో ఎక్కువ అవగాహన వున్న నాయకుడు ఆ మంత్రి. గతంలో ఓసారి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా వివిధ శాఖలు నిర్వహించారు. శాసనసభ వ్యవహరాలలో ఆయన పాత్ర కూడా గొప్పది. ఇప్పుడు కూడా మంత్రిగా మరోసారి రాష్ట్ర ప్రభుత్వంలో కీలకస్ధానంలో వున్నారు. అయినా ఆయనకు తగినంత గుర్తింపు లేదని, ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు అంటుంటారు. మధనపడుతుంటారు. ఒక రకంగా ఇప్పుడున్న కాంగ్రెస్‌ నాయకుల్లో ఆయన కూడా నెంబర్‌ వన్‌ స్ధానం కోసం పోటీ పడుతున్న నాయకుడే.

కలిసొస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి కావాల్సిన నాయకుడే. కాని ఆయనకు సంబంధంలేని, తన ప్రమేయం లేని కొన్ని అంశాలు ఆయన మంత్రి పదవికి ఎసరు తెచ్చేలా వున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. తన రాజకీయ జీవితానికి ముగింపు పలికేలా వున్నాయన్న ఆందోళన వ్యక్తమౌతోంది. గత ప్రభుత్వ హయాంలో అంతా జరిగినా, అప్పుడు ఆయనకు వీసమెత్తు పాత్ర లేకపోయినప్పటికీ కుటుంబ పరంగా ఆయన పరువు బజారున పడనుంది. అవినీతి ఆరోపణలు విరుచుకుపడే అవకాశాలున్నాయి. గతంలో అవినీతి విషయంలో ఈ నాయకుడు ఒంటి కాలు మీద లేచేవారు. గత ప్రభుత్వ అవినీతిని నిత్యం ఎండగడుతూ వుండేవారు. కాని తనకు తెలియకుండానే తన అంశంలో ఎప్పుడో అప్పుడు నేను అబాసుపాలయ్యే పరిస్దితి వస్తుందని ఆయన కూడా ఊహించి వుండరు. అలాంటి నాయకుడు ఇప్పుడు అవినీతి కుంభకోణ వివాదంలో ఇరుక్కుపోయే పరిస్దితులు కనిపిస్తున్నాయి. అయితే వాటిపై ఎవరితో చెప్పుకోలేరు..నాకు సంబంధం లేని తేల్చేయలేరు. అటు చెప్పుకోలేక, ఇటు చక్కదిద్దుకోలేక సతమతమౌతున్నాడు. ఉజ్వలంగా వుండాల్సిన తన రాజకీయ భవిష్యత్తుకు ఆశనిపాతంగా టెస్కో వ్యవహారం మారుతుందా? అని ఆందోళన చెందుతున్నారు. ఒకప్పుడు టెస్కో విషయంలో ఈ నాయకుడు కూడా ఆరోపణలు గుప్పించిన సందర్భాలు కూడా వున్నాయి. ప్రతిపక్షంలో వున్నప్పుడు అప్పటి పాలకులను నిత్యం కడిగేసిన నాయకుడు ఇప్పుడు నోరు మెదపడానికి కూడా ఇష్టపడడం లేదు. తాను మంత్రిగా వున్నప్పటికీ సరిదిద్దుకోలేని స్దితిలో చిక్కుకొని లేని సమస్యలను ఎదుర్కొంటున్నారు. భయటపడలేని పరిస్దితులు ఎదురౌతాయా? అని ఆందోళన చెందుతున్నారు. దాంతో రాజకీయమా? కుటుంబమా?? అని తేల్చుకోలేక తర్జన భర్జనపడుతున్నారని సమాచారం. ఇప్పుడు ఆయన పరిస్దితి కరవమంటే కప్పకు కోసం, విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా మారింది. రాజకీయంగా మరింత ఉన్నత స్ధానానికి చేరాల్సిన సమయంలో ఆయనకు ఊహించని ఉపద్రవం ఎదురౌతుందని ఆయన కలలో కూడా అనుకోలేదు. రాష్ట్ర రాజకీయాలలో ఇంకా ఎంతో కాలం ప్రజా సేవ చేయాల్సిన నాయకుడు, తనకు సంబంధం లేని విషయం మూలంగా ఇబ్బందుల పాలౌతారా? ప్రజలనుంచి విమర్శలు ఎదుర్కొంటారా? వేచి చూడాలి. కాని ఆయన పాత్ర ఏమాత్రం లేని టెస్కోలో జరిగిన కుంభకోణం మూలంగా ఆయన తలపట్టుకుంటున్నారు. తలెత్తుకోలేని పరిస్ధితి ఎదురౌతుందా? అని కలవరపడుతున్నారు.

ఇదొక విచిత్రమైన సందర్భం. కాని చిన్న చితకా వ్యహారం కాదు. చేసింది మంచి పని కాదు. టెస్కొలోవెలుగు చూసిన అవినీతి కుంభకోణం. ఒక వ్యవస్ధను నిర్వీర్యం చేసిన దౌర్భాగ్యం. నమ్మి శాఖను అప్పగిస్తే నిండా ముంచిన వైనం. కోట్ల రూపాయలు దోచుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్న ఉదంతం. ఒకప్పుడు టెస్కొలో పెద్దఎత్తున అవినీతి జరుగుతోందని, జరిగిందని పదే పదే కొన్ని వందల సార్లు కాంగ్రెస్‌ నాయకులందరూ చెప్పిన మాటే. లెక్కలతో సహా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిపక్షంలో వున్నప్పుడు అనేక సభల్లో , వేధికల మీద మాట్లాడిరదే. అంతే కాదు ముఖ్యమంత్రి హోదాలో ఇటీవల అసెంబ్లీలో కూడా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించిన అంశమే. గత ప్రభుత్వం పెద్దఎత్తున అవినీతి చేసిందని ఆరోపణలు చేసిన కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు నమ్మారు. ఆదరించారు. గెలిపించారు. పాలన అప్పగించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సంబంధిత చేనేత, జౌళి శాఖలో జరిగిన దానిపై దృష్టి పెట్టారు. ఆ శాఖ ప్రక్షాళనకు పూనుకున్నారు. జరిగిన అవినీతిని వెలికితీయాలని నిర్ణయం తీసుకున్నారు. శాఖలో సమూల మార్పులు చేశారు. ఉన్నతాదికారులను తప్పించారు. విజిలెన్స్‌ ఎంక్వౌరీకి ఆదేశాలు జారీ చేశారు. నూతన యంత్రాంగం అంతా తన పనులు తాను చేస్తున్న తరుణంలో మళ్లీ ఆ శాఖలోని ఉద్యోగులు పిడుగులాంటి వార్తను విన్నారు. ఆ శాఖ అధిపతిగా వున్న కమీషనర్‌, ప్రిన్సిపల్‌ సెక్రటరీగా వెళ్లి తిరిగి మళ్లీ అదే సీట్లోకి వచ్చారు. తన ప్రతాపం చూపడం మొదలు పెట్టారు. తన అవినీతి చిట్టా బైటకు తీస్తున్న అదికారుల్లో కొంత మందిని ట్రాన్స్‌ఫర్‌ చేశారు. కొంతమందిని సస్పెండ్‌ చేశారని సమాచారం. అంటే ప్రభుత్వం ఉత్తర్వుల ద్వారా విజిలెన్స్‌ బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులను సదరు కమీషనర్‌ సస్పెండ్‌ చేయడం పెద్దఎత్తున వివాదానికి దారి తీసింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కమీషనరే, ప్రభుత్వం అప్పగించిన పనిని నిర్వర్తిస్తుంటే ఉద్యోగ పరంగా వేధింపులకు గురి చేయడాన్ని ఆ శాఖ ఉద్యోగులు మండి పడుతున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కమీషనర్‌తోపాటు, సహకరించిన ఉద్యోగులపై ప్రభుత్వం వేటు వేసింది. కమీషనర్‌కు స్ధాన చలనం కల్పించినా, మంత్రి ఒత్తిడితో మళ్లీ అదే సీట్లోకి వచ్చింది. వేటు పడిన ఉద్యోగులకు మళ్లీ పోస్టింగులు ఇవ్వడం జరిగింది. అంటే ప్రభుత్వానికంటే కమీషనరే పవర్‌ ఫుల్‌ అని నిరూపిస్తోంది. పైగా కమీషనర్‌ మీద ఎంక్వౌరీలో పాలు పంచుకున్న ఓ మహిళా అదికారికి ఇప్పటి వరకు మూడు నెలలుగా జీతం ఇవ్వకుండా వేధిస్తున్నట్లు కూడా శాఖలో గుసగులాడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో చేనేత, జౌళిశాఖలో కీలకభూమికతోపాటు, పెద్దఎత్తున అవినీతికి కమీషనర్‌ పాల్పడనట్లు ప్రభుత్వం గుర్తించింది.

ఏది నిజం..ఏది అబద్దం: చేనేత సహాకార సంఘాల్లో ముప్పైశాతానికి పైగా బోగస్‌ సంఘాలను గుర్తించినట్లు సాక్ష్యాత్తు వ్యవసాయ, చేనేత, ఔళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అదికారికంగా ప్రకటించారు. విజిలెన్స్‌ ఎంక్వౌరీకి కూడా గతంలోనే ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో టెస్కొ నుంచి వివిధ శాఖలకు వస్త్రాల రవాణాలో చెల్లింపుల్లో అవకతవకలు జరిగాయని గుర్తించినట్లు మంత్రి వెల్లడిరచారు. వందల కోట్ల అవకతలను ప్రాధమికంగా గుర్తించినట్లు కూడా చెప్పారు. పైగా గతంలో చేనేత పేరు చెప్పి మరమగ్గాల మీద తయారైన వస్త్రాలను కొనుగోలు చేశారని కూడా తెలిసినట్లు మంత్రి చెప్పారు. తెలంగాణలో 393 చేనేత సంఘాలు, 140 మాక్స్‌ సొసైటీలు, 135 చిన్న తరహా యూనిట్లున్నాయి. వీటిలో 30శాతం బోగస్‌ సంఘాలున్నట్లు ప్రభుత్వం గుర్తించినట్లు తెలిపారు. ఆ బోగస్‌ సంఘాల సృష్టివెనుక ఎవరున్నారన్నదానిపై కూడా విచారణ జరుగుతోంది. ప్రధానంగా వాటి రూపకల్పనలో కూడా ఉన్నతాధికారి పాత్ర నేరుగా వున్నట్లు కూడా అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. రాష్ట్రంలో వున్న 393 చేనేత సంఘాలలో కేవలం 105 సంఘాలకు మాత్రమే పని కల్పించారని కూడా నివేదికలున్నాయి. వీటిని త్వరగా నిగ్గు తేల్చాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో వుంది. కాని కమీషనర్‌ చేసిన పనికి సంబంధించి, ఆమె మీద వస్తున్న ఆరోపణల మూలంగా మంత్రి పరువు ప్రతిష్ట గోదావరిలో మునిగిపోతుందని ఆయన శ్రేయోభిలాషులు బాధపడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికే ఓ అడుగు ముందుకు వేసింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజిలెన్స్‌ ఎంక్వౌరీకి ఆదేశించారు. ఇదిలా వుంటే టిస్కొలో కోట్లు చేతులు మారినట్లు, అవినీతి జరిగినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తేల్చి చెప్పారు. చేనేతల పొట్ట కొట్టారని కూడా నిజాన్ని నిగ్గు తేల్చారు. 2016 నుంచి చేనేత శాఖలో ఆడిట్‌ జరగకుండా ఎందుకు తొక్కిపెట్టారు. ఆడిట్‌ జరగకుండా ఎందుకు అడ్డుకున్నారు? ఎవరు అడ్డుకున్నారు? అన్నది కూడా వెలుగు చూడాల్సిన అవసరం వుంది. విజిలెన్స్‌ అదికారులు ఇచ్చిన సూచనతో జయేష్‌ రంజన్‌ ఇచ్చిన ఆదేశాలు కూడా ఎందుకు బుట్టదాఖలయ్యాయి అన్నది తేలాల్సివుంది. ఈ మొత్తం అవినీతి, గందరగోళం మీద సిబిఐ ఎంక్వౌరీ జరిగితే అన్ని నిజాలు నిగ్గు తేలుతాయని చేనేత కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. చూద్దాం..ఏం జరుగుతుందో!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!