భూపాలపల్లి నేటిధాత్రి
మహాలక్ష్మి పధకానికి సబ్సిడీ మంజూరుకు గ్యాస్ కనెక్షన్ కలిగిన లబ్ధిదారులు
ఈ కేవైసి చేపించుకోవాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం అదనపు కలెక్టర్ ఛాంబర్ లో మహాలక్ష్మి పధకానికి రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఈ కేవైసి చేపించే ప్రక్రియపై పౌర సరఫరాలు, గ్యాస్ డీలర్ల తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెల్ల రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా 500 రూపాయలకు గ్యాస్ ఇవ్వాలని నిర్ణయించిన నేపద్యంలో జిల్లాలోని తెల్ల రేషన్ కార్డులు కలిగిన లబ్ధిదారులు తమ రేషన్ కార్డు, ఆధార్, గ్యాస్ కనెక్షన్ నంబర్ బ్యాంక్ అకౌంట్ నంబర్, సెల్ ఫోన్ నంబర్లతో సంబంధిత గ్యాస్ ఏజెన్సీ వద్ద ఈ కేవైసి చేపించుకోవాలని ఆయన సూచించారు. మహాలక్ష్మి స్కీమ్‌లో అర్హులైన లబ్ధిదారులు గ్యాస్ ఏజెన్సీలు వద్ద ఈ కేవైసి పొందని కారణంగా సబ్సిడీ పొందడానికి ఇబ్బందులు వస్తున్నాయని, అటువంటి లబ్ధిదారులు తక్షణమే ఆయా గ్యాస్ ఏజన్సీల వద్ద ఈ కేవైసిఅప్‌డేట్ చేసుకో వాలని ఆయన సూచించారు. ప్రజలకు అవగాహన కొరకు ఎంపిడిఓ కార్యాలయాలతో పాటు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన
ప్రజాపాలన సేవాకేంద్రాల వద్ద బ్యానర్లు ఏర్పాటు చేయాలని చెప్పారు.
ఈ సమావేశంలో పౌర సరఫరాల సంస్థ డిఎం రాఘవేంద్రరావు, జిల్లాలోని వివిధ గ్యాస్ ఏజెన్సీల డీలర్లు తదితరులు పాల్గొన్నారు.