– పోతంశెట్టిపల్లి కమాన్ వద్ద… పనులు చేపట్టేది ఎప్పుడు…?
– తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు…
– ప్రమాదం జరిగితే కానీ పట్టించుకోరా…?
కొల్చారం, ( మెదక్ ) నేటి ధాత్రి :-
అసలే వానకాలం.. ప్రమాదం.. తెలిసిన పట్టించుకోని అధికారులు. మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి కమాన్ వద్ద గుంతల గుంతల మాయంగా మారిన రోడ్డు.. చూసి చూడనట్లు అధికారులు వ్యవహరిస్తున్నారని వివిధ గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. చిన్నపాటి వర్షం పడితేనే గుంతలో నీరు నిండి వాహనదారులకు చాలా ఇబ్బందిగా ఉందని తెలిసిన కూడా ఉన్నత అధికారులు స్పందించకపోవడం ఎంతవరకు సమంజసం అని పలురు వాపోతున్నారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో మెదక్ – సంగారెడ్డి ప్రధాన జాతీయ రహదారి గుంతలు గుంతలుగా ఉన్న రోడ్డును ఉన్నత అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఇటువైపు కన్నెత్తి చూడకపోవడం వాహనదారులు సిగ్గు పడుతున్నారు. గుంతలు గుంతలుగా పడి ఎన్ని రోజులు గడుస్తున్నప్పటికీ కూడా అధికారులు పట్టించుకోవడం ఎంతవరకు సమంజసం. ఏదైనా ప్రమాదం జరిగితేనే పట్టించుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది.