`కమీష్ నర్ చోహన్ బదిలీకి కారణం ఆ నోటీస్ ఏనా?
`సివిల్ సప్లై అధికారుల తీరు…మిల్లర్లకు రివాజు?
`కొండలా పేరుకు పోతున్నా అధికారులు పట్టించుకోరు!
`కోడిగుడ్డంత వసూలు చేసి గొప్పలు చెప్పుకుంటారు?
`జీతాలు లక్షల్లో తీసుకుంటారు… కమీషన్లు కోట్లలో వెనకేసుకుంటారు?
`పై స్థాయిలో జరిగే నిర్ణయాలు మిల్లర్లకు లీక్ చేస్తుంటారు?
`పరోక్షంగా మిల్లర్లను కాపాడుతుంటారు?
`మన్నుతిన్న పాముల్లా అమాయకం వాళ్లబోస్తుంటారు?
`తెలంగాణలో బాయిల్డ్, రా రైస్ మిల్లులు మొత్తం 3309!
`12 సంవత్సరాల కాలంలో 800 మంది మిల్లర్లపై కేసులు నమోదు?
`కేసుల్లో వున్న కిరి కిరి విచిత్రం?
`అధికారులు చెప్పినట్టు అవినీతికి పాల్పడితే కేసులుండవు?
`నిజాయితీ గా ఉంటామనే మిలర్లపై కేసులు నమోదు?
`తిమింగాలాలటువంటి బకాయి మిల్లర్లపై కేసులు తక్కువ?
`చిన్న చిన్న బకాయి మిల్లర్లపై కేసులు ఎక్కువ?
`అధికారులకు సహకరించని వారిపైనే అధికంగా కేసులు నమోదు?
`అవినీతి అధికారులపై మిల్లర్లు వేసిన కేసులపై చర్యలుండవు?
……………….
`2022-2023 సంవత్సరంలో పెద్ద ఎత్తున బకాయి పడిన మిల్లర్లు 314 మంది
`కమీషనర్ చౌహన్ తయారు చేసిన రిపోర్ట్ లో స్పష్టంగా చర్యలకు ఆదేశాలు?
`పర్యవ సానం కమీషనర్ చౌహన్ బదిలీ?
`గతంలోనూ ఇదే జరిగింది..ఇద్దరు కమీషనర్ల కు స్థాన చలనం జరిగింది.
`314 మంది మిల్లర్లు 540000 మెట్రిక్ టన్నుల ప్యాడి మాయం చేసినట్టు చౌహన్ నివేదికలో తెలిపారు.
`వారిపై 25% పెనాల్టీతో రికవరీ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
`బకాయిలు చెల్లిస్తేనే వడ్లు ఇవ్వాలని సూచించారు?
`నివేదిక తయారుకు కమీషనర్ చౌహన్ కు బహుమానం స్థాన చలనం!
హైదరాబాద్, నేటిధాత్రి:
సివిల్ సప్లయ్ శాఖను గాడిలో పెట్టలేరా? పెట్టే అవకాశంలేదా? ఆ శాఖను గాడిలో పెట్టడం పాలకుల వల్ల కావడం లేదా? గత పదేళ్లు అంతే, ఇప్ప్పుడూ అంతేనా? సివిల్ సప్లై శాఖ ఏమైనా తేనె తుట్టెనా? కదిలిస్తే, పాలకులకు ఏమైనా ఇబ్బందా? రైస్ మిల్లర్లు, అదికారుల కలిసి ఆడుతున్న నాటకాలు పాలకులకు తెలియదా? ముఖ్యంగా ఆ శాఖ మంత్రులకు తెలియదా? సివిల్ సప్లై శాఖ అంటే అంత ఉదాసీనత ఎందుకు? రైతులను మోస్తున్నారు? ఇటు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు? అయినా పాలకులకు కనిపించడం లేదా? జరుగుతున్న వ్యవహారం చూస్తూ వదిలేస్తున్నారా? ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న uకాయిలు కనిపించడం లేదా? కొండలా పెరుగుతున్నా వసూలు చేయడం ఇష్టం లేదా? ప్రభుత్వానికి జోక్యం చేసుకునే సమయం లేదా? అదికారులు పాలకులను తప్ప్పుదారి పట్టిస్తున్నారా? ఇంతకూ ఏం సివిల్ సప్లైశాఖలో ఏం జరుగుతోంది? ఆరా తీసేవారే లేరా? ఆ శాఖ మీద దష్టిపెట్టిన కమీషనర్లకు ఎందుకు స్ధాన చలనాలు జరగుతున్నాయి. అసలు ఆ శాఖలో వున్న లోతులు తెలుసుకునే లోపే కమీషనర్లను ఎందుకు మార్చుతున్నారు. తాజాగా కమీషనర్ చౌహన్‌ను కూడా ఇదే పరిస్దితుల్లో మార్చారా? ఒకప్ప్పుడు సివిల్ సప్లై శాఖ అంటే ఉద్యోగులకు అంత క్రేజ్ లేదు. పాలకులు అంత దష్టిపెట్టాల్సిన పని లేదు. కాని ఇప్ప్పుడు రెవిన్యూ శాఖను మంచి పోయిన సివిల్ సప్లై గురించి పాలకులు కావాలనే పట్టించుకోవడం లేదా? గతంలో లాగానే అందులో ఏమీ లేదనుకుంటున్నారా? సివిల్ సప్లై మీద లోతుగా అద్యయనం చేయాలన్న ఆలోచన కూడా పాలకులులేదా? ఎందుకంటే గత పదేళ్ల కాలం నుంచి సివిల్ సప్లైశాఖలో బకాయిలు కొండలా పేరుతుకుపోతున్నాయి. సుమారు 25 వేల కోట్ల రూపాయల వరకు బకాయిలున్నట్లు తెలుస్తోంది. ఆ బకాయిలు వసూలు చేస్తే రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడానికి వీలౌతుంది. రాష్ట్ర ప్రభుత్వం మిగులు బడ్జెట్లోకి వెళ్తుంది. అయినా పాలకులు ఆ దిశగా దష్టిపెట్టడం లేదు? కారణం తెలియడం లేదు? తెలంగాణ వాప్తంగా సుమారు 3వేలకు పైగా రైస్ మిల్లులున్నాయి. అందులో మెజార్టీ రైస్ మిల్లులు పారాబాయిల్డ్ మిల్లులున్నాయి. కొన్ని దశాబ్దాలుగా పాతుకపోయిన ఆ మిల్లర్లదే హవా. తెలంగాణలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిన తర్వాత పంటలు విపరీతంగా దిగుబడులు రావడంలో అనేక మిల్లుల ఏర్పాటు జరిగింది. సంవత్సం మొత్తం పని వుండేంత వరి పండుతోంది. అలా అటు ఫ్రభుత్వానికి ఎంతో ఆదాయం సమకూరుతుంది. కాని అది ఖజానాకు చేరడం లేదు. కేవలం మిల్లర్లు, అధికారుల జేబుల్లోకి చేరుతోంది. ఇదంతా బహిరంగ రహస్యమే? అయినా ఎటు వంటి చర్యలు వుండవు. అసలు ఆ దిశగా పాలకుల ఆలోచనలే వుండవు. పంటలు మార్కెట్‌కు రాగానే ప్రభుత్వం రైతులకు సొమ్ము చెల్లిస్తుంది. అక్కడ ఎలాంటి జాప్యం జరగదు. వడ్లు తీసుకునే మిల్లర్లు అందుకు సమానమైన గ్యారెంటీలు చెల్లించాలి. దేశంలో అన్ని రాష్ట్రాలలో ఇదే విధనం అమలు జరుగుతోంది. కాని ఒక్క తెలంగాణ మాత్రం ఈ పద్దతి తూతూమంత్రంగా జరుగుతోంది. కుక్క తోకను ఆడించాలి గాని, తోక కుక్కను ఆడిస్తే వింతగా వుంటుంది. ఇక్కడ కూడా అదే జరుగుతుందా? అని అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరు విచిత్రంగా వుంటుంది. మిల్లర్ల వ్యవహారం అంత కన్నా చిత్రంగా వుంటుంది. గత కమీషనర్ చౌహాన్ తెల్చిన కొన్ని లెక్కల ప్రకారం తెలంగాణలో సుమారు 341 మంది మిల్లర్లు సుమారు 6వేల కోట్లకు పైగా బకాయిలు వున్నట్లు తేలింది. వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ కమీషనర్ ప్రభుత్వానికి నివేదిక పంపించారు. వారిపై చర్యలు తీసుకోవాలనేదానిపై జీవో కూడా జారీ చేశారు. కాని ఏం జరిగింది? మిల్లర్లు బాగానే వున్నారు? కమీషనర్ చౌహాన్ మాత్రం స్దాన చలనం జరిగి వెళ్లిపోయారు? అంటే మిల్లర్ల లాబీయింగ్ ఎంత పవర్ పుల్గా వుంటుందో ఈ ఒక్క సంఘటనతో చెప్పొచ్చు. అంటే మిల్లర్ల వ్యవస్ధ ప్రభుత్వాన్ని కూడా శాసించే స్దాయికి చేరుకున్నదా? అందుకు బాధ్యులెవరు? మిల్లర్లు ప్రభుత్వాన్ని బెదించేంత స్ధాయికి చేరుకోవడానికి కారకులెవరు? పాలకులా? లేక అధికారులా? అనేది కూడా తేలాల్సి వుంది. ఇక అదికారుల మరో విచిత్ర వైఖరి విడ్డూరంగా వుంటుంది. తెలంగాణలో చిన్నా చితకా బకాయిలు వున్న ఓ 800లకు పైగా మిల్లర్ల మీద కేసులు నమోదు చేశారు. నిజానికి వాళ్లంతా డిఫాల్టర్లు కాదు. కాని వారిని అదికారులే డిఫాల్లర్లుగా మార్చుతుంటారు? కొంత మంది అదికారుల చేష్టల మూలంగా న్యాయంగా, ధర్మంగా పనిచేసే మిల్లర్లు మాత్రమే కేసులు ఎదుర్కొంటున్నారనే వార్త నిజంగానే విచిత్రంగా వుంటుంది. అవునా అనే అనుమానం ఎవరికైనా కలుగుతుంది. కాని ఇది ముమ్మూటికీ నిజమని అలా కేసులు ఎదుర్కొంటున్న మిల్లర్లే అంటున్నారు. తాము ఎలాంటి అవకతవకలకు పాల్పడమని చెప్పడమే వాళ్లు చేసుకున్న పాపమైంది? తాము అడినంత ఇవ్వండి? మేం కేటాయించిన వడ్లు తీసుకోండి? వాటిని ఏం చేసుకున్నా ఫరవాలేదు? మాకు ఇవ్వాల్సింది ఇస్తే చాలు? అని కొంత మంది అధికారులు మిల్లర్ల మీద ఒత్తిడి తేవడం జరుతుందట! తర్వాత ఎలాంటి ఇబ్బందులు రాకుండాచూసుకుంటామని కూడా మాట ఇస్తారట? కాని అలా చేయడం ఎప్పటికైనా ముప్పే అన్న ఆలోచనతో కొంత మంది మిల్లర్లు ముందకు రారు. దాంతో వారిపై వెంటనే విలిలెన్స్ ఎంకౌరీలు జరుతుంటాయి. వారిపై కేసులు నమోదు చేయబడుతుంటాయి. నిజాయితీగా వ్యహరించినందుకు అలా కేసులు పాలైన చిన్న చిన్న మిల్లర్లు 800 మంది వరకు వున్నారంటే పరిస్ధితి ఎలా వుందో అర్దం చేసుకోవచ్చు. అదే పెద్ద పెద్ద మిల్లర్లు, యూనియన్ పేరుతో పెత్తనం చేసే మిల్లర్లు అ ంతా కలిసి సుమారు 341 మంది వుంటారు. వారంతా పెద్ద మొత్తంలో ప్రభుత్వానికి uకాయిలు పెడ్డట్లు మాజీ క మీషనర్ చౌహాన్ తేల్చారు. కాని ఆయన రిపోర్టు బుట్ట దాఖలైంది. ఈ 341 మంది సుమారు 15లక్షల టన్నుల బియ్యం ప్రభుత్వానికి బాకీ పడ్డారు. దాని విలువ సుమారు 6 వేల కోట్ల దాక వుండొచ్చని ఓ అంచనా? ఇంత పెద్ద మొత్తంలో వున్న బకాయి దారులను అధికారులు ముట్టుకోరు. ఎందుకంటే పెద్ద పెద్ద మిల్లర్లు పెద్దన లంచాలు ఇవ్వగలరు. అది లక్షలే కాదు, కోట్ల దాకా వుంటుంది. అందువల్ల ఆ మిల్లర్ల జోలికి ఎవరూ వెళ్లరు. ఇలా పెద్దఎత్తున బకాయిలు వున్న మిల్లర్లకు వచ్చే పంటకు వడ్లు కేటాయించొద్దని కూడా చౌీVAన్ ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాలను అధికారుల బుట్ట దాఖలు చేశారు. మళ్లీ మళ్లీ వారికే వడ్లు కేటాయిస్తూపోతున్నారు. ఆ శాఖకు చెందిన ఉన్నతాదికారి మాటకు, ఆయన ఆదేశాలకు లెక్కలేదంటే ఇక ఈ విషయం ఫ్రభుత్వం దాకా వెళ్తు వెళ్తుంది. గత ప్రభుత్వంలో ఇదే జరిగింది. అప్ప్పుడు కూడా సరిగ్గా మిల్లర్ల రాజకీయం మూలంగా అకున్ సబర్వాల్, సివి. ఆనంద్‌లు కూడా సివిల్ సప్లై శాఖను వదులుకోవాల్సి వచ్చింది. ఎంతో చిత్తశుద్దితో ఆ శాఖను గాడిలో పెట్టాలని ఆ సమయంలో ఇద్దరు అధికారులు ఎంతో కషి చేశారు. ప్రభుత్వానికి బకాయిలు వసూలు చేయించేందుకు కసరత్తు చేశారు. మార్గాలు వేశారు. కాని ఆఖరుకు రాజకీయం పని చేసింది. ప్రభుత్వ పెద్దలు కూడా ఆనాడు మిల్లర్ల మాట విన్నారు. కమీషనర్ల నివేదికను ఆనాడు పట్టించుకోలేదు. ఇప్ప్పుడూ పట్టించుకోవడ ంలేదు. ఆనాడు ఇద్దరు ఉన్నతాధికారులు, ఇప్ప్పుడు చౌహాన్లో ట్రాన్స్ఫర్లు అయ్యారు. ఇక ఇప్ప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సన్న బియ్యం ఇస్తోంది. ఎక్కడా ఆ పధకానికి ఇబ్బంది ఎదురౌతుందో అని ప్రభుత్వం మిల్లర్లకు భయపడుతోందన్న మాటలు వినిపిస్తున్నాయి. మిల్లర్ల మీద బకాయిల కత్తి వేళాడదీస్తే, మొదటికే మోసం వస్తుందన్న భయం ఎందుకు ఎదురౌతోంది? బకాయిలు చెల్లించకున్నా ఫరవాలేదు. వడ్లు ఇస్తాం బియ్యం ఇవ్వమంటే మిల్లర్లు సగం తింటున్నారు. అందులో సగం అధికారులకు పంచుతున్నారు. అరకొర బియ్యం ప్రభుత్వానికి అందిస్తున్నారు. ఇలా సివిల్ సప్లై అధికారుల అవినీతి తీరుతో మిల్లర్లు బలవంతులౌతున్నారు. ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలకు ఎగనామం పెడుతున్నారు. ఇప్పటికైనా పాలకులు జోక్యం చేసుకోకపోతే మిల్లర్ల బకాయిలు గట్టలు,కొండలను మించిపోతాయేమో!!
