
Private and corporate schools
విద్య సంస్థల బంద్ విజయవంతం.
ధనిక రాష్ట్రం అంటూనే మరో వైపు ఖజానా ఖాళీ
వామపక్ష విద్యార్థి సంఘాలు
నర్సంపేట,నేటిధాత్రి:
ప్రైవేట్,కార్పొరేట్ పాఠశాలల్లో అధిక పీజులు వసూల్ చేస్తూ విద్య హక్కు చట్టాన్ని ఉల్లంగిస్తున్నారని ఆరోపిస్తూ అలాగే ప్రభుత్వ పాఠశాలలు,గురుకులాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ వివిధ విద్యార్థి సంఘాల పిలుపు మేరకు బుదవారం చేపట్టిన విద్య సంస్థల బంద్ నర్సంపేటలో విజయవంతం అయ్యింది.ఈ నేపథ్యంలో పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగా సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులతో రాస్తారోకో నిర్వహించి విజయవంతం చేశారు.ఈ సందర్బంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు దిడ్డి పార్థసారథి, పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు గుర్రం అజయ్,జిల్లా అధ్యక్షులు నరేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక విధానాలు,ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకోడం కారణంగా అధికారాన్ని కోల్పోయింది.కేసీఆర్ ను గద్దేదించే పోరాటాల్లో వామపక్ష విద్యార్థి సంఘాలు ప్రధాన పాత్ర పోషించాయాన్నారు.పేద విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు బకాయిలను పెండింగ్ పెట్టకుండా ఎప్పటికప్పుడు చెల్లిస్తామని,విద్య రంగానికి 15 శాతం నిధులు కేటాయిస్తామని,నిరుద్యోగ సమస్య తీరుస్తామని చెప్పారు.
ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఇచ్చిన హామీలను అమలు చేస్తూ పెండింగ్ బకాయిలు పెట్టకుండా,విద్య రంగంలో ఉన్నా అన్ని ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తూ,ఫీజు నియంత్రనా చట్టం తీసుకోస్తు, విద్యార్థులందరికి ఉచిత బస్సు పాసులు ఇవ్వాలని కోరారు.
జాతీయ నూతన విద్య విధానాన్ని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలనీ డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 23 న తలపెట్టిన విద్య సంస్థల బంద్ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొని బంద్ ను విజవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈకార్యక్రమలో ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి పైస గణేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు పవన్ వరుణ్, బానోత్ స్టాలిన్, వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు కిరణ్, క్రాంతి ప్రవళిక కళ్యాణి శ్వేత రజిని నాగేంద్ర,గౌతమ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.