దేశానికి వెన్నెముక రైతన్న

అసోసియేట్ పియు మేనేజర్ అక్కల రమేష్

శాయంపేట నేటి ధాత్రి: రైతు దేశానికి వెన్నెముక అన్నం పెట్టే రైతన్నను ఎల్లవేళలా రైతుల మీద ఆధారపడి నటువంటి వివిధ కంపెనీలు అందరు కూడా అభినందించాలని ప్రజ్వల్ రైతు ఉత్పత్తిదారుల సంఘం శాయంపేట ప్రాజెక్ట్ అసోసియేట్ మేనేజర్ అక్కల రమేష్ అన్నారు, ఈరోజు కాట్రపల్లి గ్రామంలో ప్రజ్వల్ ఎఫ్.పి.సి.ఎల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ పత్తి దినోత్సవంసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా అక్కల రమేష్ పాల్గొని మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే రైతును ఏనాడు కూడా చులకన చూడకుండా పత్తి పైన ఆధారపడేటువంటి వివిధ కంపెనీలు జిన్నింగ్ మిల్ మార్కెటింగ్ స్పిన్నర్లు వ్యవసాయ కూలీలపై కేవలం పత్తి పండించే రైతుల మీద ఆధారపడే కుటుంబాలను జీవనుపాదులుగా ఉపయోగపడుతుందని అన్నారు కావున ఎల్లవేళల పత్తిని పండించే రైతును కూడా చులకనగా చూడకూడదని వివరించారు పత్తి లేనిదే మన మనం ధరించేటువంటి దుస్తులు లేవని దుస్తులను ఏసుకునేటువంటి మనము పండించే రైతును కూడా ప్రత్యేకంగా గుర్తించుకోవాలని ఈ సమావేశంలో అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజ్వల్ రైతు ఉత్పత్తి దారుల సంఘం క్షేత్ర సిబ్బంది దిడ్డిపాక రవిచందర్ ఎస్.కె గౌస్ తారాల తిరుపతి పోతు సునీల్ పోరండ్ల భానుమతి బైక్ని ప్రశాంత్ కుక్కల కల్పన మనోహర్ తదితరులు రైతులు ఒంటరి ప్రసాద్ మహేందర్ రాజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *