
#వైజ్ఞానిక ప్రదర్శనను నిర్వహిస్తున్న విద్యార్థులు.
#ప్రిన్సిపాల్ ఉషారాణి.
నల్లబెల్లి , నేటి ధాత్రి:నేటి సమాజంలో అన్ని ప్రయోగాలతో ప్రపంచాన్ని నడిపించేది సైన్స్ అని కారుణ్య జ్యోతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రిన్సిపాల్ ఉషారాణి పేర్కొన్నారు. మంగళవారం నేషనల్ సైన్స్ డే సందర్భంగా పాఠశాలలో సైన్స్ సంబరాల కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం విద్యార్థులు క్విజ్ పోటీలలో పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. ఈ కార్యక్రమంలో రాణించిన విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఉషారాణి మాట్లాడుతూ. ప్రతి విద్యార్థి విద్యార్థి దశనుండే సైన్స్ పై అవగాహన పెంచుకొని శాస్త్ర సాంకేతిక రంగాలలో ముందుండాలని ఆమె సూచించారు. సైన్స్ అంటే సమాధానం. సైన్స్ అంటే రుజువు అనే విషయాలను ప్రతి విద్యార్థి గుర్తుపెట్టుకోవాలని ఆమె పేర్కొన్నారు. విద్యార్థులు 85 కు పైగా వైజ్ఞానిక ప్రదర్శనలు ఎగ్జిబిట్లు చేయడంతో ఈ కార్యక్రమం పలువురిని ఆకర్షించింది. కార్యక్రమంలో కరస్పాండెంట్ మరియాదాస్. వైస్ ప్రిన్సిపాల్ కుమారస్వామి, సైన్స్ ఉపాధ్యాయులు లక్ష్మణ్ . సౌమ్య. సాంబమూర్తి, ఉపాధ్యాయ బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు..