
ప్రభుత్వ రంగ సంస్థల నిర్వీర్యం చేస్తున్న మోడీ
శ్రావణపల్లి బ్లాక్ ను సింగరేణికే కేటాయించాలి
సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రవీణ్
భూపాలపల్లి నేటిధాత్రి
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 60 బొగ్గు బ్లాగులను వేలం వేలం వేయడం దారుణమని, సింగరేణి బొగ్గు బ్లాక్ లను వేలం వేయడాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.శుక్రవారం కేంద్ర ప్రభుత్వం సింగరేణి బొగ్గు గనుల వేలం వేయడాన్ని నిరసిస్తూఏఐటీయూసీ ఆధ్వర్యంలో భూపాలపల్లి జిఎం కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ దీక్షలను ఏఐటీయూసీ వైస్ ప్రెసిడెంట్ మాతంగి రామచందర్, నూకల చంద్రమౌళి, హాజరై దీక్షా శిబిరంలో కార్మికులకు దండాలు వేసి దీక్షలను ప్రారంభించారు. ఆరవ రోజు దీక్షలో సిపిఐ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చివరి రోజు దీక్షలకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తుందని, జాతీయ సంపద అయిన బొగ్గు బ్లాక్ లను ఆదాని అంబానీలకు కట్టబెడుతూ పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తుందని విమర్శించారు. నరేంద్ర మోడీ రామగుండం పర్యటనలో సింగరేణి ప్రైవేట్ పరం చేయనని ప్రలోభాలు పలికి మూడవసారి అధికారంలోకి రాగానే సింగరేణి బ్లాకులను వేలం వేయడం అత్యంత దారుణమని అన్నారు. కేంద్రంలో బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి బొగ్గు బ్లాకులను హైదరాబాదులోని వేలానికి పెట్టాడని ఆరోపించారు. గత ప్రభుత్వాల రాజకీయ జోక్యం వల్లనే సింగరేణి సంస్థ నిర్వీర్యమైందని బి ఆర్ ఎస్ కు పట్టిన గతే బిజెపికి పడుతుందని ఇప్పటికైనా శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ ను వేలం వేయకుండానే సింగరేణి సంస్థకు కేటాయించాలని ఈ సందర్భంగా ప్రవీణ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రజా సంఘాల నాయకులు, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నేరెళ్ల జోసెఫ్, డి హెచ్ పి ఎస్ నాయకులు కాంతారావు, ఏ ఐ వై ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆరబోయిన వెంకటేష్, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు పొన్నగంటి లావణ్య, పీకే రవికాంత్, ఎండి యాకూబ్ పాషా, ఓద్దులే సాకేత్ రెడ్డి, మాతంగి దిలీప్, చల్లూరి రక్షిత, కొమ్మెర రమేష్ చారి, మట్టి కృష్ణ సిపిఐ పట్టణ కమిటీ, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు