
భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఈవో రమాదేవి పై జరిగిన దాడి హేయమైన చర్య
బిజెపి చర్ల మండల అధ్యక్షులు నూపా రమేష్
నేటిదాత్రి చర్ల
చర్ల భారతీయ జనతా పార్టీ జిల్లా కౌన్సిలర్ నెంబర్ బాబా పాహి మ్ అధ్యక్షతన మండల కార్యాలయం నందు జరిగిన సమావేశంలో మండల అధ్యక్షులు నూప రమేష్ మాట్లాడుతూ
భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి దేవాలయం కార్యనిర్వహణాధికారి రమాదేవి పై పురుషోత్త పట్టణంలో దేవస్థానం భూమిలో కొంతమంది ఆక్రమణదారులు మరియు అరాచకవాదులు కలిసి చేసిన భౌతిక దాడి హేయమైన చర్యఅని ఆయన అన్నారు ఈ దాడిని ఖండిస్తూ ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని ఓ ప్రకటనలో కోరారు
గతంలో కూడా ఒకసారి ఈవో రమాదేవి పై మరియు ఆలయ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారని ఇలాంటి దాడిని తీవ్రంగా ఖండిస్తోంది కావున వెంటనే ఈ చర్యలు పాల్పడిన అరాచకవాదులను శిక్షించాలని ఈఓ రమాదేవి ఆరోగ్యంపై తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఇర్ఫా సుబ్బారావు కార్యదర్శిలు ముత్తవరపు శ్రీనివాసు చారి విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు