రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి నిప్పంటించిన.!

Ramadan

రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి నిప్పంటించిన దుండగులను కఠినంగా శిక్షించాలి

 

నిజాంపేట్, నేటి ధాత్రి

 

 

నిజాంపేట మండల కేంద్రంగా మంగళవారం రోజున దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ పర్వదినాన జరిగిన దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం, తెలంగాణ రాష్ట్రం గద్వాల్ జిల్లాలోని కేటి దొడ్డి మండలం ఇర్కుచెడు గ్రామంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు దళితులు బహుజనులు కలసి స్టాండ్ నిర్మాణం చేసి విగ్రహం ఏర్పాటు ప్రయత్నంలో అదే గ్రామానికి చెందిన మరో వర్గం వారు అంబేద్కర్ విగ్రహం పెట్టొదని దాని వల్ల మాకు ఇబ్బంది అవుతుందని ఘర్షణకు దిగారు.

ఘర్షణలో భాగంగా కొంతమంది దుండగులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పై పెట్రోల్ పోసి నిప్పంటించారు, అట్టి మంటలు ఆర్పే క్రమంలో విగ్రహంతో పాటు ఎస్ఐకి కూడా నిప్పు అంటుకుంది.

భారతదేశానికి స్వతంత్రం వచ్చి 76 ఏళ్లు గడుస్తున్న భారత రాజ్యాంగాన్ని రాసి భారతదేశానికి దిక్సూచిగా నిలిచిన రాజ్యాంగ నిర్మాత మహనీయుడు అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టడం దురదృష్టకరమని దళిత ప్రజా సంఘాలు మండిపడ్డాయి ఇలాంటి సంఘటనలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని దోషులను కఠినంగా శిక్షించి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను నమోదు చేసి ఉరిశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ఏప్రిల్ మాసం మొత్తం మహనీయుల మాసంగా దేశం రాష్ట్రం మహనీయుల జయంతులు చేస్తున్న క్రమంలో ఇలాంటి దుర్ఘటన జరగడం బాధాకరమని ఇలాంటి చర్యలు మళ్లీ పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన జీవోలు తెచ్చి రక్షణ కల్పించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిపిఎఫ్ జిల్లా అధ్యక్షుడు దుబాసి సంజీవ్, ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షులు గరుగుల శ్రీనివాస్, మాజీ ఉపసర్పంచ్ కొమ్మట బాబు, మాల మహానాడు మండల ఉపాధ్యక్షులు బండారి ఎల్లం, ఎమ్మార్పీఎస్ టీఎస్ మండల అధ్యక్షులు జనగామ స్వామి, డొక్కా రామస్వామి, కాకి బాలరాజ్, బ్యాగరి రాజు, గుడ్ల బాబు, కొమ్మాట ఎల్లం, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!