పదవ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం…
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

10వ తరగతి వార్షిక పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా జరిగాయి. రామకృష్ణాపూర్ పట్టణం లో పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థుల కోసం పట్టణంలో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆల్ఫాన్సా పాఠశాల, తవక్కల్ పాఠశాల ల్లో 291 మంది విద్యార్థులు 10 పరీక్షలు రాస్తున్నారు. పదోతరగతి పరీక్ష కేంద్రాల వద్ద రామకృష్ణాపూర్ పట్టణ ఎస్ఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.

పరీక్ష కేంద్రాల వద్ద ఆకతాయిలు అలజడి చేయకుండా పోలీస్ సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పరీక్ష కేంద్రాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా, బెల్లంపల్లి ఏసిపి రవికుమార్, మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి ల ఆదేశాల మేరకు పరీక్ష కేంద్రాల సమీపంలో 144 సెక్షన్ విదించడం జరిగిందని ఎస్ఐ పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాలలో విద్యార్థులు ప్రశాంతంగా పరీక్ష రాసేందుకు అన్ని చర్యలు చేపట్టడం జరిగిందని మండల విద్యాధికారి తెలిపారు. వేసవి కాలం కావడం తో పరీక్షా కేంద్రాల వద్ద మంచినీటి సౌకర్యం తో పాటు, వైద్య సిబ్బందిని సైతం నియమించడం జరిగిందన్నారు. ఏఎస్ఐ రజిత, పోలీస్ సిబ్బంది పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు చేశారు.