# ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్.
# ఘనంగా ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు..
# మేడే జెండాలను ఆవిష్కరించిన కార్మికులు, నాయకులు..
నర్సంపేట,నేటిధాత్రి :
పెరిగిపోతున్న దోపిడీ మతోన్మాద నియంతృత్వ విధానాలకు ప్రత్యామ్నాయం కేవలం ఎర్రజెండానే అని ఆ దిశలో ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాలని ప్రజలు వామపక్ష సామాజిక శక్తులను ఆదరించాలని అప్పుడే అసమానతలు లేని సమాజం సాధ్యమవుతుందని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు.బుదవారం అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే డే ను పురస్కరించుకొని ఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలో మల్లంపల్లి రోడ్డు జ్యోతి బస్ నగర్, కారల్ మార్క్స్ కాలనీ అంగడి సెంటర్ మున్సిపల్ కార్యాలయం పార్టీ డివిజన్ కార్యాలయం ఓంకార్ భవన్ ల వద్ద ఎర్రజెండాలనా ఆవిష్కరించారు. పెద్ద ఎత్తున కార్మిక ఐక్యతను చాటుతూ నినాదాలు చేశారు.ఈ సందర్భంగా పెద్దారపు రమేష్ మాట్లాడుతూ పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అనే నినాదాన్ని పునికిపుచ్చుకొని శ్రమజీవుల శ్రమను దోచుకుని అందరికీ చెందాల్సిన సంపదను కొంతమంది దక్కించుకొని అసమానతలు కారణమవుతున్న దోపిడీ పాలకులకు పెట్టుబడుదారులకు వ్యతిరేకంగా మే డే స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను చేపట్టాలని ఈ క్రమంలో పార్లమెంట్ ఎన్నికల్లో సైతం మతోన్మాదులకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్మికులు కర్షకులు కూలీలు శ్రమకు తగిన ఫలితం వంటలు గిట్టుబాటు ధర నిత్యవసర వస్తువుల ధరలకు అనుగుణంగా కూలీరేట్ల కోసం ఎర్రజెండా నీడన ఐక్యంగా పోరాడాలని కోరారు. ఆక్రమణ గురవుతున్న ప్రభుత్వ భూముల రక్షణకు నిలువ నీడలేని పేదలకు ఇండ్ల స్థలాలు ఇండ్లు కనీస అవసరాల కోసం చిత్తశుద్ధితో పోరాడేది కేవలం ఎర్రజెండా అని అన్నారు. వామపక్ష సామాజిక ఐక్యత కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ కార్యదర్శి మహమ్మద్ రాజా సాహెబ్, డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి, డివిజన్ పట్టణ నాయకులు ఉప్పుల పద్మ, ఏఐసిటియు జిల్లా అధ్యక్షుడు ఎండి మాసూక్, కుక్కల యాకయ్య, మోటం సురేష్, బండారు మల్లేష్, జన్ను జమున, గణిపాక బిందు, ఈర్ల రాజు, మహమ్మద్ మాశూక్ తదితరులు పాల్గొన్నారు.