కేంద్ర బడ్జెట్లో తెలంగాణ అభివృద్ధికి నిధులు కేటాయింపు నిల్..

ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్

నర్సంపేట,నేటిధాత్రి:

50 లక్షల 65 వేల కోట్ల రూపాయల కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కనీస కేటాయింపులు లేకపోవడం అన్యాయమని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు బడ్జెట్ రూపొందించకుండా దోపిడి వర్గాలకు అనుకూలంగా బడ్జెట్ ప్రవేశపెట్టడం సిగ్గుచేటని ఎంసిపిఐ (యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు.ప్రజా వ్యతిరేక కేంద్ర బడ్జెట్ ను, తెలంగాణ పట్ల వివక్షపూరిత కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈనెల 8న కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్ధం చేసి నిరసన తెలుపాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు నర్సంపేట పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆదాని అంబానీ లాంటి కార్పోరేట్ శక్తుల కోసమే కేంద్ర బడ్జెట్ అన్నట్లుగా ప్రవేశపెట్టి రైతులను కూలీలను కార్మికులను మహిళలను సామాజిక తరగతులను విస్మరించారని కనీసం గతంలో కేటాయించిన విధంగానైనా ఈ బడ్జెట్లో నిధులు కేటాయించకుండా కోతలు విధించి ప్రజా వ్యతిరేక బడ్జెట్ గా దోపిడి వర్గాల పాలకులుగా నిరూపించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.దేశానికి వెన్నెముక అయిన వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు నిధులు పెంచాల్సింది పోయి సబ్సిడీలు తగ్గించారని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు ఉపాధి దొరకకుండా బడ్జెట్లో కోత విధించారని పంటల ధరల నియంత్రణకు బడ్జెట్ కేటాయింపులే లేవని ఈ బడ్జెట్ పేదలపై భారాలు- కార్పోరేట్ శక్తులకు వరాలు అన్న మాదిరిగా ఉన్నదని, ఇంకొక వైపు తెలంగాణ రాష్ట్రానికి ఏ విధమైన బడ్జెట్ కేటాయింపులు లేకుండా తీరని అన్యాయానికి వివక్షతకు గురి చేశారని రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్న ఒరిగింది శూన్యమని గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని పరిపూర్ణంగా అమలు చేసే విధంగా బడ్జెట్ లేదని, ఇలాంటి పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్ర అభివృద్ధికి వివిధ తరగతులు వర్గాల అభ్యున్నతికి ప్రాధాన్యత ప్రకారం నిధులు కేటాయించే విధంగా పోరాడాలని ఈ క్రమంలో ఈనెల 8న కమ్యూనిస్టు కోఆర్డినేషన్ కమిటీ పిలుపుమేరకు ఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనం నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!