రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.

ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిన దమ్మున్న ప్రభుత్వం.

అనంతరం సిఎం చిత్ర పటానికి ఎమ్మెల్యే పాలాభిషేకం.

చిట్యాల, నేటిధాత్రి ;

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో గురువారం రోజున కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయబోతున్న సందర్భంగా మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి నవాబుపేట నుండి బైకు ర్యాలీ నిర్వహించి రైతు వేదిక వద్ద సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి భూపాల పెళ్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాలాభిషేకం చేశారు. అనంతరం రైతు వేదిక వద్ద ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు రైతుల తొ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో రుణమాఫీ చేయబోతున్నామని తెలిపారు. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి సాక్షిగా ఆగస్టు 15 లోపు 2లక్షల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, ప్రకటించిన తేదీలోపే సంపూర్ణంగా రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు. రైతును రాజును చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. గత ప్రభుత్వం రైతులకు మాయమాటలు చెప్పి మోసం చేస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీ మిత్తిలకు కూడా సరిపోలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండలపార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముకిరాల మధు వంశీ కృష్ణ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, నియోజకవర్గ ఇన్చార్జి మార్క విజయ్ కుమార్, మాజీ జెడ్పిటిసి ఓరం సమ్మయ్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు గుమ్మడి శ్రీదేవి,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చిలుకల రాయకోమురు, గ్రామ శాఖ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్,మండల నాయకులు గ్రామాల కాంగ్రెస్ నాయకులు, రైతులు, అభిమానులు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *