పదేళ్ల పాలనలో బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజల్ని మోసం చేశాయి.
ఎమెల్యే గండ్ర సత్యనారాయణ రావు.
చిట్యాల, నేటి ధాత్రి :
చిట్యాల మండలం:
పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ పాలన కొనసాగుతుందని, పదేళ్ల పాలనలో బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజల్ని మోసం చేశాయని భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు* అన్నారు. బుధవారం రోజున ఎమ్మెల్యే జీఎస్సార్ ఉదయం నుండి సాయంత్రం వరకు భూపాలపల్లి నియోజకవర్గంలోని చిట్యాల మండలంలోని ఎంపీటీసీ కేంద్ర గ్రామాలయిన అందుకుతండ, నైన్పాక, జడల్పేట, ఒడితల, గోపాల్పూర్, చల్లగరిగ, జూకల్, తిర్మలాపూర్, నవాబుపేట, చిట్యాల-1,2* గ్రామాలల్లో విస్తృతంగా పర్యటించారు. చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి అధ్యక్షతన ఆయా గ్రామాలల్లో ముఖ్య నాయకులతో సమావేశాలను ఏర్పాటు చేశారు. ఈ సమావేశాలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలతో హాజరయ్యారు. అనంతరం ఆయా గ్రామాల సమావేశాలలో ఎమ్మెల్యే జీఎస్సార్ మాట్లాడుతూ… పదేళ్ల పాలనలో బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజల్ని మోసం చేశారని ఆరోపించారు.
ఈ ఎన్నికల్లో బీజేపీ కి ఓటు వేస్తే రాజ్యాంగాన్ని మార్చుతారని, రిజర్వేషన్లు మార్చే కుట్ర జరుగుతుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలైన సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలను బీజేపీ అనుబంధ సంస్థలుగా మార్చుకుని దేశ వినాశకరమైన, దేశ అస్తిత్వానికి ప్రమాదకరమైన పాలనను కొనసాగిస్తోందని ఎమ్మెల్యే విమర్శించారు. మన దేశం కోసం గాంధీ కుటుంబం సర్వం త్యాగం చేసిందని, ఇప్పుడు ఆ కుటుంబం నుండి వచ్చిన రాహుల్ గాంధీ గారిని ప్రధానిని చేయాలని కోరారు. దేశం కోసం నెహ్రూ, ఇందిరా జైలుకు వెళ్లారని, రాహుల్ గాంధీ ది త్యాగాల కుటుంబమని గుర్తు చేశారు. వరంగల్ పార్లమెంట్ లో డాక్టర్ కడియం కావ్యను అత్యధిక మెజారిటీ తో గెలిపించుకుందామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఐదు గ్యారంటీలను అమలు చేశామని గుర్తు చేశారు. ఈ సమావేశాలల్లో పలువురు రాష్ట్ర, నియోజకవర్గ ముఖ్య నాయకులతో పాటు చిట్యాల మండలంలోని ఆయా గ్రామాల గ్రామ కమిటీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు.